Varaprasad: మోదీ పాలనలో దేశం అభివృద్ధిలో దూసుకెళ్తుంది
ABN , Publish Date - Mar 24 , 2024 | 10:35 PM
మోదీ పాలనలో దేశం అభివృద్ధిలో శరవేగంగా దూసుకెళ్తుందని బీజేపీ తిరుపతి లోక్‌సభ అభ్యర్థి డా. వి. వరప్రసాద్‌రావు(Varaprasad) అన్నారు. ఆదివారం నాడు ఢిల్లీ వేదికగా ఆయన మీడియాతో మాట్లాడుతూ... తిరుపతి ఎంపీ స్థానానికి బీజేపీ తరఫున తనకు అవకాశం కల్పించినందుకు కేంద్ర నేతలకు ధన్యవాదాలు తెలిపారు. కూటమి తరపున అందరిని కలుపుకుంటూ ముందుకు సాగుతానని తెలిపారు. అత్యధిక మెజార్టీతో కూటమి తరఫున గెలుపొందుతానని అన్నారు.
ఢిల్లీ: మోదీ పాలనలో దేశం అభివృద్ధిలో శరవేగంగా దూసుకెళ్తుందని బీజేపీ తిరుపతి లోక్‌సభ అభ్యర్థి డా. వి. వరప్రసాద్‌రావు(Varaprasad) అన్నారు. ఆదివారం నాడు ఢిల్లీ వేదికగా ఆయన మీడియాతో మాట్లాడుతూ... తిరుపతి ఎంపీ స్థానానికి బీజేపీ తరఫున తనకు అవకాశం కల్పించినందుకు కేంద్ర నేతలకు ధన్యవాదాలు తెలిపారు. కూటమి తరపున అందరిని కలుపుకుంటూ ముందుకు సాగుతానని తెలిపారు. అత్యధిక మెజార్టీతో కూటమి తరఫున గెలుపొందుతానని అన్నారు. 2009లో సినీనటులు చిరంజీవి తనకు రాజకీయంగా అవకాశం కల్పించారని.. కానీ అప్పుడు గెలవలేకపోయానని చెప్పారు. 2014లో వైసీపీ తిరుపతి ఎంపీగా, గూడూరు ఎమ్మెల్యేగా అవకాశం ఇచ్చిందని తెలిపారు. పదేళ్లుగా ప్రజల మధ్యలోనే ఉన్నానని చెప్పారు. 2014-19 మధ్య ప్రధాని మోదీ పాలనను దగ్గర నుంచి చూశానని... ఆయనతో కలిసి పని చేయాలని కోరుకున్నానని అన్నారు. 12 ఏళ్లుగా వైసీపీలో క్రమశిక్షణతో వ్యవహరించానని చెప్పారు. ఈసారి మళ్లీ వైసీపీ ఎంపీగా పోటీ చేయాలని భావించానని.. కానీ తనకు ఈసారి అవకాశం లభించలేదని చెప్పారు.
కేంద్ర ప్రభుత్వ పథకాల ద్వారా గూడూరు నియోజకవర్గం అభివృద్ధి చెందుతోందని వివరించారు. ఎంపీగా పనిచేసినప్పుడు కేంద్ర ప్రభుత్వం నుంచి చాలా ప్రాజెక్టులు తీసుకురాగలిగానని అన్నారు. ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఇంత అవకాశం లేకపోయిందన్నారు. బీజేపీ చాలా క్రమశిక్షణ కలిగిన పార్టీ అని.. తన అనుభవాన్ని ఉపయోగించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి, ముఖ్యంగా తిరుపతి ప్రాంతానికి వీలైనంత మేర అభివృద్ధి ప్రాజెక్టులు తీసుకొస్తానని చెప్పారు. 2014-19 మధ్య ప్రత్యేక హోదా కోసం ముందే రాజీనామా చేయాల్సి వచ్చినప్పుడు కొన్ని పనులు మధ్యలోనే ఆగిపోయాయన్నారు. ఆ పనులను ఈసారి గెలిచాక పూర్తి చేస్తానని చెప్పారు. నడికుడి - శ్రీకాళహస్తి సహా ఆగిపోయిన రైల్వే ప్రాజెక్టులతో సహా మిగతా రంగాల పనులను పూర్తి చేస్తానని తెలిపారు. తమిళనాడులో ఐఏఎస్ అధికారిగా ఉన్న సమయంలో కూడా కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులను రాష్ట్రానికి తీసుకెళ్లానని వరప్రసాద్‌రావు చెప్పారు.
మరిన్ని ఏపీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి