Share News

YCP Mla: పోలింగ్ కేంద్రంలో రూల్స్ బ్రేక్.. ఏం చేశారంటే..?

ABN , Publish Date - May 14 , 2024 | 09:21 AM

ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికల్లో పలు చోట్ల హింసాత్మక ఘటనలు జరిగాయి. ఎన్నికల సందర్భంగా వైసీపీ కార్యకర్తలు రెచ్చిపోయారు. కొన్నిచోట్ల ఎమ్మెల్యే అభ్యర్థులు మితిమీరి ప్రవర్తించారు. కొందరు నేతలు తమకు నిబంధనలు వర్తించవు అన్నట్టు ప్రవర్తించారు.

YCP Mla: పోలింగ్ కేంద్రంలో రూల్స్ బ్రేక్.. ఏం చేశారంటే..?
YCP MLA

శ్రీకాకుళం: ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికల్లో పలు చోట్ల హింసాత్మక ఘటనలు జరిగాయి. ఎన్నికల సందర్భంగా వైసీపీ కార్యకర్తలు రెచ్చిపోయారు. కొన్నిచోట్ల ఎమ్మెల్యే అభ్యర్థులు మితిమీరి ప్రవర్తించారు. కొందరు నేతలు తమకు నిబంధనలు వర్తించవు అన్నట్టు ప్రవర్తించారు.


ఏం జరిగిందంటే..?

టెక్కలి వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి దువ్వాడ శ్రీనివాస్ ఓటు వేసేందుకు పోలింగ్ బూత్‌కు వచ్చారు. ఓటు వేసే సమయంలో పేరు ఎంట్రీ చేసుకున్నారు. ఆ సమయంలో శ్రీనివాస్‌కు ఫోన్ వచ్చింది. ఇంకేముంది తీసి యథేచ్చగా మాట్లాడారు. పోలింగ్ కేంద్రం ఇది, ఇతరులకు ఇబ్బంది కలుగుతుందని అనుకోలే. శ్రీనివాస్ ఫోన్ మాట్లాడుతుండగా కొందరు వీడియో తీశారు. దానిని సోషల్ మీడియాలో షేర్ చేయడంతో వైరల్ అవుతుంది.


రూల్స్ బ్రేక్

వాస్తవానికి పోలింగ్ కేంద్రంలోనికి మొబైల్ తీసుకొని వెళ్లొద్దు. ఫోన్ తీసుకొస్తే వెంటనే బయటకు పంపిస్తారు. కానీ ఆయన అలా చేయలేదు. ఫోన్ మాట్లాడుతూనే స్లిప్ తీసుకున్నాడు. అలానే వేలికి ఇంక్ పెట్టించుకున్నాడు. అక్కడినుంచి ఈవీఎం వద్దకెల్లి ఓటు వేశాడు. ఓటు వేసే సమయంలో అందరికీ నిబంధనలు ఒకేలా ఉంటాయి. దువ్వాడ శ్రీనివాస్ ఇందుకు అతీతంగా ప్రవర్తించారు. తాను ప్రజా ప్రతినిధి అని దర్పం ప్రదర్శించారు. నేతలు అంటే మిగతా వారికి, జనాలకు ఆదర్శంగా నిలవాలి. శ్రీనివాస్ అందుకు విరుద్దంగా ప్రవర్తించారు. అతని వైఖరిపై సర్వత్రా విమర్శలు వ్యక్తం అవుతున్నాయి.



Read Latest
AP News and Telugu News

Updated Date - May 14 , 2024 | 10:44 AM