Share News

Trains: పలు రైళ్ల దారి మళ్లింపు.. కారణం ఏంటంటే..

ABN , Publish Date - Jul 26 , 2024 | 01:29 PM

సెంట్రల్‌ రైల్వేలోని డౌండ్‌ వద్ద జరుగుతున్న నాన్‌ ఇంటర్లాకింగ్‌ పనుల కారణంగా గుంతకల్లు(Guntakal) మీదగా వెళ్లే పలు రైళ్లను దారిమళ్లించనున్నట్లు రైల్వే అధికారులు పేర్కొన్నారు. ముంబై-బెంగళూరు ఎక్స్‌ప్రెస్‌(Mumbai-Bangalore Express) (నెం. 11301)ను ఈనెల 29వ తేదీ నుంచి ఆగస్టు 1వ తేదీ వరకూ, దీని తిరుగు ప్రయాణపు రైలు (నెం. 11302)ను ఈ నెల 28 నుంచి 31వ తేదీ వరకూ, అలాగే కన్యాకుమారి-పూనా(Kanyakumari-Poona) ఎక్స్‌ప్రెస్‌ (నెం. 16382)ను ఈ నెల 28, 29 తేదీల్లోనూ, దీని తిరుగు ప్రయాణపు రైలు (నెం. 16381)ని ఈనెల 30, ఆగస్టు 1వ తేదీన పూనే, మీరజ్‌, కురుద్వాడి స్టేషన్ల మీదుగా మళ్లించనున్నట్లు తెలియజేశారు.

Trains: పలు రైళ్ల దారి మళ్లింపు.. కారణం ఏంటంటే..

గుంతకల్లు(అనంతపురం): సెంట్రల్‌ రైల్వేలోని డౌండ్‌ వద్ద జరుగుతున్న నాన్‌ ఇంటర్లాకింగ్‌ పనుల కారణంగా గుంతకల్లు(Guntakal) మీదగా వెళ్లే పలు రైళ్లను దారిమళ్లించనున్నట్లు రైల్వే అధికారులు పేర్కొన్నారు. ముంబై-బెంగళూరు ఎక్స్‌ప్రెస్‌(Mumbai-Bangalore Express) (నెం. 11301)ను ఈనెల 29వ తేదీ నుంచి ఆగస్టు 1వ తేదీ వరకూ, దీని తిరుగు ప్రయాణపు రైలు (నెం. 11302)ను ఈ నెల 28 నుంచి 31వ తేదీ వరకూ, అలాగే కన్యాకుమారి-పూనా(Kanyakumari-Poona) ఎక్స్‌ప్రెస్‌ (నెం. 16382)ను ఈ నెల 28, 29 తేదీల్లోనూ, దీని తిరుగు ప్రయాణపు రైలు (నెం. 16381)ని ఈనెల 30, ఆగస్టు 1వ తేదీన పూనే, మీరజ్‌, కురుద్వాడి స్టేషన్ల మీదుగా మళ్లించనున్నట్లు తెలియజేశారు.

ఇదికూడా చదవండి: Tungabhadra: ఉధృ‘తుంగా’.. ఉగ్రరూపం దాల్చిన తుంగభద్ర


ముంబై-నాగర్‌కోయిల్‌ ఎక్స్‌ప్రెస్‌ (నెం. 16352)ను ఈ నెల 28న, దీని తిరుగు ప్రయాణపు రైలు (నెం. 16351)ని 29వ తేదీన, చెన్నై సెంట్రల్‌-ఏక్తా నగర్‌ ఎక్స్‌ప్రెస్‌ (నెం. 20919)ను, ట్యుటుకోరిన్‌-ఓకా ఎక్స్‌ప్రెస్‌ (నెం. 19567)ను 28న,

pandu3.2.jpg

కరైకల్‌-ముంబై ఎక్స్‌ప్రెస్‌ (నెం. 11018)ను 29న, చెన్నై-ముంబై ఎక్స్‌ప్రెస్‌ (నెం. 22180) ను 30న, ముంబై-కోయంబత్తూరు ఎక్స్‌ప్రెస్‌ (నెం. 11013) ఈ నెల 30, 31 తేదీల్లోనూ, కోయంబత్తూరు-ముంబై ఎక్స్‌ప్రెస్‌ (నెం. 11014)ను, నాగర్‌కోయిల్‌-ముంబై ఎక్స్‌ప్రెస్‌ (నెం. 16340)ను ఈ నెల 29, నుం చి 31వ తేదీ వరకూ, ముంబై-నాగర్‌కోయిల్‌ ఎక్స్‌ప్రెస్‌ (నెం. 16339)ని ఈ నెల 31, ఆగస్టు 1వ తేదీన గుంతకల్లు, బళ్లారి, హుబ్లి, మీరజ్‌, పూనే(Guntakallu, Bellary, Hubli, Meeraj, Pune) స్టేషన్ల మీదుగా మళ్లించనున్నట్లు తెలిపారు. అదేవిధంగా ముంబై-మధురై ఎక్స్‌ప్రెస్‌ (నెం. 22101)ను ఈ నెల 31న, ముంబై-చెన్నై ఎక్స్‌ప్రెస్‌ (నెం. 22159) రైలును ఆగస్టు1న పూనా, మీరజ్‌, కురుద్వాడి స్టేషన్ల మీదుగా మళ్లించనున్నట్లు వివరించారు.


ఇదికూడా చదవండి: కాల్పుల కలకలం.. పోలీసులపై గొడ్డలి, రాళ్లతో యువకుల దాడి

ఇదికూడా చదవండి: మీపై ఫెమా కేసు.. అరెస్ట్‌ తప్పదంటూ బెదిరింపులు

ఇదికూడా చదవండి: క్రైం బ్రాంచ్‌ పోలీసులమంటూ.. రూ.22 లక్షలు కొట్టేశారు..

Read Latest Telangana News and National News

Updated Date - Jul 26 , 2024 | 01:29 PM