Share News

Prakasam: గుప్తనిధుల పేరుతో నయా మోసం.. పెట్టుబడి పెట్టాలంటూ.. చివరకు..

ABN , Publish Date - Dec 24 , 2024 | 05:50 PM

Prakasam district hidden treasures: గుప్తనిధుల కోసం తవ్వకాలు జరిపే ముఠాలు పెరిగిపోతున్నాయి. పురాతన ఆలయాలు, చారిత్రక నిర్మాణాలే లక్ష్యంగా కొందరు తవ్వకాలకు పాల్పడడం రోజూ చూస్తూనే ఉన్నాం. ఈ క్రమంలో కొందరు నేరస్థులు అతి తెలివిగా ప్రవర్తించడం చూస్తున్నాం. తాజాగా..

Prakasam: గుప్తనిధుల పేరుతో నయా మోసం.. పెట్టుబడి పెట్టాలంటూ.. చివరకు..
hidden treasures

గుప్తనిధుల కోసం తవ్వకాలు జరిపే ముఠాలు పెరిగిపోతున్నాయి. పురాతన ఆలయాలు, చారిత్రక నిర్మాణాలే లక్ష్యంగా కొందరు తవ్వకాలకు పాల్పడడం రోజూ చూస్తూనే ఉన్నాం. ఈ క్రమంలో కొందరు నేరస్థులు అతి తెలివిగా ప్రవర్తించడం చూస్తున్నాం. తాజాగా, ప్రకాశం జిల్లాలో ఇలాంటి ఘటన వెలుగులోకి వచ్చింది. గుప్తునిధుల కోసం పెట్టుబడి పెడితే 10 రెట్లు ఎక్కువ ఇస్తామంటూ ఆశజూపిన ముఠా చివరకు.. రూ.6లక్షలు కాజేసింది. వివరాల్లోకి వెళితే..


ఏపీలోని ప్రకాశం జిల్లా (Prakasam District) మార్కాపురంలో ఈ ఘటన చోటు చేసుకుంది. గుప్త నిధుల (hidden treasures) కోసం గాలిస్తున్న ఓ ముఠా.. స్థానిక ప్రాంతానికి చెందిన సుబ్రమణ్యం అనే వ్యక్తిని కలిసింది. నల్లమలలో గుప్తనిధులు ఉన్నాయని చెప్పారు. అయితే వాటిని వెలికితీసేందుకు కొంచెం ఖర్చవుతుందని, పెట్టుబడి పెడితే గుప్తనిధులు సేకరించిన అనంతరం.. 10రెట్లు అధికంగా తిరిగి ఇస్తామని నమ్మించారు.


పది రెట్ల నగదు అధికంగా ఇస్తామని చెప్పడంతో ఆశపడిన సుబ్రమణ్యం.. చివరకు వారికి రూ.6 లక్షలు సమర్పించుకున్నాడు. అయితే చివరకు తాను మోసపోయానని తెలుసుకున్న బాధితుడు.. పోలీసులను ఆశ్రయించాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు 13 గంటల్లో కేసును ఛేదించారు. మార్కాపురంలో గుప్త నిధుల కోసం గాలిస్తున్న గ్యాంగ్‌ను అదుపులోకి తీసుకున్నారు. మొత్తం ఆరుగురిని అదుపులోకి తీసుకున్న పోలీసులు.. పరారీలో ఉన్న మరో వ్యక్తి కోసం గాలిస్తున్నారు. కాగా, ఈ ఘటన స్థానికంగా తీవ్ర సంచలనం సృష్టించింది.

Updated Date - Dec 24 , 2024 | 05:55 PM