Share News

AP Politicts: ఎమ్మెల్యే శిల్పా వర్సెస్ జడ్పీటీసీ గోకుల్.. నంద్యాలలో ఏం జరుగబోతోంది?

ABN , Publish Date - Jan 26 , 2024 | 04:39 PM

Andhrapradesh: నంద్యాల ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిశోర్‌ రెడ్డి, నంద్యాల జెడ్పీటీసీ గోకుల్ కృష్ణారెడ్డిల మధ్య వర్గపోరు కొనసాగుతోంది. శిల్పా రవి స్థానికేతరుడని.. నంద్యాల టికెట్ తనకే ఇవ్వాలంటూ వైసీపీ పెద్దలను గోకుల్ కోరుతున్నారు. ఎమ్మెల్యే రవిపై విమర్శలు గుప్పిస్తూ.. హెచ్చరికలు చేయడం చర్చనీయంశంగా మారింది.

AP Politicts: ఎమ్మెల్యే శిల్పా వర్సెస్ జడ్పీటీసీ గోకుల్.. నంద్యాలలో ఏం జరుగబోతోంది?

నంద్యాల, జనవరి 26: నంద్యాల ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిశోర్‌ రెడ్డి (Nandyala MLA Shilpa Ravichandra Kishore Reddy), నంద్యాల జెడ్పీటీసీ గోకుల్ కృష్ణారెడ్డిల (Nandyala ZPTC Gokul Krishna Reddy) మధ్య వర్గపోరు కొనసాగుతోంది. శిల్పా రవి స్థానికేతరుడని.. నంద్యాల టికెట్ తనకే ఇవ్వాలంటూ వైసీపీ పెద్దలను గోకుల్ కోరుతున్నారు. ఎమ్మెల్యే రవిపై విమర్శలు గుప్పిస్తూ.. హెచ్చరికలు చేయడం చర్చనీయంశంగా మారింది. ఈ క్రమంలో రెండు దశాబ్దాలుగా స్థానికేతరుల కబంధ హస్తాల్లో నలిగిపోతున్న నంద్యాలకు విముక్తి కల్పించాలంటూ గోకుల్ బుధవారం ఆత్మ గౌరవ ఓదార్పు యాత్ర చేపట్టారు. అయితే గోకుల్ యాత్రను పోలీసులు అడ్డుకున్నారు. పోలీసుల తీరుపై జెడ్పీటీసీ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. అరాచకాలన్నీ బయటపెడతానంటూ ఎమ్మెల్యే రవికి బహిరంగంగా వార్నింగ్ కూడా ఇచ్చారు.

అయితే ఓదార్పు యాత్రను అడ్డుకున్నప్పటికీ వెనక్కి తగ్గేదే లే అంటూ నేడు (శుక్రవారం) గోకుల్ మౌనదీక్షకు పూనుకున్నారు. దీంతో మౌనదీక్షను కూడా భగ్నం చేసేందుకు పోలీసులు ప్రయత్నాలు చేపట్టారు. గోకుల్ స్వగ్రామం భీమవరంలో పోలీస్ పికెటింగ్ ఏర్పాటు చేశారు. గ్రామానికి భారీగా పోలీసు బలగాలు చేరుకుంటున్నాయి. మరోవైపు గోకుల్ కార్యాలయం పోలీసుల అధీనంలోకి వెళ్లింది. విషయం తెలిసిన గోకుల్ అభిమానులు భారీగా గ్రామానికి భారీగా చేరుకున్నారు. నంద్యాల - భీమవరం రహదారిలో పోలీస్ చెక్ పోస్ట్ ఏర్పాటు చేశారు. ఎలాగానై మౌనదీక్షను అడ్డుకోవాలని పోలీసులు భావిస్తుండగా.. మౌన దీక్ష చేసి తీరుతానని గోకుల్ తేల్చిచెబుతున్నారు. దీంతో నంద్యాలలో టెన్షన్ వాతావరణం నెలకొంది.


శిల్పా రవి లక్ష్యంగా విమర్శలు...

కాగా... నంద్యాల వైసీపీ జెడ్పీటీసీగా ఉన్న గోకుల్ కృష్ణారెడ్డి వచ్చే ఎన్నికలలో నంద్యాల అసెంబ్లీ టికెట్ ఆశిస్తున్న సంగతి తెలిసిందే. అందుకోసం జనాల్లోకి వెళుతూ.. ఎమ్మెల్యే శిల్పా రవి లక్ష్యంగా విమర్శలు గుప్పిస్తున్నారు. జనాల్లో సింపతి పొందేందుకు లోకల్, నాన్ లోకల్ అని అంటూ వ్యాఖ్యలు చేస్తున్నారు. మరోవైపు గోకుల్ కృష్ణారెడ్డిని అడ్డుకునేందుకు ఎమ్మెల్యే శిల్పా రవి గట్టి ప్రయాత్నాలు చేస్తున్నారు. గోకుల్ యాత్ర గురించి సమాచారం అందిన వెంటనే పోలీసుల చేత బ్రేక్ వేయించినట్లు సమాచారం. దీంతో నంద్యాలలో ఇద్దరు నేతల ఆధిపత్య పోరు తీవ్రస్థాయికి చేరింది.

మరిన్ని ఏపీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి...

Updated Date - Jan 26 , 2024 | 05:02 PM