Venkaiahnaidu: ఇకపై పార్టీ రాజకీయాల్లోకి వెళ్ళను
ABN , Publish Date - Apr 23 , 2024 | 11:08 AM
Andhrapradesh: మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు నివాసంలో మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా పద్మవిభూషణ్ స్వీకరించిన వెంకయ్య నాయుడును ఢిల్లీలోని తెలుగు సంఘాలు, ప్రముఖులు, జర్నలిస్టులు అభినందించారు. అనంతరం వెంకయ్య మాట్లాడుతూ... తాను చేసిన సేవలను గుర్తించి కేంద్రం పద్మ విభూషణ్ ఇవ్వడం సంతోషంగా ఉందన్నారు. ఉపరాష్ట్రపతిగా పనిచేసిన తరువాత మళ్ళీ రాజకీయాల్లోకి రావడం మంచిది కాదని భవించా..
న్యూఢిల్లీ, ఏప్రిల్ 23: మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు (Former Vice President Venkaiah Naidu) నివాసంలో మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా పద్మవిభూషణ్ (Padmavibhushan) స్వీకరించిన వెంకయ్య నాయుడును ఢిల్లీలోని తెలుగు సంఘాలు, ప్రముఖులు, జర్నలిస్టులు అభినందించారు. అనంతరం వెంకయ్య మాట్లాడుతూ... తాను చేసిన సేవలను గుర్తించి కేంద్రం పద్మ విభూషణ్ ఇవ్వడం సంతోషంగా ఉందన్నారు. ఉపరాష్ట్రపతిగా పనిచేసిన తరువాత మళ్ళీ రాజకీయాల్లోకి రావడం మంచిది కాదని భవించా.. అందుకే రాలేదని తెలిపారు. ఇకపై ప్రజలతో ఉంటా అని స్పష్టం చేశారు.
Hanuman Jayanti: భాగ్యనగరంలో ఘనంగా హనుమాన్ జయంతి వేడుకలు.. కాసేపట్లో శోభాయాత్ర
ప్రజా సమస్యలను, ఇతర అంశాలను నిన్న కూడా ప్రధానితో చర్చించినట్లు చెప్పారు. ఇకపై పార్టీ రాజకీయాల్లోకి వెళ్ళనని తేల్చిచెప్పేశారు. సాధారణ రాజకీయాల గురించి స్పందిస్తూ ఉంటానని తెలిపారు. వచ్చే రోజుల్లో మరింత ఉత్సాహంగా పనిచేస్తానన్నారు. కళాశాలలు, యూనివర్సిటీలు, ఐఐఎం అనేక సంస్థల కార్యక్రమాల్లో పాల్గొంటానన్నారు. ప్రజా జీవితంలో ప్రతిఒక్కరు యాక్టివ్ గా ఉండాలని.. ఎవరి పని వారు సక్రమంగా చేయడమే దేశ భక్తి అని చెప్పుకొచ్చారు.
ఇది డిస్ట్రబింగ్ ట్రెండ్...
నేతలు పార్టీలు మారడం ట్రెండ్‌గా మారిందని.. ఇది డిస్ట్రబింగ్ ట్రెండ్ అని వ్యాఖ్యలు చేశారు. పదవికి రాజీనామా చేసి ఏ పార్టీలో అయినా చేరొచ్చన్నారు. పదవులకు రాజీనామా చేయకుండా పార్టీలు మారి నేతలను విమర్శించడం సరికాదన్నారు. యాంటీ డిఫెక్షన్ లా ను బలోపేతం చేయాలని తెలిపారు. రాజకీయపార్టీలు ఏం చేయగలుగుతారో అవే మేనిఫెస్టోలో హామీలుగా ఇవ్వాలని సూచించారు. చెట్లకు డబ్బులు కాయవనేది వాస్తవమన్నారు. తాను ఉచితాలకు వ్యతిరేకమన్నారు. విద్య, ఆరోగ్యం ఉచితంగా ఇవ్వాలని.. ప్రజలు కూడా ఉచితాలను ప్రశ్నించాలని అన్నారు. అసభ్యంగా మాట్లాడేవారు, అవినీతి పరులను ప్రజలు తిరస్కరించాలని కోరారు.
AP Elections: వైసీపీకి కొత్త కష్టాలు.. కుట్రలకు బలికాబోమంటున్న జనం..!
తప్పకుండా ఓటింగ్‌లో పాల్గొనండి...
‘‘పార్టీకి నేనిచ్చే స్థానం నా జీవితంలో మారదు. ఆర్టికల్ 370 రద్దు నేను రాజ్యసభ చైర్మన్‌గా ఉన్నప్పుడు ఆమోదం పొందడం జీవితంలో గొప్ప అంశం. లోక్‌సభలో మెజారిటీ ఉన్నా మొదట రాజ్యసభలో ప్రవేశపెట్టారు. సభను వాయిదా వేయకుండా నడిపించా. శాంతియుతంగా చర్చల ద్వారా ప్రజాస్వామ్యయుతంగా ఆర్టికల్ 370 రద్దు బిల్లు ఆమోదం పొందింది. రాజకీయ పార్టీలు వారి సభ్యులను పార్లమెంట్ ప్రొసీడింగ్స్ సరిగా జరిగేలా ట్రెయిన్ చెయ్యాలి. దేశం రోజు రోజుకు ముందుకు వెళ్తుంది. ప్రపంచం భారత్ వైపు చూస్తోంది. శత్రు దేశాలు భారత్‌ను చూసి ఓర్చుకోలేక పోతున్నాయి. అన్ని రాజకీయపార్టీలు ప్రజాస్వామ్య బలోపేతానికి కృషి చేయాలి. ఓటర్లు తమ ఓటర్ స్లిప్ వేరిఫై చేసుకోవాలి. ఏ పార్టీకి ఓటు వేయాలనుకుంటే ఆ పార్టీకి ఓటు వేయండి. ప్రజలంతా ఓటింగ్‌లో తప్పకుండా పాల్గొనండి’’ అంటూ వెంకయ్య నాయుడు కోరారు.
ఇవి కూడా చదవండి...
YSRCP: ధర్మవరం వైసీపీ ఎమ్మెల్యే కేతిరెడ్డికి బిగ్ షాక్
Read Latest AP News And Telugu News