Home » Anam Venkata Ramana Reddy
Andhrapradesh: ‘‘ 2019లో చంద్రబాబును ఉద్దేశించి అసెంబ్లీలో నువ్వు ముఖ్యమంత్రిగా ఉండగా ప్రతిపక్ష హోదాపై నువ్వు చేసిన వ్యాఖ్యలు గుర్తులేవా జగన్.. అసలు నీకు ప్రతిపక్షహోదా ఎందుకు ఇవ్వాలి జగన్.. నీకు ఏం అర్హత ఉంది. జగన్ మినహా మిగిలిన వైసీపీ 10 మంది ఎమ్మెల్యేలకు 8,93,333ఓట్లు 2024 ఎన్నికల్లో వచ్చాయి . 8.93లక్షల మంది ప్రజల సమస్యలపై అసెంబ్లీలో చర్చించాల్సిన బాధ్యత వైసీపీ ఎమ్మెల్యేలకు లేదా’’ అంటూ ఆనం మండిపడ్డారు.
Andhrapradesh: అమరులైన పోలీసులకు మనస్ఫూర్తిగా అంజలి ఘటిస్తున్నట్లు పవన్ కళ్యాణ్ తెలిపారు. నేడు పోలీసు అమర వీరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా సిబ్బంది సేవలను ప్రతి ఒక్కరూ గుర్తు చేసుకోవాలన్నారు. వ్యక్తిగత జీవితంకంటే తమ విధులకు ఎక్కువ సమయం కేటాయిస్తూ ఉంటారని..
Andhrapradesh: వైఎస్ జగన్... హాఫ్ టిక్కెట్... హిందువా? క్రిష్టియనా? అంటూ ఆనం వెంకటరమణారెడ్డి ప్రశ్నించారు. జగన్ ముత్తాత వెంకటరెడ్డి ముఠా నాయకుడని... వందేళ్ల కిందట 1925లో క్రిష్టియన్‌గా మారారని... అప్పటి నుంచి వారి కుటుంబమంతా ఏసుప్రభువునే నమ్ముకున్నారని తెలిపారు.
వైసీపీ కీలక నేత, మాజీ మంత్రి ఆర్కే రోజాపై టీడీపీ నేత ఆనం వెంకటరమణారెడ్డి మరోసారి విరుచుకుపడ్డారు. పనికి మాలిన మాటలు మాట్లాడే రోజక్కకు ఇంకా సిగ్గు రాలేదన్నారు. తిరుమలను దోపిడి చేసిన రోజాకు ప్రోటోకాల్ దర్శనం విడ్డూరంగా ఉందని పేర్కొన్నారు.
ఏపీలోని మున్సిపాల్టీలు, కార్పొరేషన్లని మాజీ సీఎం జగన్, మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ దోచుకున్నారని తెలుగుదేశం పార్టీ ఆంధ్రప్రదేశ్ అధికార ప్రతినిధి ఆనం వెంకటరమణా రెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. గురువారం నాడు టీడీపీ పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు.
ఎన్నికల ఫలితాల్లో టీడీపీ విజయం తథ్యమని.. పార్టీ అధినేత చంద్రబాబు సీఎం కాబోతున్నారని తెలిసి, అధికారుల్లో వణుకు మొదలైందని టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి ఆనం వెంకటరమణారెడ్డి అన్నారు. పారిపోయేందుకు సిద్దమవుతున్నారు. టీటీడీలో ధర్మారెడ్డి పెద్ద బ్రోకర్ అని.. కరుణాకర్ రెడ్డి చిన్న బ్రోకర్ అని విమర్శించారు. ఎంపీ అవినాశ్ రెడ్డి వైఎస్ వివేకా హత్య కేసు నుంచి బయటపడేసేందుకు ధరారెడ్డి ఢిల్లీలో లాబీయింగ్ చేశాడన్నారు. జగన్ కుటుంబ సభ్యులే ఆ మాట చెప్పారన్నారు.
హైదరాబాద్‌లో ఉన్న లోటస్ పాండ్, బెంగుళూరులో ఉన్న ప్యాలెస్, మాల్‌ను ఎన్నికల అఫిడవిట్లో సీఎం జగన్ రెడ్డి ( CM Jagan) ఎందుకు చూపించలేదని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి ఆనం వెంకట రమణారెడ్డి (Anam Venkata Ramana Reddy) ప్రశ్నించారు. టీడీపీ కార్యాలయంలో ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ...స్థిరాస్తులే లేని జగన్ కుటుంబానికి లక్షలాది కోట్లా ఆస్తులా.. ? అవి ఎక్కడి నుంచి వచ్చాయని నిలదీశారు.
మహిళలపై అసభ్యకరమైన ప్రచారం చేస్తున్న వైసీపీ కార్యకర్తలపై ఎటువంటి చర్యలు తీసుకున్నారో నివేదికను ఇవ్వాలంటూ ఏపీ డీజీపీకి ఈసీ ఆదేశాలు జారీ చేసింది. వివరణ ఇవ్వాల్సిందిగా డీజీపీని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముకేష్ కుమార్ మీనా ఆదేశించారు. టీడీపీ అధికార ప్రతినిధి ఆనం వెంకటరమణా రెడ్డి ఫిర్యాదుపై ఈసీ స్పందించింది.
ఏపీ సీఎం జగన్‌పై రాయితో దాడి జరగడంపై రాజకీయ రచ్చ కొనసాగుతూనే ఉంది. రాయి విసిరిన వ్యక్తిని పోలీసులు గుర్తించారనే ప్రచారం జరగుుతున్నా.. అధికారికంగా పోలీసులు ఎటువంటి ప్రకటన చేయలేదు. నిందితులను గుర్తించేందుకు 8 ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసినట్లు తెలుస్తోంది. ఈక్రమంలో జగన్‌పై దాడి చేసిన వారి ఆచూకీ తెలియజేస్తే రూ.2లక్షలు పారితోషికం ఇస్తామంటూ విజయవాడ సిటీ పోలీస్ కమిషనర్ చేసిన ప్రకటనపై నెల్లూరు జిల్లాకు చెందిన టీడీపీ సీనియర్ నేత ఆనం వెంకట రమణారెడ్డి స్పందించారు.
నెల్లూరు: ఏపీ తీరప్రాంతంపై ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కళ్లు పడ్డాయని.. గేట్ వే ఆఫ్ జగన్‌గా మార్చి దోచుకునేందుకు కుట్ర చేస్తున్నారని, రంగంలోకి విజయసాయిరెడ్డిని దింపి దోపిడీకి ప్రణాళికలు రచిస్తున్నారని తెలుగుదేశం అధికార ప్రతినిధి ఆనం వెంకటరమణారెడ్డి ఆరోపించారు.