Share News

Poleramma Jathara: శ్రీపోలేరమ్మ జాతరలో ప్రధాన ఘట్టం పూర్తి

ABN , Publish Date - Sep 26 , 2024 | 02:52 PM

Andhrapradesh: వెంకటగిరి శక్తి స్వరూపిణి శ్రీ పోలేరమ్మ అమ్మవారి జాతరలో ప్రధాన ఘట్టం పూర్తి అయ్యింది. చాకలిమండపంలో అమ్మవారి ప్రతిమకు సాంప్రదాయ పసుపు కుంకుమల సారె సమర్పించారు. అమ్మవారి సేవకులు మిరాశీదారుల సారెతో శ్రీ పోలేరమ్మవారికి ప్రాణప్రతిష్ట చేశారు.

Poleramma Jathara:  శ్రీపోలేరమ్మ జాతరలో ప్రధాన ఘట్టం పూర్తి
Venkatagiri Poleramma Jathara

నెల్లూరు, సెప్టెంబర్ 26: వెంకటగిరిలో (Venkatagiri) శ్రీ పోలేరమ్మ అమ్మవారి జాతర (Sri Poleramma Jathara) అంగరంగ వైభవంగా జరుగుతోంది. ఈరోజు (గురువారం) తెల్లవారుజాము నుంచే భక్తజనులు ఆలయానికి చేరుకుని భక్తి శ్రద్ధలతో అమ్మవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకుంటున్నారు. వెంకటగిరి శక్తి స్వరూపిణి శ్రీ పోలేరమ్మ అమ్మవారి జాతరలో ప్రధాన ఘట్టం పూర్తి అయ్యింది. చాకలిమండపంలో అమ్మవారి ప్రతిమకు సాంప్రదాయ పసుపు కుంకుమల సారె సమర్పించారు. అమ్మవారి సేవకులు మిరాశీదారుల సారెతో శ్రీ పోలేరమ్మవారికి ప్రాణప్రతిష్ట చేశారు. ఈ ప్రధాన ఘట్టంతో అమ్మలగన్నమ్మ శ్రీ పోలేరమ్మ సమగ్రరూపం దాల్చి భక్తులకు దర్శనమిచ్చింది.

Raghurama: జగన్.. చెంపలు వేసుకుని మరీ.. తిరుమల లడ్డూను తిను


ప్రత్యేక పూల రథంలో నడివీధి శోభాయాత్రగా ముగ్గురమ్మల మూల పుట్టమ్మ ఆలయానికి చేరుకుంది. ఎంతో అంగరంగ వైభవంగా, కన్నుల పండువగా శ్రీపోలేరమ్మ జాతర జరుగుతోంది. ఈరోజు తెల్లవారుజామున నడివీధి ఆలయంలో అమ్మవారు కొలువుదీరింది. ప్రత్యేక పూజలు అనంతరం ఉదయం నుంచి అమ్మవారిని భక్తజనులు దర్శించుకుంటున్నారు. మధ్యాహ్నం 4 గంటల తరువాత అమ్మవారి విరూప శోభాయాత్ర జరుగనుంది. అనంతరం అమ్మవారి విరూపంతో శ్రీపోలేరమ్మ జాతర సంపూర్ణం కానుంది.


ఈరోజు తెల్లవారుజామున అమ్మవారి నిలుపు కార్యక్రమం మొదలైంది. అమ్మవారి మెట్టినిల్లు నుంచి అమ్మవారి ఆలయం వద్ద ప్రత్యేకంగా ఏర్పటు చేసిన మండపంలో కొలువుదీరారు. సాయంత్రం వరకు భక్తులకు దర్శనభాగ్యం కల్పించనున్నారు. అనంతరం సాయంత్రం అమ్మవారికి వైభవంగా నగరోత్సవం నిర్వహించనున్నారు. పోలేరమ్మ జాతర సందర్భంగా వెంకటగిరి నగరంలో సుందరంగా ముస్తాబైంది. విద్యుద్దీపాలంకరణలతో వీధులు కళకళలాడుతున్నాయి. జాతర సందర్భంగా రాష్ట్రం నుంచే కాకుండా ఇతర దేశాల నుంచి కూడా వెంకటగిరి వాసులు జాతరకు విచ్చేశారు. మరోవైపు ఎలాంటి అవాంఛనీయ సంఘటనకు జరుగకుండా పోలీసులు పటిష్ట బందోబస్తును ఏర్పాటు చేశారు.

Jr NTR-Devara: జూనియర్ ఎన్టీఆర్‌ను తాకిన విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ వ్యతిరేక ఉద్యమం


పట్టువస్త్రాలు సమర్పణ

వెంకటగిరి శక్తి స్వరూపిణి శ్రీపొలేరమ్మ జాతర సందర్భంగా ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ ఆధ్వర్యంలో అమ్మవారికి రాష్ట్ర దేవాదాయశాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి, రాష్ట్ర పర్యాటకశాఖ మంత్రి కందుల దుర్గేష్ అధికారికంగా పట్టు వస్త్రాలు సమర్పించారు. అనంతరం పోలేరమ్మ అమ్మవారిని మంత్రి ఆనం కుటుంబ సభ్యులు, నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి, సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, దేవాదాయ శాఖ కమిషనర్ శ్రీరామ్ సత్యనారాయణ, తిరుపతి జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్, తిరుపతి జిల్లా ఎస్పీ సుబ్బారాయుడు దర్శించుకున్నారు.


పోలీసుల ఓవరాక్షన్..

వెంకటగిరి పోలేరమ్మ జాతరలో పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించారు. అమ్మవారిని దర్శించుకోవడానికి వచ్చిన చెంచు కుమార్ అనే 22ఏళ్ల యువకుడిపై లాఠీలతో పోలీసులు చితకబాదారు. ఈ క్రమంలో యువకుడు చెంచు కుమార్‌కు తీవ్రగాయాలయ్యాయి. వెంటనే అతడిని స్థానికులు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ప్రభుత్వ ఆస్పత్రిలో చెంచు కుమార్‌కు వైద్యులు చికిత్స అంచించారు. ఆపై మెరుగైన వైద్యం కోసం గూడూరు ఏరియా ఆసుపత్రికి యువకుడిని తరలించారు.


ఇవి కూడా చదవండి...

AP Govt: సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు వెంకట్రామిరెడ్డికి షోకాజ్ నోటీస్

Raghurama: జగన్.. చెంపలు వేసుకుని మరీ.. తిరుమల లడ్డూను తిను

Read Latest AP News And Telugu News

Updated Date - Sep 26 , 2024 | 03:34 PM