Share News

AP News: టీడీపీ రెబెల్స్ మీద చర్యలు తీసుకోరా..? క్రాస్ ఓటింగ్‌పై ఎమ్మెల్యేలు మేకపాటి, కోటంరెడ్డి

ABN , Publish Date - Jan 29 , 2024 | 12:02 PM

ఎమ్మెల్సీ ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్‌కు పాల్పడలేదని ఎమ్యెల్యేలు మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి, కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి మరోసారి స్పష్టంచేశారు.

 AP News: టీడీపీ రెబెల్స్ మీద చర్యలు తీసుకోరా..? క్రాస్ ఓటింగ్‌పై ఎమ్మెల్యేలు మేకపాటి, కోటంరెడ్డి

అమరావతి: ఎమ్మెల్సీ ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్‌కు పాల్పడలేదని ఎమ్యెల్యేలు మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి, కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి మరోసారి స్పష్టంచేశారు. వీరిద్దరూ ప్రభుత్వ విప్ ధిక్కరించి తెలుగుదేశం పార్టీ (TDP) అభ్యర్థికి ఓటు వేశారు. పార్టీ విప్ దిక్కరించిన నలుగురు ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని స్పీకర్ కార్యాలయానికి గతంలో వైసీపీ ఫిర్యాదు చేసింది. దాంతో స్పీకర్ తమ్మినేని సీతారం షోకాజ్ నోటీసులు జారీచేశారు. సమాధానం ఇవ్వాలని ఎమ్మెల్యేలకు స్పష్టంచేశారు. దాంతో స్పీకర్‌ను కలిసేందుకు ఎమ్మెల్యేలు కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి ఆయన కార్యాలయానికి వచ్చారు.

సీక్రెట్ విధానంలో ఓటింగ్

ఎమ్మెల్సీ ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్ వేయలేదని ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి మరోసారి స్పష్టంచేశారు. ఎమ్మెల్సీ ఎన్నికలు సీక్రెట్ ఓటింగ్ విధానంలో జరుగుతాయని గుర్తుచేశారు. తమ మీద చర్యలు తీసుకోవడానికి ఎలాంటి ఆధారాలు లేవని తేల్చిచెప్పారు. షోకాజు నోటీసుకు సంబంధించి సమాధానం ఇవ్వడానికి సమయం కోరామని చంద్రశేఖర్ రెడ్డి వివరించారు. తమకు సమయం ఇవ్వలేదని పేర్కొన్నారు. ఆరోగ్యం బాగోలేదని, మెడికల్ సర్టిఫికెట్ కూడా సమర్పించానని గుర్తుచేశారు. తనకు మూడు స్టంట్లు వేశారని, ఇప్పటికీ ఆరోగ్యం కుదట పడలేదని మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి స్పష్టంచేశారు. తమ మీద చర్యలు తీసుకునేందుకు ఉత్సాహం చూపిస్తున్నారని మేకపాటి మండిపడ్డారు. మరి తెలుగుదేశం పార్టీ రెబల్స్ మీద వేటు వేస్తారో లేదో సమాధానం ఇవ్వాలని డిమాండ్ చేశారు. షోకాజు నోటీసులకు సంబంధించి సమయం ఇవ్వాలని స్పీకర్‌ను కోరామని మరో ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి స్పష్టంచేశారు. తమకు టైమ్ ఇచ్చేందుకు స్పీకర్ నిరాకరించారని వివరించారు. స్పీకర్‌ను కలుస్తామని, కలిసిన తర్వాత వివరాలు మీడియాకు తెలియజేస్తామని పేర్కొన్నారు.

కక్షసాధింపు చర్యలు

సీఎం జగన్‌పై మేకపాటి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. అధికారం ఉంటే ఏదైనా చేయొచ్చనే రీతిలో వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. రాజీనామా చేసి తాము విమర్శిస్తున్నామని పేర్కొన్నారు. రాజీనామా చేయకుండా చాలా మంది సీఎం జగన్‌ను విమర్శిస్తున్నారని తెలిపారు. అన్నిరకాల విమర్శలు ఎదుర్కొంటున్న గొప్ప వ్యక్తి సీఎం జగన్ అని తనదైన శైలిలో సెటైర్లు వేశారు.

మరిన్ని ఏపీ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి.

Updated Date - Jan 29 , 2024 | 12:02 PM