Share News

Bhanuprakash: ఆర్జీవీ.. జగన్‌పై అలా సినిమా తీస్తే బాగుంటుందేమో..

ABN , Publish Date - Oct 08 , 2024 | 12:12 PM

Andhrapradesh: ఎన్నికల్లో వైసీపీ అధినేత జగన్ ఓడిపోయిన తరువాత మతిస్థిమితం కోల్పోయినట్టు ఉన్నారని వ్యాఖ్యలు చేశారు. కూటమి పాలనలో వికసిత ఆంధ్రప్రదేశ్ కనిపిస్తోందన్నారు. ఐదేళ్ల పాలనలో జగన్ స్టిక్కర్ సీఎంగా మిగిలిపోయారంటూ ఎద్దేవా చేశారు.

Bhanuprakash: ఆర్జీవీ.. జగన్‌పై అలా సినిమా తీస్తే బాగుంటుందేమో..
BJP Leader BhanuPrakash

నెల్లూరు, అక్టోబర్ 8: దేశంలో బీజేపీ అనుకూల పవనాలు వీస్తున్నాయని ఆ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి భానుప్రకాశ్ (BJP Leader BhanuPrakash) అన్నారు. మంగళవారం మీడియాతో మాట్లాడుతూ.. హర్యానా, జమ్మూ కాశ్మీర్ రాష్ట్రాల ఎన్నికల్లో బీజేపీకి అనుకూల పరిస్థితి కనిపిస్తోందన్నారు. ఎన్నికల్లో వైసీపీ అధినేత జగన్ (Former Cm YS Jagan) ఓడిపోయిన తరువాత మతిస్థిమితం కోల్పోయినట్టు ఉన్నారని వ్యాఖ్యలు చేశారు. కూటమి పాలనలో వికసిత ఆంధ్రప్రదేశ్ కనిపిస్తోందన్నారు. ఐదేళ్ల పాలనలో జగన్ స్టిక్కర్ సీఎంగా మిగిలిపోయారంటూ ఎద్దేవా చేశారు. ఏపీ ఆర్ధిక పరిస్థితి బాగోలేకపోయినా, మంచి సంకల్పంతో కూటమి ప్రభుత్వం ముందుకు వెళ్తుందన్నారు. హామీలు నిలబెట్టుకుంటున్న కూటమి ప్రభుత్వంపై, జగన్ అసత్య ఆరోపణలు చేయిస్తున్నారని మండిపడ్డారు.

Chittoor: టమోటా తెచ్చిన తంటా.. 250 కిలోమీటర్లు వెంటాడిన ముఠా..!


చంద్రబాబు (CM Chandrababu) గాల్లో తిరిగే ముఖ్యమంత్రి కాదని స్పష్టం చేశారు. టీటీడీ మాజీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి తిరుమలకు చెందిన కొన్ని రిజర్వేషన్లలో మార్పులు తీసుకొచ్చింది వాస్తవం కాదా అని ప్రశ్నించారు. ఏపీ ప్రజలు ప్రతిపక్ష హోదా ఇవ్వకపోడంతో జగన్ కోర్టులని ఆశ్రయించారన్నారు. ప్రభుత్వం నుంచి ఒక్క రూపాయి టీటీడీకి రాదని.. టీటీడీ నుంచే ప్రభుత్వానికి నిధులు వస్తున్నాయన్నారు. అవినీతి డబ్బు ఎలా సంపాదించాలని... అక్రమాలు ఎలా చేయాలో జగన్ దేశానికే ఒక మోడల్‌గా నిలుస్తారంటూ వ్యాఖ్యలు చేశారు. రాంగోపాల్ వర్మ... జగన్ రాష్ట్రాన్ని నాశనం చేసిన తీరుపై సినిమా తీయాలన్నారు.

Assembly Elections: రెండు రాష్ట్రాల్లో లీడ్‌లో ఉన్న ప్రముఖులు వీరే


టెక్కలి ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్, మాధురిలు తిరుమల ధార్మిక క్షేత్రానికి వచ్చి ఫోటో షూట్ చేశారని.. నిన్న తిరుమలలో జరిగిన దువ్వాడ జంట ఫోటో షూట్ ఘటనపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. మరోసారి తిరుమల ప్రతిష్టకి భంగం కలిగించే ఘటనలు చేస్తే అలిపిరి దాటనివ్వమని హెచ్చరించారు. ఇక జగన్ జీవితంలో అధికారంలోకి రాలేరని స్పష్టం చేశారు. హిందూ ఆలయాలు, హిందూ మతవిశ్వాసాలపై నమ్మకం లేని వ్యక్తి జగన్ అంటూ మండిపడ్డారు. ధర్మారెడ్డి, కరుణాకర్ రెడ్డి, సుబ్బారెడ్డిలు తిరుమలకి పట్టిన దరిద్రం అంటూ విరుచుకుపడ్డారు. తిరుమలలో కమిషన్ తీసుకున్న ఘనత గత ప్రభుత్వంలోనే సాధ్యమైందన్నారు. రాబోయే రోజుల్లో గత ప్రభుత్వంపై విచారణ, చర్యలు ఉంటాయని వెల్లడించారు. కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాన్ని ఆర్ధికంగానే కాకుండా, అన్ని విధాలుగా ఆదుకుంటుందని భానుప్రకాశ్ స్పష్టం చేశారు.


ఇవి కూడా చదవండి..

CM Chandrababu: బెజవాడ న్యాయవాదుల బృందం రోడ్డు ప్రమాదంపై సీఎం చంద్రబాబు దిగ్భ్రాంతి

Buddavenkanna: నువ్వా పేదల కోసం మాట్లాడేది.. జగన్‌పై బుద్దా ఫైర్

Read Latest AP News And Telugu News

Updated Date - Oct 08 , 2024 | 12:30 PM