TDP: సోమిరెడ్టి కాలితో తన్నగా కూలిపోయిన నిర్మాణాలు
ABN , Publish Date - Mar 05 , 2024 | 01:07 PM
నెల్లూరు జిల్లా: ఏపీ వ్యవసాయశాఖ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి సొంత ఇలాకా సర్వేపల్లి నియోజలవర్గంలో భారీ అక్రమాలు జరిగాయి. వరిగొండలోని జగనన్న కాలనీని తెలుగుదేశం సీనియర్ నేత, మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ మంగళవారం సందర్శించారు.
నెల్లూరు జిల్లా: ఏపీ వ్యవసాయశాఖ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి (Minister Kakani Govardhan Reddy) సొంత ఇలాకా సర్వేపల్లి నియోజకవర్గంలో భారీ అక్రమాలు జరిగాయి. వరిగొండలోని జగనన్న కాలనీని (Jagananna Colony) తెలుగుదేశం (TDP) సీనియర్ నేత, మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి (Somireddy Chandramohan Reddy) మంగళవారం సందర్శించారు. ఆయన కాలితో తన్నగా నిర్మాణాలు కూలిపోయాయి. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. 2020 నుంచి పలు దఫాలుగా తమ వద్ద వైసీపీ నేతలు (YCP Leaders) డబ్బులు తీసుకున్నారని గిరిజనులు ఆవేదన చేశారని, వారి పేర్లు మీద ఇనుము, సిమెంటు, కిటికీలు డ్రా చేసుకున్నారంటూ గిరిజన మహిళలు కన్నీటి పర్యంతమయ్యారన్నారు. సిమెంటు పిల్లర్లు లేకుండానే నాశిరకంగా నిర్మాణాలు చేపట్టారని మండిపడ్డారు. టీడీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే జగనన్న ఇళ్లపై విచారణ జరిపిస్తామని గిరిజనులకు సోమిరెడ్డి హామీ ఇచ్చారు. అవినీతికి పాల్పడిన ఎవరనీ వదలమని, వైసీపీ నేతలు, అధికారులు, చివరకు మంత్రినైనా వదిలే ప్రశక్తి లేదని సోమిరెడ్డి స్పష్టం చేశారు.