Share News

Somireddy: వరద బాధితులను ఆదుకోవడం ఒక చరిత్ర..

ABN , Publish Date - Sep 18 , 2024 | 12:35 PM

Andhrapradesh: వరద బాధితులకు కూటమి ప్రభుత్వం ప్రకటించిన నష్టపరిహారం అద్భుతంగా ఉందని ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అన్నారు. కేటగిరి వారీగా నష్టపరిహారం ఇస్తున్నారని తెలిపారు. పంటలకు, పశువుల నష్టపరిహారం చెల్లించనున్నారని.. గతంలో ఎన్నడు ఇలాంటి నష్టపరిహార చెల్లింపు చూడలేదని వెల్లడించారు.

Somireddy: వరద బాధితులను ఆదుకోవడం ఒక చరిత్ర..
MLA Somireddy Chandramohan Reddy

నెల్లూరు, సెప్టెంబర్ 18: వరద బాధితులను ఆదుకోవడంలో కూటమి ప్రభుత్వం రోల్ మోడల్‌గా నిలిచిందని సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్ది (MLA Somireddy Chandramohan Reddy) అన్నారు. బుధవారం మీడియాతో మాట్లాడుతూ.. వరద బాధితులకు ప్రకటించిన నష్టపరిహారం అద్భుతంగా ఉందన్నారు. కేటగిరి వారీగా నష్టపరిహారం ఇస్తున్నారని తెలిపారు. పంటలకు, పశువులకు నష్టపరిహారం చెల్లించనున్నారని.. గతంలో ఎన్నడు ఇలాంటి నష్టపరిహార చెల్లింపు చూడలేదని వెల్లడించారు. వరద బాధితులను కూటమి ప్రభుత్వం ఆదుకోవడం ఒక చరిత్ర అని చెప్పుకొచ్చారు. నష్టపరిహారం చెల్లింపులు చూసి ప్రతిపక్షాలు ముక్కున వేలేసుకుంటున్నాయన్నారు.

CP Anand: భక్తులకు సీపీ ఆనంద్ విజ్ఞప్తి.. ఏ విషయంలో అంటే..



బుడమేరు, ఏలేరు వాగులను సీఎం చంద్రబాబు ప్రక్షాళన చేస్తామని హామీ ఇచ్చారని తెలిపారు. ఉన్నతధికారులతో మాట్లాడి సోమశిల జలాశయానికి నీటిని విడుదల చేయించానన్నారు. నెల్లూరు జిల్లాలోని రెండు జలాశయాల్లో 65 టీఎంసీ నీరు ఉందని.. మరో 15 టీఎంసీ నీరు వస్తుందని ఆశిస్తున్నామన్నారు. నేడు నెల్లూరు జిల్లాలో 8.5 లక్షల ఎకరాల్లో మొదటి పంట సాగుకు నీరు అందుబాటులో ఉందని తెలిపారు. గత ప్రభుత్వంలో సాగుకు నీరు అందించలేకపోవడంతో పొలాలు బీళ్లు పెట్టుకున్నారన్నారు. గత ప్రభుత్వంలో జల, వ్యవసాయం శాఖల మంత్రులు దోచుకోవడం, దాచుకోవడం చేశారని విమర్శించారు. గత ప్రభుత్వంలో మంత్రులు ఇసుక, మైన్స్ క్వాడ్జి మీద దృష్టి సారించారన్నారు. గత ప్రభుత్వంలో ఇసుక దోపిడీకి అడ్డు అదుపు లేకుండా దోపిడీ చేశారని మండిపడ్డారు. అనుమతులు లేకుండా సర్వేపల్లి నియోజకవర్గంలో ఇష్టానుసారంగా దోచేశారన్నారు. వందల కోట్లు దోపిడీ చేసేసినా అధికారులు చూసి చూడనట్టు వ్యవహరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. దోపిడీ చేసిన వారి పేర్లు బయట పెట్టకపోతే మరో సత్యాగ్రహం వస్తుందన్నారు.

AP News: సీఎం చంద్రబాబుకు వరద బాధితుల కృతజ్ఞతలు


గనుల దోపిడీపై జిల్లా కలెక్టర్ ప్రత్యేక విచారణ చేపట్టాలని కోరారు. తానే ముఖ్యమంత్రి దగ్గర కూర్చొని విజిలెన్స్ విచారణ వేయించినట్లు తెలిపారు. గత ఇదేళ్లల్లో మైనింగ్ అధికారులుగా ఉన్న వారినే విచారణ అధికారులుగా వేస్తే వాస్తవాలు బయటకు రావని తెలిపారు. సర్వేపల్లిలో అతిపెద్ద కుంభకోణం జరిగిందన్నారు. పదివేలు లంచం తీసుకునే అధికారిని సస్పెండ్ చేసినప్పుడు.. కోట్లల్లో దోపిడీ చేసిన వైసీపీ వారిని ఎందుకు వదిలేస్తున్నారని ప్రశ్నించారు. రాష్ట్ర మంత్రులు, ఉన్నతాధికారులకు గత అవినీతిపై విచారణకు ఇతర జిల్లాల అధికారులను విచారణ చేపట్టాలని విజ్ఞప్తి చేశారు. సర్వేపల్లిలో జరిగిన అవినీతిపై ఏ1 ను వదిలేసి ఏ15 పేరు ప్రతిపాదిస్తున్నారని ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి వ్యాఖ్యలు చేశారు.


ఇవి కూడా చదవండి...

AP Cabinet: ఆడబిడ్డ నిధి పథకంపై ఏపీ కేబినెట్‌లో చర్చ..

CM Chandrababu: సీఎం చంద్రబాబు కీలక ప్రకటన.. వరద బాధితులకు ప్యాకేజీ.. వివరాలు ఇవే..

Read LatestAP NewsAndTelugu News

Updated Date - Sep 18 , 2024 | 01:32 PM