Anna Canteen: నెల్లూరులో అన్నా క్యాంటీన్‌ను ప్రారంభించిన మంత్రి నారాయణ
ABN , Publish Date - Aug 16 , 2024 | 10:25 AM
Andhrapradesh: నెల్లూరు నగరంలోని చేపల మార్కెట్ వద్దా అన్నా క్యాంటిన్‌ను మంత్రి నారాయణ ప్రారంభించారు. ఈ సందర్భంగా నారాయణ మాట్లాడుతూ... ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా 99 క్యాంటీన్లు ప్రారంభించామని తెలిపారు. 2014 -19 మధ్య 203క్యాంటీన్లు ప్రభుత్వం మంజూరు చేసిందని... 173 క్యాంటీన్లు అప్పుడు ప్రారంభించామన్నారు.
నెల్లూరు, ఆగస్టు 16: నెల్లూరు నగరంలోని చేపల మార్కెట్ వద్దా అన్నా క్యాంటిన్‌ను మంత్రి నారాయణ (Minister Narayana) ప్రారంభించారు. ఈ సందర్భంగా నారాయణ మాట్లాడుతూ... ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా 99 క్యాంటీన్లు ప్రారంభించామని తెలిపారు. 2014 -19 మధ్య 203క్యాంటీన్లు ప్రభుత్వం మంజూరు చేసిందని... 173 క్యాంటీన్లు అప్పుడు ప్రారంభించామన్నారు. రోజుకు రెండు లక్షల 25 వేల మంది అన్న క్యాంటీన్లో భోజనం చేసేవాళ్లన్నారు.
Anna Canteens: రాష్ట్రవ్యాప్తంగా సందడి అన్న క్యాంటీన్ల ప్రారంభోత్సవాలు
పేదలకు అవసరమైన ప్రదేశాలలో అన్న క్యాంటీన్లు ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. తమ ప్రభుత్వం అధికారంలోకి రాగానే అన్న క్యాంటీన్ ఏర్పాటు చేస్తామని ఎన్నికల్లో వాగ్దానం చేశామని.. వంద రోజుల్లో అన్న క్యాంటీన్ ఏర్పాటు చేయాలని సీఎం చెప్పారన్నారు. అధికారంలోకి వచ్చిన రెండు నెలల్లోనే 100 క్యాంటీన్లు ఏర్పాటు చేశామననారు. మిగిలినవి సెప్టెంబర్ నెల ఆఖరిలోగా ఏర్పాటు చేస్తామన్నారు.పేదలకు నాణ్యమైన రుచికరమైన ఆహారం 5 రూపాయలకే మూడు పూటలా అందిస్తున్నాం. చాలామంది దాతలు అన్నా క్యాంటీన్లకు సహాయం అందించడానికి ముందుకు వస్తున్నారని తెలిపారు. దాతలు ఇచ్చిన నిధులతో కార్పస్ ఫండ్ ఏర్పాటు చేసి అన్నా క్యాంటీన్లను నిరంతరం కొనసాగిస్తామని మంత్రి నారాయణ స్పష్టం చేశారు.
ISRO SSLV-D3: ఎస్‌ఎస్‌ఎల్వీ డీ-3 ప్రయోగం విజయవంతం
ఇటు విజయనగరంలో రెండు అన్నా క్యాంటీన్లను మంత్రి కొండపల్లి శ్రీనివాస్, ఎం.పి కలిశెట్టి అప్పలనాయుడు, ఎమ్మెల్యే పూసపాటి అదితిగజపతిరాజు, కేంద్ర మాజీ మంత్రి పూసపాటి అశోక్ గజపతిరాజు రంభించారు. ఈ సందర్భంగా అశోక్ గజపతిరాజు మాట్లాడుతూ.. అన్నం పెట్టే వారిపై కూడా జగన్ రెడ్డి ప్రభుత్వం కేసులు బనాయించిందని మండిపడ్డారు. అన్ని సేవలకన్నా పేదవారికి ఆహారం అందింటం మిన్న అని అన్నారు. తరతరాల నుంచి విజయనగరంలో ఆకలితీర్చే సంస్కృతి కొనసాగుతోందన్నారు. అన్నా క్యాంటీన్లకు విరాళాలు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు.
మంత్రి కొండపల్లి శ్రీనివాసరావు మాట్లాడుతూ...‘‘ నా నెల జీతం అన్నా క్యాంటీన్ల నిర్వహణకు విరాళంగా ఇస్తున్నాను. తొలి విడతలో విజయనగరంలోని రెండు అన్నా క్యాంటీన్లను ప్రారంభిస్తున్నాం. మలి విడతలో మరిన్ని అన్నా క్యాంటీన్లను ప్రారంభిస్తాం’’అని మంత్రి తెలిపారు. ప్రతీ సోమవారం జిల్లా కలెక్టరేట్‌లోని గ్రీవెన్స్‌కు వచ్చే అర్జీదారుల కోసం అన్నా క్యాంటీన్ నడిపే ఏర్పాట్లు చేస్తున్నామని ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు వెల్లడించారు.
ఇవి కూడా చదవండి..
CM Revanth Reddy: ఢిల్లీ చేరుకున్న సీఎం రేవంత్.. ఏం జరగబోతోంది?
Lokesh: 100 రోజుల్లోనే అన్నా క్యాంటీన్లు ప్రారంభించాం..
Read Latest AP News And Telugu News