AP News: శ్రీకాకుళం జిల్లాలో పోలీసులను ఢీకొట్టిన కంటైనర్
ABN , Publish Date - Mar 03 , 2024 | 03:31 PM
జిల్లాలోని పలాస మండలం నెమలి నారాయణపురం జాతీయ రహదారిలో దారుణం చోటుచేసుకుంది. గంజాయి అక్రమ రవాణా సమాచారంపై తనిఖీలు చేస్తున్న పోలీసులను ఓ కంటైనర్ ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో ఎస్ఈబీ ఎస్సె ప్రభాకర్, మరో ఇద్దరు కానిస్టేబుళ్లకు తీవ్ర గాయాలు అయ్యాయి.
శ్రీకాకుళం: జిల్లాలోని పలాస మండలం నెమలి నారాయణపురం జాతీయ రహదారిలో దారుణం చోటుచేసుకుంది. గంజాయి అక్రమ రవాణా సమాచారంపై తనిఖీలు చేస్తున్న పోలీసులను ఓ కంటైనర్ ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో ఎస్ఈబీ ఎస్సె ప్రభాకర్, మరో ఇద్దరు కానిస్టేబుళ్లకు తీవ్ర గాయాలు అయ్యాయి. ఆదివారం ఉదయం ఈ ఘటన జరిగినట్లు తెలుస్తోంది. గాయపడిన పోలీసులకు పలాస ప్రభుత్వ ఆస్పత్రిలో ప్రాథమిక చికిత్స చేశారు. మెరుగైన వైద్యం కోసం శ్రీకాకుళంలోని రిమ్స్ హాస్పిటల్‌కు తరలించారు.
పోలీసుల సమాచారంతో పరదేసిపాలెంలో కంటైనర్‌ను పోలీసులు పట్టుకున్నారు. కంటైనర్‌లో 13 ప్యాకెట్లకు పైగా గంజాయి ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. నిందితులకు గంజాయి ఎక్కడ నుంచి వస్తుంది. దీని వెనుక ఎవరెవరు ఉన్నారనే సమాచారాన్ని నిందితుల నుంచి పోలీసులు రాబడుతున్నారు. ఈ కేసులో విచారణను పోలీసులు వేగవంతం చేశారు.
మరిన్ని ఏపీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి