Share News

Minister Narayana: అన్న క్యాంటీన్లపై మంత్రి నారాయణ కీలక ప్రకటన

ABN , Publish Date - Jun 28 , 2024 | 09:58 PM

అన్న క్యాంటీన్లపై మంత్రి నారాయణ (Minister Narayana) కీలక ప్రకటన చేశారు. ఈ క్యాంటీలపై ప్రత్యేక దృష్టి సారించామని తెలిపారు. 203 అన్నా క్యాంటీన్లను 100 రోజుల్లో ఓపెన్ చేయాలని సీఎం చంద్రబాబు చెప్పారని.. ఆ మేరకు స్థలాల సేకరణ చేపడుతున్నామని, ఇప్పటికే కొన్నిటిని గుర్తించామని వివరించారు.

Minister Narayana: అన్న క్యాంటీన్లపై  మంత్రి నారాయణ కీలక ప్రకటన
Minister Narayana

అమరావతి: అన్న క్యాంటీన్లపై మంత్రి నారాయణ (Minister Narayana) కీలక ప్రకటన చేశారు. ఈ క్యాంటీలపై ప్రత్యేక దృష్టి సారించామని తెలిపారు. 203 అన్నా క్యాంటీన్లను 100 రోజుల్లో ఓపెన్ చేయాలని సీఎం చంద్రబాబు చెప్పారని.. ఆ మేరకు స్థలాల సేకరణ చేపడుతున్నామని, ఇప్పటికే కొన్నిటిని గుర్తించామని వివరించారు.

టిడ్కో ఇళ్లను వైసీపీ ప్రభుత్వం నీరు గార్చిందని మండిపడ్డారు. మున్సిపల్ శాఖలో చేయాల్సి ఇంకా చాలా ఉందన్నారు. టిడ్కో ఇళ్లపై స్టడీ చేస్తున్నామని.. సీఎం చంద్రబాబుతో చర్చించిన వెంటనే పనులను ప్రారంభిస్తామని తెలిపారు. 2014 నుంచి 2019 దాకా ఎటువంటి అభివృద్ధి జరిగిందో మళ్లీ నెలరోజుల్లో రివ్యూలన్నీ జరిపి పరుగులు పెట్టిస్తామని చెప్పారు.


ఈరోజు (శుక్రవారం) మున్సిపల్ కమిషనర్లతో సమావేశం నిర్వహించారు. డ్రింకింగ్, రోడ్లు, ఎలక్ట్రిసిటీ ప్రాజెక్టులపై రివ్యూ నిర్వహించారు. మంచి వాటర్‌ను 24 గంటలు ఇవ్వాలని నిర్ణయించినట్లు తెలిపారు. రూ. 5350 కోట్లు 2019 లో డ్రింకింగ్, సివరేజెస్ కోసం సాంక్షన్ చేశామని తెలిపారు. వైసీపీ ప్రభుత్వం ఐదేళ్లలో 429 కోట్లు మాత్రమే ఖర్చు చేసిందన్నారు. కొద్ది రోజులు మాత్రమే ఉన్నందున కేంద్రాన్ని పొడిగించమని కోరామన్నారు. సోమవారం నగర పంచాయితీలపై రివ్యూ చేస్తామని వెల్లడించారు. అమ్రుత్ 1, అమ్రుత్ 2 ప్రాజెక్ట్‌లను చేపడతామని ప్రకటించారు. అమ్రుత్ 1 లో కేవలం రూ. 2013 కోట్లు మాత్రమే ఖర్చు చేశారని చెప్పారు.


మున్సిపాలిటీకి వచ్చే డబ్బులను డైవర్ట్ చేశారు..స్టేట్ కోటా పెట్టలేదని అన్నారు. రాష్ట్రానికి రావాల్సిన షేర్‌‌ని ఇవ్వమని కేంద్రాన్ని కోరతామన్నారు. వర్షాకాలం ప్రారంభమైంది.. వ్యాధుల పట్ల జాగ్రత్తలు తీసుకుంటున్నామని తెలిపారు. ఏపీలనో ఎక్కడ డెంగ్యూ లేదు.. మూడు చోట్ల డెంగ్యూ లక్షణాలు అంటున్నారని.. పరీక్షలు కొనసాగుతున్నాయని.. డ్రైన్లలో సిల్ట్ తీయమని ఇప్పటికే సంబంధిత అధికారులకు ఆదేశాలిచ్చామని చెప్పారు. 123 మున్సిపాల్టీల్లో సిల్ట్ తీసే ప్రక్రియ ప్రారంభమవుతుందని.. వాళ్లకి నిధులు విడుదల చేసేలా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. వర్షాకాలంలో సీజనల్ వ్యాధులు ప్రబలకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నామని మంత్రి నారాయణ పేర్కొన్నారు.

Updated Date - Jun 28 , 2024 | 09:58 PM