Minister Dola: ఆ అధికారులపై మంత్రి డోలా ఆగ్రహం..
ABN , Publish Date - Jul 13 , 2024 | 03:30 PM
పొదిలి(Podili) ప్రాంతీయ వైద్యశాలను సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి(Social Welfare Minister) డాక్టర్ డోలా శ్రీబాల వీరాంజనేయస్వామి(Dola Sree Bala Veeranjaneya Swamy) ఆకస్మిక తనిఖీ చేశారు. ఈ సందర్భంగా అధికారులు, వైద్య సిబ్బంది తీరుపై ఆయన మండిపడ్డారు. ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు ముగిసి నెల రోజులు గడిచినా ఆస్పత్రి ఆవరణలోని శిలాఫలకంపై ప్రభుత్వ రాజముద్ర ఏర్పాటు చేయకపోవడం, గత ముఖ్యమంత్రి జగన్, అప్పటి ఎమ్మెల్యే ఫొటోలు ప్రచురించడంపై మంత్రి డోలా ఆగ్రహం వ్యక్తం చేశారు.
ప్రకాశం: పొదిలి(Podili) ప్రాంతీయ వైద్యశాలను సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి(Social Welfare Minister) డాక్టర్ డోలా శ్రీబాల వీరాంజనేయస్వామి(Dola Sree Bala Veeranjaneya Swamy) ఆకస్మిక తనిఖీ చేశారు. ఈ సందర్భంగా అధికారులు, వైద్య సిబ్బంది తీరుపై ఆయన మండిపడ్డారు. ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు ముగిసి నెల రోజులు గడిచినా ఆస్పత్రి ఆవరణలోని శిలాఫలకంపై ప్రభుత్వ రాజముద్ర ఏర్పాటు చేయకపోవడం, గత ముఖ్యమంత్రి జగన్, అప్పటి ఎమ్మెల్యే ఫొటోలు ప్రచురించడంపై మంత్రి డోలా ఆగ్రహం వ్యక్తం చేశారు. స్వామిభక్తి ఇంకా పోలేదా అంటూ సంబంధిత అధికారులపై మండిపడ్డారు. శిలాఫలకంపై వెంటనే ఫొటోలు తొలగించాలని పనులు చేయించిన ఇంజినీర్లకు ఆదేశాలు జారీ చేశారు. ప్రభుత్వ శిలాఫలకాలపై ఏపీ రాజముద్రతోపాటు ప్రొటోకాల్ ప్రకారం పేర్లు ముద్రించాలని అధికారులకు సూచించారు.
అనంతరం ఆస్పత్రి రికార్డులను మంత్రి వీరాంజనేయస్వామి పరిశీలించారు. ఆస్పత్రి మెుత్తం కలియ తిరిగి రోగులతో ఆప్యాయంగా మాట్లాడారు. వారికి అందుతున్న వైద్య సదుపాయాలపై ఆరా తీశారు. రాష్ట్రంలో డయేరియా, ఇతర సీజనల్ వ్యాధులు ప్రబలుతున్న నేపథ్యంలో ప్రత్యేక చర్యలు తీసుకోవాలని వైద్య సిబ్బందికి మంత్రి సూచించారు. సీజనల్ వ్యాధులపై రోగులకు అవగాహన కల్పించాలని, వైద్యం కోసం వచ్చే వారికి ఎలాంటి అసౌకర్యం కలగకుండా చర్యలు చేపట్టాలన్నారు. ఆస్పత్రిలో ఎప్పటికప్పుడు మందులు, వైద్య పరికరాలు అందుబాటులో ఉండేలా చూసుకోవాలని వైద్య సిబ్బందిని మంత్రి డోలా వీరాంజనేయస్వామి ఆదేశించారు.
ఇవి కూడా చదవండి:
CM Chandrababu: అధికారంలోకి వచ్చాం కదా అని అలసత్వం వద్దు..
Mastan Vali: షర్మిల వ్యాఖ్యలను వక్రీకరించారు.. వైసీపీ నేతలకు మస్తాన్ వలి వార్నింగ్