AP Election 2024: వారిని ఎన్నికల విధుల్లో పాల్గొనకుండా ఈసీ చర్యలు తీసుకోవాలి: సూర్యనారాయణ రాజు
ABN , Publish Date - Apr 16 , 2024 | 10:46 PM
దేవాదాయ, ధర్మదాయ శాఖ ఉద్యోగస్తులని ఎన్నికల విధుల్లో పాల్గొనేలా ప్రణాళికలు చేస్తున్నారని బీజేపీ (BJP) ఏపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు సూర్యనారాయణ రాజు (Suryanarayana Raju) అన్నారు. వారిని ఎన్నికల విధుల్లో పాల్గొనకుండా ఈసీ చర్యలు తీసుకోవాలని ఎన్నికల కమిషన్ (Election Commission) చర్యలు తీసుకోవాలని కోరారు.
విజయవాడ: దేవాదాయ, ధర్మదాయ శాఖ ఉద్యోగస్తులని ఎన్నికల విధుల్లో పాల్గొనేలా ప్రణాళికలు చేస్తున్నారని బీజేపీ (BJP) ఏపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు సూర్యనారాయణ రాజు (Suryanarayana Raju) అన్నారు. వారిని ఎన్నికల విధుల్లో పాల్గొనకుండా ఈసీ చర్యలు తీసుకోవాలని ఎన్నికల కమిషన్ (Election Commission) చర్యలు తీసుకోవాలని కోరారు.
AP Highcourt: చంద్రబాబుపై నమోదైన కేసుల్లో దిగొచ్చిన ఏపీ సర్కార్
ఈ మేరకు ఏపీ ఎన్నికల ప్రధాన అధికారి ముకేష్ కుమార్ మీనాకు ఫిర్యాదు చేస్తామని తెలిపారు. మంగళవారం నాడు ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఏపీలో పండుగలు వస్తున్న నేపథ్యంలో వారిని విధులకి దూరంగా ఉంచాలని ఈసీని కోరారు. ఏపీలో ఎన్నికల ప్రచార సభల్లో బీజేపీ జాతీయ నాయకులు పాల్గొంటారని తెలిపారు.
CM Jagan: అందుకే జగన్‌పై రాయి విసిరా.. పోలీసు విచారణలో యువకుడు షాకింగ్ విషయాలు
మరిన్ని ఏపీ వార్తల కోసం..
AP Election 2024: ఆ వీడియోలు ఎలా బయటకు వచ్చాయి.. నట్టికుమార్ కీలక వ్యాఖ్యలు
ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాధ్, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ఇలా జాతీయ నాయకులు ఏపీకి రానున్నారని తెలిపారు. ఈ ఐదేళ్లలో వైసీపీ పాలనలో నిరుద్యోగుల సమస్య పెరిగిపోయింద న్నారు. యువత ఉద్యోగాలు లేక పొరుగు రాష్ట్రాలకి వెళ్లిపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. జాబ్ క్యాలెండరు ప్రతి సంవత్సరం ఇస్తానని హామీ ఇచ్చి జగన్ మోసం చేశారని ధ్వజమెత్తారు.
ప్రకృతి వైపరీత్యాల దృష్ట్యా రైతులు నష్టపోయారని.. వారిని ఆదుకోకుండా జగన్ ప్రభుత్వం మీనామేషాలు లెక్కిస్తోందన్నారు. ఏపీలో వైసీపీ ప్రభుత్వం అన్ని రంగాల వారిని మోసం చేసిందని మండిపడ్డారు.మరోసారి బస్సు యాత్ర పేరుతో ప్రజలని మోసం చేయటానికి జగన్ సిద్ధం అయ్యారని విరుచుకుపడ్డారు. ఏన్డీఏ కూటమిని గెలిపించాలని ప్రజలు చూస్తున్నారని తెలిపారు. డబుల్ ఇంజిన్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే వికసిత్ ఆంధ్రా వికసిత్ భారత్ దిశగా అడుగులు వేస్తుందని సూర్యనారాయణ రాజు పేర్కొన్నారు.
AP Highcourt: చంద్రబాబుపై నమోదైన కేసుల్లో దిగొచ్చిన ఏపీ సర్కార్
మరిన్ని ఏపీ వార్తల కోసం..