TDP: నాకు ఏరి కోరి ప్రధాని మోదీ ఆ శాఖ అప్పగించారు: రామ్మోహన్ నాయుడు
ABN , Publish Date - Jun 11 , 2024 | 12:44 PM
న్యూఢిల్లీ: పౌర విమానయాన శాఖ తనకు ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఏరి కోరి అప్పగించారని, అంతర్జాతీయ స్థాయిలో భారత దేశ కీర్తి ప్రతిష్టలను పెంపొందించడంలో ఈ శాఖ పాత్ర చాలా ఉందని తెలుగుదేశం ఎంపీ, కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు అన్నారు.
న్యూఢిల్లీ: పౌర విమానయాన శాఖ (Civil Aviation) తనకు ప్రధానమంత్రి నరేంద్రమోదీ (PM Modi) ఏరి కోరి అప్పగించారని, అంతర్జాతీయ స్థాయిలో భారత దేశ కీర్తి ప్రతిష్టలను పెంపొందించడంలో ఈ శాఖ పాత్ర చాలా ఉందని తెలుగుదేశం ఎంపీ (TDP MP), కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు (Union Minister Rammohan Naidu) అన్నారు. మంగళవారం ఢిల్లీ (Delhi)లో ఆయన ఏబీఎన్ ఆంధ్రజ్యోతితో (ABN Andhrajyothy) మాట్లాడుతూ..యువకుడివి, విదేశాలు తిరిగావు, ఇంజనీరింగ్ విద్యాభ్యాసం ఉంది.. కాబట్టి ఈ శాఖను నీకు ఇస్తున్నాను అంటూ ప్రధాని మోదీ చెప్పారని తెలిపారు. ఈ శాఖ ద్వారా ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh)లో విమానయాన మౌలిక వసతులను అభివృద్ధి చేయడం, కొత్త అవకాశాలను వెతకడం సాధ్యపడుతుందన్నారు.
భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయాన్ని రికార్డు సమయంలో పూర్తి చేస్తామని, విమానయాన శాఖలో ఉన్న ఉద్యోగ అవకాశాలపై దృష్టి సారిస్తామని, విమానయాన శాఖ మంత్రిగా పనిచేసిన జ్యోతిరాధిత్య సింధియాను కలిసి ఆయన అనుభవాలను తెలుసుకుంటానని రామ్మోహన్ నాయుడు పేర్కొన్నారు. మంత్రిని బట్టి శాఖ పనితీరు ఉంటుందని అనేకమంది చెబుతున్నారని, అందుకు తగ్గట్టే పౌరవిమానయాన శాఖను డ్రైవ్ చేస్తానన్నారు. పొరుగు రాష్ట్రం తెలంగాణలో కూడా విమానయాన రంగానికి తోడ్పాటు అందిస్తానన్నారు. తెలంగాణలో ఉన్న తెలుగు ప్రజల మనసు గెలుచుకునేలా పని చేస్తానని రామ్మోహన్ నాయుడు ఢిల్లీలో ఉంటే కేవలం పౌర విమానయాన శాఖ మాత్రమే కాదు, 30 శాఖలకు సంబంధించి ఏ పనులున్నా తాను చొరవ తీసుకొని పనిచేస్తానని స్పష్టం చేశారు.
పార్లమెంటేరియన్‌గా గత పదేళ్లుగా వివిధ శాఖలకు సంబంధించి ఢిల్లీలో అందరినీ కలుస్తూనే ఉన్నానని, వైయస్సార్సీపీ పాలనలో రాష్ట్రానికి జరిగిన అన్యాయాన్ని సరిదిద్దాలంటే 30 శాఖలు మన చేతిలో ఉండాలని రామ్మోహన్ నాయుడు అభిప్రాయపడ్డారు. వాస్తవ పరిస్థితిలో అది సాధ్యపడదని.. కానీ మిగతా శాఖలతో సమన్వయం చేసుకుంటూ రాష్ట్ర ప్రయోజనాలు కాపాడుకోవచ్చునని అన్నారు. గతంలో పార్లమెంటులో రెండు నిమిషాల సమయం కోరాను.. కానీ ప్రజలు 21 మంది కూటమి ఎంపీలను గెలిపించి మాకు అధికారం అప్పగించారుని, ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ, మంచి పేరు తెచ్చుకునేలా పనిచేస్తానని అన్నారు. అత్యంత చిన్న వయసు క్యాబినెట్ మంత్రిగా అందరి దృష్టి తనపై ఉంటుందని.. దానికి తగ్గట్టే వ్యవహరిస్తానని రామ్మోహన్ నాయుడు పేర్కొన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి..
నా శపధాన్ని ప్రజలు గౌరవించారు: చంద్రబాబు
జేపీ ఎమ్మెల్యేలతో సమావేశమైన పురందేశ్వరి
వైసీపీతో అంటకాగిన విశాఖ అధికారుల టెన్షన్..
ఐదేళ్లలో గనుల శాఖలో భారీ అవినీతి..
మైనింగ్‌పై ఏపీ ప్రభుత్వం నిఘా...
Read Latest AP News and Telugu News
Read Latest Telangana News and National News
Read Latest Chitrajyothy News and Sports News