Nara Lokesh: జగన్ కంపెనీలు కళకళ...రాష్ట్ర ఖజానా దివాళ!
ABN , Publish Date - Mar 05 , 2024 | 12:05 PM
‘మీ బిడ్డనంటున్నాడు... జర జాగ్రత్త ప్రజలారా..’ అంటూ ఎక్స్ వేదికగా టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ జనాలను అప్రమత్తం చేశరాు. జగన్ రాష్ట్రాన్ని దోచుకుతింటున్న తీరును ఆయన కళ్లకు కట్టారు. ‘జగన్ కంపెనీలు కళకళ...రాష్ట్ర ఖజానా దివాళ!’ అని పేర్కొన్నారు. గత అయిదేళ్లుగా ముఖ్యమంత్రి జగన్ రెడ్డి సొంత కంపెనీలన్నీ వేలకోట్ల లాభాలతో కళకళలాడుతుంటే... అడ్డగోలు అప్పులతో రాష్ట్ర ఖజానాను మాత్రం దివాలా తీయించారని నారా లోకేష్ అన్నారు.
అమరావతి: ‘మీ బిడ్డనంటున్నాడు... జర జాగ్రత్త ప్రజలారా..’ అంటూ ఎక్స్ వేదికగా టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా (Nara Lokesh) లోకేష్ జనాలను అప్రమత్తం చేశరాు. జగన్ (CM Jagan) రాష్ట్రాన్ని దోచుకుతింటున్న తీరును ఆయన కళ్లకు కట్టారు. ‘జగన్ కంపెనీలు కళకళ...రాష్ట్ర ఖజానా దివాళ!’ అని పేర్కొన్నారు. గత అయిదేళ్లుగా ముఖ్యమంత్రి జగన్ రెడ్డి సొంత కంపెనీలన్నీ వేలకోట్ల లాభాలతో కళకళలాడుతుంటే... అడ్డగోలు అప్పులతో రాష్ట్ర ఖజానాను మాత్రం దివాలా తీయించారని నారా లోకేష్ అన్నారు.
YCP: వైసీపీకి గుడ్ బై చెప్పేందుకు బయలుదేరిన మంత్రి.. సాయంత్రం టీడీపీలోకి..
ఒక్కటంటే ఒక్క కొత్త కంపెనీ తెచ్చి యువతకు ఉద్యోగాలివ్వడం చేతగాని ముఖ్యమంత్రి... అప్పులు తేవడంలో మాత్రం పీహెచ్‌డీ చేశారని నారా లోకేష్ అన్నారు. రాష్ట్ర పరిపాలనా కేంద్రం అయిన సచివాలయాన్ని (Secretariat) రూ.370 కోట్లకు తాకట్టుపెట్టిన జగన్... తాజాగా రాష్ట్రంలో ఖనిజసంపదను తాకట్టుపెట్టి రూ.7వేల కోట్లు అప్పు తెచ్చారన్నారు. ఇప్పటికే మందుబాబులను తాకట్టుపెట్టి 33వేల కోట్లు అప్పు తెచ్చిన జగన్ జమానాలో ఇక మిగిలింది 5 కోట్ల మంది జనం మాత్రమేనని నారా లోకేష్ అన్నారు. ఇప్పటికే తాను మీ బిడ్డనంటూ వేదికలపై ఊదర గొడుతున్న జగన్మోహన్ రెడ్డి మాటల వెనుక అంతర్యాన్ని గుర్తించి రాబోయే 2 నెలలపాటు ఆయనతో జాగ్రత్తగా ఉండాల్సిందిగా రాష్ట్రప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నానని నారా లోకేష్ తెలిపారు.
AP Politics: నంద్యాల లోక్ సభ బరిలో బైరెడ్డి శబరి..? ఏ పార్టీ నుంచి అంటే..?
మరిన్ని ఏపీ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి.