Viral Video: భార్య పుట్టిన రోజున రూ.60 లక్షలు ఖర్చుపెట్టిన భర్త.. బయటకు తీసుకెళ్లి ఏమేమి కొన్నాడంటే
ABN , Publish Date - Sep 26 , 2024 | 02:18 PM
పిల్లలు, పెద్దలతో పాటు ఇంటి కోసం అనుక్షణం పాటుపడే భార్య పుట్టిన రోజున ఖర్చు విషయంలో ఏ భార్తా వెనుకడుగు వేయకపోవచ్చు. స్థోమతకు తగ్గట్టు తమ అర్ధాంగులను సర్‌ఫ్రైజ్ చేసేందుకు చేసేందుకు భర్తలు ప్రయత్నింటారు. ఒక మిలియనీర్ అయితే తన భార్య పుట్టిన రోజున ఏకంగా రూ.60 లక్షలు ఖర్చు చేశారు. భార్యను సంభ్రమాశ్చర్యాలకు గురి చేశాడు.
ఇంట్లోని పిల్లలు, పెద్దలతో పాటు కుటుంబం కోసం అనుక్షణం పాటుపడే భార్య పుట్టిన రోజున ఖర్చు విషయంలో ఏ భార్తా వెనుకడుగు వేయకపోవచ్చు. స్థోమతకు తగ్గట్టు తమ అర్ధాంగులను సర్‌ఫ్రైజ్ చేసేందుకు ప్రయత్నింటారు. ఒక మిలియనీర్ అయితే తన భార్య పుట్టిన రోజున ఏకంగా రూ.60 లక్షలు ఖర్చు పెట్టి భార్యను సంభ్రమాశ్చర్యాలకు గురి చేశాడు. సోషల్ మీడియాలో ఇటీవల వైరల్‌గా మారిన ఓ వీడియోకు సంబంధించిన పూర్తి వివరాలు ఈ విధంగా ఉన్నాయి.
దుబాయ్‌కి చెందిన కోటీశ్వరుడు అయిన ఓ భర్త తన భార్య పుట్టిన రోజున ఏకంగా రూ.60 లక్షల విలువైన బహుమతులు అందించాడు. విలాసవంతంగా బర్త్ డే సెలబ్రేషన్స్ నిర్వహించాడు. ఇంగ్లండ్‌లోని సస్సెక్స్‌లో నివసించే సౌదీ అల్ నదక్ అనే 26 ఏళ్ల భార్యకు 32 ఏళ్ల జమాల్ అల్ నదక్ అనే దుబాయ్ భర్త ఈ సర్‌ప్రైజ్ ఇచ్చినట్టు ‘ది సన్’ కథనం పేర్కొంది.
ఎలా ఖర్చు చేశాడంటే..
అత్యంత విలాసవంతమైన ‘మూ మూ’ బ్రాండ్‌లో 15,000 డాలర్ల విలువైన షాపింగ్ చేయించాడు. ఆ తర్వాత ఇద్దరూ కలిసి అక్షరాలా లక్ష రూపాయల విలువైన విందు చేశారు. ఆపై హెర్మేస్ బ్రాండ్‌కు చెందిన షోరూమ్‌కి వెళ్లారు. అక్కడ ఆమెకు రూ.29 లక్షలు విలువైన వస్తువులను బహుమతులుగా కొనిచ్చాడు. ఆ తర్వాత స్పాలు, ఫేస్ ఫిల్లర్స్ వంటి బ్యూటీ ట్రీట్‌మెంట్ల కోసం పెద్ద మొత్తంలో అతడు ఖర్చుపెట్టాడు. దీంతో ఆ రోజు మొత్తం రూ.60 లక్షల ఖర్చు అయ్యింది. ఇందుకు సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ వీడియోకు 3.4 మిలియన్ల వ్యూస్ వచ్చాయి. 51,000 కంటే ఎక్కువ లైక్స్ కూడా వచ్చాయి. కాగా ఈ వీడియోను భార్య ఇటీవల తన ఇన్‌స్టాగ్రామ్ వేదికగా ఈ వీడియోను షేర్ చేసింది. తన కోసం భర్త ఎంత ఖర్చుపెట్టాడనే వివరాలను ఆమె వెల్లడించింది. ఈ పోస్టుపై నెటిజన్లు భిన్నాభిప్రాయాలను వ్యక్తం చేశారు.
కాగా దంపతులకు పెళ్లై మూడేళ్లు అయ్యింది. వీరిద్దరూ తొలుత దుబాయ్‌లోని ఒక విశ్వవిద్యాలయంలో చదువుతున్నప్పుడు పరిచయమయ్యారు. దాదాపు ఏడేళ్లు కలిసి ఉన్నారు. మూడేళ్ల క్రితమే ప్రేమ పెళ్లి చేసుకున్నారు. సౌదీ ప్రస్తుతం గృహిణిగా ఉన్నారు. భర్త జమాల్ దుబాయ్‌లో మిలియనీర్. అందుకే భార్య పుట్టినరోజున రెట్టింపు ఉత్సాహంతో వెచ్చించాడు.