Chandrababu: మే 13న భస్మాసుర వధ జరగాలి
ABN , Publish Date - Apr 14 , 2024 | 09:30 PM
జగన్ భస్మాసురుడిలా వ్యవహరిస్తున్నాడని, మే 13న భస్మాసుర వధ జరగాలని టీడీపీ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడు ప్రజలకు పిలుపునిచ్చారు. ఆదివారం ఆయన గాజువాక ప్రజాగళం సభలో ప్రసంగించారు. అవి ఆయన మాటల్లోనే..
విశాఖ: జగన్ భస్మాసురుడిలా వ్యవహరిస్తున్నాడని, మే 13న భస్మాసుర వధ జరగాలని టీడీపీ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడు ప్రజలకు పిలుపునిచ్చారు. ఆదివారం ఆయన గాజువాక ప్రజాగళం సభలో ప్రసంగించారు. అవి ఆయన మాటల్లోనే..
‘‘జగన్ భస్మాసురుడికి ఓట్లు వేసినందుకు.. ఇప్పుడు మనపైనే చేయి పెడుతున్నాడు.. మే 13న భస్మాసుర వధ జరగాలి. ఆస్తి పన్ను 15 శాతం చొప్పున పెంచేస్తున్నారు. పులివెందులలో గొడ్డలితో చేసే పంచాయతీలు... విశాఖలో కావాలా. ఫ్యాన్ ఎప్పుడో పాడైంది... గొడ్డలి గుర్తు పెట్టుకో ప్రజలు ఓట్లు వేస్తారేమో. అన్నివ్యవస్థలను విధ్వంసం చేస్తున్నారు. గాజువాకలో ఏ చిన్న అభివృద్ధి అయినా జరిగిందా. అభివృద్ధికి భరోసా ఇవ్వడానికే నేను వచ్చాను. సంపద సృష్టిలో ముందుకు తీసుకెళ్తోన్న వ్యక్తి మోదీ. 2029కి దేశంలోనే నెంబర్ ఒన్ రాష్ట్రంగా చేస్తాను. ఎన్ని కేసులు ఉన్నాయో చెప్పాలని అఫిడవిట్‌లో పెట్టాలని డీజీపీ ఒక లేఖ రాశాను. మీకోసం పోరాడితే జగన్‌కి విరోధిని. జగన్‌పై రాళ్ల దాడిని అందరూ ఖండించాను.. కానీ నేనే రాయి వేయించానని ప్లకార్డులతో ప్రదర్శిస్తున్నారు. ఇప్పుడు నాపైనే రాళ్లు వేయిస్తున్నారు’’.
‘‘ఇలాంటి అన్యాయాలను ఇంకా సహించాలా..? ప్రధాని మంత్రి సభలోనే మైక్ కట్ చేస్తారా.. ఆరోజు ఆఫీసర్లపై ఎందుకు చర్యలు తీసుకోలేదు ఎందుకు. జగన్‌పై రాళ్లు వేసి 24 గంటలు అవుతున్నా సీఎస్ ఎందుకు బాధ్యత తీసుకోలేదు. ఇంటెలిజెన్స్ ఏం చేస్తోంది. స్టీల్ ప్లాంట్ గురించి నాయకత్వం వహించమని జగన్ కోరాను.. ఢిల్లీ వెళ్లి మాట్లాడదామని అడిగితే రాలేదు. ఇప్పుడు జగన్‌కు ఓటు అడిగే హక్కు ఉందా. వాజ్ పేయి సమయంలో ప్రైవేటుపరం కాకుండా నేను ఆపించాను. మేము అధికారంలోకి వస్తే స్టీల్ ప్లాంట్‌ను కాపాడుతాం. వాలంటీర్లను బానిసలుగా చేసి జీవితాంతం చాకిరీ చేయించుకోవాలని జగన్ చూస్తున్నాడు. దిబ్బపాలెం మత్స్యకారులకు ఏరాడలో జెట్టీ నిర్మిస్తాం. కూటమిలో ఎక్కడ ఏ అభ్యర్థి పోటీ చేసినా పరస్పరం సహకరించుకోవాలి. కష్టించే పని చేసే మూడు పార్టీల వారికి గుర్తింపు ఇచ్చే బాధ్యత తీసుకుంటాం’’.. అని చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు.