Share News

AP Politics: ఎమ్మెల్యేగా రఘురామ.. ఎక్కడనుంచి పోటీ చేయనున్నారంటే..!

ABN , Publish Date - Apr 06 , 2024 | 02:15 PM

Andhra Pradesh: టీడీపీలో చేరిన రఘురామకృష్ణం రాజుకు(Raghu Rama Krishna Raju) టికెట్ కన్ఫామ్ అయ్యింది. చంద్రబాబు(Chandrababu) ఆయనకు టికెట్ ఖరారు చేశారు. ఉండి(Undi) నియోజకవర్గాన్ని రఘురామకృష్ణం రాజుకు కేటాయించారు చంద్రబాబు. ఎంపీగా గెలిచి.. ఐదేళ్లపాటు వైసీపీకి దూరంగా ఉంటూ వచ్చిన ఆయన శుక్రవారం నాడు తెలుగుదేశం పార్టీలో చేరారు.

AP Politics: ఎమ్మెల్యేగా రఘురామ.. ఎక్కడనుంచి పోటీ చేయనున్నారంటే..!
Raghu Rama Krishna Raju

Andhra Pradesh: టీడీపీలో చేరిన రఘురామకృష్ణం రాజుకు(Raghu Rama Krishna Raju) టికెట్ కన్ఫామ్ అయ్యింది. చంద్రబాబు(Chandrababu) ఆయనకు టికెట్ ఖరారు చేశారు. ఉండి(Undi) నియోజకవర్గాన్ని రఘురామకృష్ణం రాజుకు కేటాయించారు చంద్రబాబు. ఎంపీగా గెలిచి.. ఐదేళ్లపాటు వైసీపీకి దూరంగా ఉంటూ వచ్చిన ఆయన శుక్రవారం నాడు తెలుగుదేశం పార్టీలో చేరారు. చంద్రబాబు సమక్షంలో ఆయన టీడీపీ కండువా కప్పుకున్నారు. తొలుత ఆయన ఎంపీగా పోటీ చేస్తారని భావించినా.. అది కన్ఫామ్ అవలేదు. టీడీపీ నుంచి ఉండి ఎమ్మెల్యేగా పోటీ చేసేందుకు సిద్ధమయ్యారు. ఇదిలాఉంటే.. ఉండి నియోజకవర్గానికి తొలుత రామరాజు పేరును ప్రకటించింది టీడీపీ. తాజాగా సమీకరణల నేపథ్యంలో ఆ టికెట్‌ను రామరాజుకు కాదని.. రఘురామకృష్ణం రాజుకు ప్రకటించింది టీడీపీ అధిష్టానం.

2019లో రఘురామకృష్ణం రాజు వైసీపీ నుంచి నరసపురం ఎంపీగా పోటీ చేసి గెలుపొందారు. ఆ తరువాత చోటు చేసుకున్న పరిణామాలతో వైసీపీకి దూరంగా ఉంటూ వచ్చారు. ఏకంగా సొంత పార్టీ అధిష్టానంపైనే అనేక విమర్శలు, ఆరోపణలు చేశారు. దాంతో ఆయనపై సస్పెన్షన్ వేటు వేసింది వైసీపీ అధిష్టానం. అయినప్పటికీ.. అటు పార్టీకి రాజీనామా చేయకుండా.. ఇటు వేరే పార్టీలో చేరకుండా ఉంటూ వచ్చారు. మరికొద్ది రోజుల్లో సార్వత్రిక ఎన్నికలు జరుగనుండటం.. ఎన్నికల నోటిఫికేషన్ విడుదల అవడంతో రఘురామకృష్ణం రాజు వైసీపీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. శుక్రవారం నాడు టీడీపీలో చేరారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..

Updated Date - Apr 06 , 2024 | 02:15 PM