Share News

AP News: నేడు తిరుపతి గంగమ్మ జాతరకు చాటింపు

ABN , Publish Date - May 14 , 2024 | 10:44 AM

Andhrapradesh: తిరుపతిలో ఎంతో వైభవంగా జరిగే తాతయ్యగుంట గంగమ్మ జాతరకు నేడు (మంగళవారం) చాటింపు జరుగనుంది. ఏపీలో జరిగే జాతరలో గంగమ్మ జాతర ఒకటి. తిరుపతి గంగమ్మ జాతరకు ఎంతో విశిష్ట ఉంది. ఏడు రోజుల పాటు జరిగే ఈ జాతరకు వివిధ ప్రాంతాల నుంచి వేలాది మంది భక్తులు తరలివస్తుంటారు. తిరుపతి గ్రామదేవత తాతాయ్యగుంట గంగమ్మకు ప్రతీ ఏటా జాతర చేయడం ఆనవాయితీగా వస్తోంది. ప్రతీ ఏటా మే నెలలో ఏడు రోజుల పాటు జాతర నిర్వహించటం జరుగుతుంది.

AP News: నేడు తిరుపతి గంగమ్మ జాతరకు చాటింపు
Tirupati Gangamma Jatara 2024

తిరుపతి, మే 14: తిరుపతిలో (Tirupati) ఎంతో వైభవంగా జరిగే తాతయ్యగుంట గంగమ్మ జాతరకు నేడు (మంగళవారం) చాటింపు జరుగనుంది. ఏపీలో జరిగే జాతరలో గంగమ్మ జాతర ఒకటి. తిరుపతి గంగమ్మ జాతరకు (Tirupati Gangamma Jatara)ఎంతో విశిష్ట ఉంది. ఏడు రోజుల పాటు జరిగే ఈ జాతరకు వివిధ ప్రాంతాల నుంచి వేలాది మంది భక్తులు తరలివస్తుంటారు. తిరుపతి గ్రామదేవత తాతాయ్యగుంట గంగమ్మకు ప్రతీ ఏటా జాతర చేయడం ఆనవాయితీగా వస్తోంది. ప్రతీ ఏటా మే నెలలో ఏడు రోజుల పాటు జాతర నిర్వహించటం జరుగుతుంది. జాతరలో భాగంగా గ్రామ దేవతకు ప్రత్యేక పూజలు చేస్తారు. మంగళవారం అర్థరాత్రి చాటింపుతో గంగమ్మ జాతర ప్రారంభంకానుంది.

Chandrababu: వారణాసికి చంద్రబాబు.. ఎందుకంటే..?


కైకాల వంశస్తులు తిరుపతి గంగజాతర సందర్భంగా మంగళవారం గ్రామంలో చాటింపు వేస్తారు. అనంతరం భేరి వీధిలో తొలి చాటింపు పూజ నిర్వహించి నగర శివారు ప్రాంతాలలో అష్టదిగ్భంధనం చేసి చాటింపుతో జాతరకు శ్రీకారం చుట్టనున్నారు. బుధవారం బైరాగివేషంతో భక్తులు అమ్మవారిని దర్శించుకుని మొక్కులు తీర్చుకోనున్నారు. నేటి నుంచి ఈనెల 21 వరకు జాతర జరుగనుంది. 22వ తేదీన తెల్లవారు జామున అమ్మవారి విశ్వరూప దర్శనం, చెంప నరికే కార్యక్రమంతో జాతర ముగియనుంది. ఈ ఏడు రోజుల పాటు వివిధ వేషాలలో గంగమ్మను భక్తులు దర్శించుకోనున్నారు. అలాగే ఈ జాతరలో మరో విశేషం ఉంది. జాతర జరిగినన్ని రోజులు గ్రామస్తులు ఊరి విడిచి వెళ్లరాదు. అలాగే ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన వారు కూడా రాత్రుళ్లు బస చేయకుండా వెళ్లిపోవడం అక్కడి ఆచారం.


ఇవి కూడా చదవండి...

CBI Court: జగన్ లండన్‌ పర్యటనపై నేడే తీర్పు...

ఓటేసేందుకు పోటెత్తిన జనం

Read Latest AP News And Telugu News

Updated Date - May 14 , 2024 | 10:51 AM