Share News

AP Politics: సీఎం జగన్‌కు రాజీనామా లేఖ పంపించిన ఎంపీ.. అధికార పార్టీకి మరో గట్టి ఎదురుదెబ్బ

ABN , Publish Date - Feb 21 , 2024 | 03:34 PM

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు (AP Assebly Election) సమీపిస్తున్న వేళ అధికార వైఎస్సార్‌సీపీకి (YSRCP) మరో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. రాజ్యసభ ఎంపీ, నెల్లూరు జిల్లా వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి (Vemireddy Prabhakar Reddy) రాజీనామా చేశారు. ఈ మేరక సీఎం జగన్‌కి ఆయన లేఖ రాశారు. ‘‘ ఆర్యా.. నేను నా వ్యక్తిగత కారణాల వలన శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరి జిల్లా వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్ పార్టీ జిలా పార్టీ అధ్యక్ష పదవికి, వైఎస్సార్‌కాంగ్రెస్ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నాను’’ అని పేర్కొన్నారు.

AP Politics: సీఎం జగన్‌కు రాజీనామా లేఖ పంపించిన ఎంపీ.. అధికార పార్టీకి మరో గట్టి ఎదురుదెబ్బ

తాడేపల్లి: ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు (AP Assebly Election) సమీపిస్తున్న వేళ అధికార వైఎస్సార్‌సీపీకి (YSRCP) మరో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. రాజ్యసభ ఎంపీ, నెల్లూరు జిల్లా వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి (Vemireddy Prabhakar Reddy) రాజీనామా చేశారు. ఈ మేరక సీఎం జగన్‌కి ఆయన లేఖ రాశారు. ‘‘ ఆర్యా.. నేను నా వ్యక్తిగత కారణాల వలన శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరి జిల్లా వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్ పార్టీ జిలా పార్టీ అధ్యక్ష పదవికి, వైఎస్సార్‌కాంగ్రెస్ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నాను. ఈ సందర్భంగా మీరు నాకు పార్టీలో అందజేసిన సహకారానికి నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను’’ అంటూ పార్టీకి రాజీనామా లేఖలో వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి పేర్కొన్నారు.

Untitled-7.jpg

ఇక రాజ్యసభ ఎంపీ పదవి కూడా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి రాజీనామా చేశారు. ‘‘ నేను, నా వ్యక్తిగత కారణాల వలన నా రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నానని తెలియజేస్తున్నాను’’ అంటూ ఎంపీ పదవి రాజీనామా చేసిన లేఖలో పేర్కొన్నారు. ఇదిలావుండగా వేమిరెడ్డి భార్య ప్రశాంతి కూడా అధికార పార్టీకి బైబై చెప్పేసినట్టు తెలుస్తోంది. ప్రస్తుతం ఆమె టీటీడీలో (TTD) కీలక పదవిలో ఉన్నారు. అయితే వీరిద్దరూ రాజకీయ భవిష్యత్ ప్రణళికలపై క్లారిటీ రావాల్సి ఉంది.

ఇవి కూడా చదవండి

CM Jagan: ఎన్జీటీలో సీఎం జగన్‌కు ఎదురుదెబ్బ

Kuppam: మీ మద్దతు నాకా.. మా ఆయనకా.. నారా భువనేశ్వరీ చమత్కారం

మరిన్ని ఏపీ వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Feb 21 , 2024 | 03:35 PM