Share News

YS Sharmila: కొత్త చట్టాలు తెచ్చేది.. భూ కబ్జాల కోసమే..

ABN , Publish Date - Feb 08 , 2024 | 02:58 PM

భూమి హక్కుల చట్టం పేరుతో సర్కార్ భూ కబ్జాలకు పాల్పడే చట్టం తేవాలని అనుకుంటోందని పీసీసీ ఏపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల అన్నారు. తెనాలి నియోజక వర్గం కొలకలూరు గ్రామంలో రచ్చబండ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ..

YS Sharmila: కొత్త చట్టాలు తెచ్చేది.. భూ కబ్జాల కోసమే..

గుంటూరు: భూమి హక్కుల చట్టం పేరుతో సర్కార్ భూ కబ్జాలకు పాల్పడే చట్టం తేవాలని అనుకుంటోందని పీసీసీ ఏపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల అన్నారు. తెనాలి నియోజక వర్గం కొలకలూరు గ్రామంలో రచ్చబండ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఇప్పటికే లిక్కర్‌ను బిజినెస్‌గా చేసుకున్న జగర్ సర్కారు.. కొత్త చట్టంతో భూ కబ్జాలకు పాల్పడాలని చూస్తోందని ఆరోపించారు. ఆమె ఇంకా మాట్లాడుతూ ఇలా అన్నారు. ‘‘లిక్కర్ పేరుతో చెప్పిన మద్యాన్ని మాత్రమే అమ్మాలని రూల్ తెచ్చారు. రాష్ట్రానికి రావాల్సిన ఆదాయం మొత్తం దోచేశారు. రాష్ట్రంలో కల్తీ లిక్కర్‌తో 25 శాతం అదనంగా మరణాలు సంభవిస్తున్నాయి. లిక్కర్ వ్యాపారం గుప్పిట్లో పెట్టుకున్నట్లు.. ప్రజల భూములను గుప్పిట్లో పెట్టుకోవాలని చూస్తోంది. ఒక మనిషిని పెడతారట.. ఆయన చెప్పినట్లే భూ లావాదేవీలు ఉండాలట. ఇదేం చట్టం... భూములపై సొంత హక్కులు హరించే చట్టం తేవడం ఏంటి..?. ఇలాంటి చట్టాలు తెచ్చే YCP ప్రభుత్వం మళ్ళీ రావాలా ? ప్రజలు తేల్చుకోవాలి. లాండ్ టైటిల్ యాక్ట్.. వ్యతిరేకిస్తున్నాం. రాష్ర్టంలో అన్ని ధరలు పెంచారు. చెక్కెర, నూనె, కూరగాయలు ఇలా అన్నింటి ధరలూ పెంచారు’’.

‘‘ఒక చేత్తో మట్టి చెంబు ఇస్తూ...మరో చేత్తో వెండి చెంబు తీసుకుంటున్నారు. ప్రభుత్వ పథకాలు ఏవి ప్రజలకు అందడం లేదు.. ఉద్యోగాలు లేవు.. ఫీజు రీయింబర్స్మెంట్ లేదు. జాబ్ క్యాలెండర్ అని చెప్పి మోసం చేశారు. మెగా డీఎస్సీ అని చెప్పి మోసం చేశారు. చంద్రబాబు 7వేల పోస్టులు ఇస్తే హేళన చేశాడు. వైసీపీ వస్తే 25 వేల పోస్టులు ఇస్తామన్నారు. మెగా డీఎస్సీ నీ దగా డీఎస్సీ చేశాడు. 25 వేలు అని చెప్పి ఎన్నికల ముందు 6 వేల పోస్టులకు నోటిఫికేషన్ ఇచ్చారు. ఉద్యోగాలు లేక ఇతర రాష్ట్రాలకు వలసలు పెరిగాయి. మన బిడ్డలు ఇక్కడ ఉద్యోగాలు లేకుండా వలసలు పోవాలా ? . 25 లక్షల ఇళ్లు అని చెప్పి ఒక్క ఇల్లు కూడా ఇవ్వలేదు.. జగన్ అన్నది దగా ప్రభుత్వం. మన బిడ్డల భవిష్యత్ మారాలి. ఉద్యోగాలు ఇచ్చే కాంగ్రెస్ ప్రభుత్వం రావాలి.. దోచుకునే ప్రభుత్వాలు పోవాలి. మాఫియాలు చేసే ప్రభుత్వం పోవాలి’’.

‘‘ఎన్నికలు వస్తున్నాయి.. ఎవరు ఎన్ని డబ్బులు ఇస్తే అన్ని తీసుకోండి.. అవన్నీ మీ డబ్బులే. చుట్టూ ఇసుక మాఫియాతో సంబంధించిన డబ్బులే. కానీ ఓటు మాత్రం రాష్ట్రం అభివృద్ధి చేసే పార్టీకి మాత్రమే వేయాలి. చంద్రబాబుకి ఇచ్చిన అవకాశం చాలు. జగన్ ఆన్నకి ఇచ్చిన అవకాశం చాలు. ఇప్పుడు కాంగ్రెస్ అధికారంలో రావాల్సిన అవసరం ఉంది. హోదా ఇస్తామని స్వయంగా రాహుల్ హామీ ఇచ్చాడు. మొదటి సంతకం పెడతా అని చెప్పారు. కాంగ్రెస్ పార్టీని నమ్మాలి. ఎందుకంటే రాజశేఖర్ రెడ్డి పని చేసిన పార్టీ. నన్ను నమ్మండి.. హోదా తెచ్చే బాధ్యత నాది. పోలవరం పూర్తి కావాలి... రాజధాని కట్టాలి. TDP,YCP బీజేపీకి తోక పార్టీలు. వైసీపీ ప్రభుత్వం ఆదుకొనే ప్రభుత్వం కాదు. 12వేలు అమ్మఒడి అని చెప్పారు.. ఒక్క బిడ్డకు మాత్రమే నట. ఎన్నికల్లో జగన్ ఆన్న తరుపున నేనే ప్రచారం చేశా.. అందరికీ ఇస్తాం అని చెప్పా. కానీ జగనన్న ఈ హామీ నిలబెట్టుకోలే’’.. అంటూ షర్మిల పేర్కొన్నారు.

Updated Date - Feb 08 , 2024 | 03:05 PM