Viral: ఇంత నీచానికి ఎందుకు దిగజారుతారో? ఈమె 10వ తరగతి స్టేట్ ర్యాంకర్ అని తెలిసినా..
ABN , Publish Date - Apr 22 , 2024 | 04:45 PM
ఉత్తర్‌ప్రదేశ్ పదవ తరగతి పరీక్షల్లో రాష్ట్ర ర్యాంకర్‌గా నిలిచిన ఓ బాలికను నెట్టింట కొందరు దారుణంగా ట్రోల్ చేస్తున్నారు. ఇది తెలిసి అనేక మంది ఆమెకు మద్దతుగా నిలుస్తూ ట్వీట్ చేస్తున్నారు.
ఇంటర్నెట్ డెస్క్: ఉత్తర్‌ప్రదేశ్ (Uttarpradesh) పదవ తరగతి పరీక్షల్లో రాష్ట్ర ర్యాంకర్‌గా నిలిచిన ఓ బాలికను నెట్టింట కొందరు దారుణంగా ట్రోల్ చేస్తున్నారు. ఆమె ప్రతిభను ప్రశంసించకుండా ముఖంపై వెంట్రులను (Facial Hair) ప్రస్తావిస్తూ హేళన చేస్తున్నారు. ఈ ధోరణి అనేక మందిని కలచివేయడంతో బాలికకు మద్దతుగా నిలిచారు. ఇలాంటి వాళ్లను లెక్క చేయొద్దంటూ ఆమెకు అండగా నిలుస్తున్నారు.
Viral: పొట్టేళ్లను శాంత పరిచేందుకు డియోడరెంట్ వినియోగం!
ఇటీవల పదవతరగతి ఫలితాల్లో ప్రాచీ నిగమ్ (Prachi Nigam) అనే బాలిక 98.5 మార్కులు సాధించి టాప్‌లో (State Topper) నిలిచింది. కానీ ఫలితాలు వెలువడిన తొరువాత కొందరు ఆమెపై ట్రోలింగ్ ప్రారంభించారు. ఆమె ఫేషియల్ హెయిర్ (ముఖంపై జుట్టు) గురించి మాట్లాడుతూ హేళన చేశారు. ఈ టాపిక్ క్రమంగా ట్రెండింగ్‌లో రావడంతో అనేక మంది ఆగ్రహానికి లోనయ్యారు. చిన్నారి అన్న కనికరం కూడా లేకుండా బాలికను హేళన చేయడం అమానుషమని అన్నారు. పసి హృదయంపై ఈ వ్యాఖ్యలు ఎటువంటి ప్రభావం చూపుతాయో తెలిసీ లెక్కచేయక అవహేళన చేయడంపై దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మనుషషులు ఇంతగా దిగజారిపోతున్నందుకు కొందరు ఆందోళన వ్యక్తం చేశారు.
మరికొందరు మాత్రం బాలికకు మద్దతుగా నిలిచారు. చదువులో ముందున్న బాలిక పట్టుదలతో ముందుకు సాగాలని చెప్పారు. పీసీఓఎస్ లేదా హార్మోన్‌ల అసమతౌల్యత ఇలా జరిగుండొచ్చని కొందరు చెప్పారు. ఆమె ముఖం తీరు గురించి ప్రతిభ గురించి మాత్రమే కామెంట్స్ చేయాలని కొందరు వ్యాఖ్యానించారు. బాలికను హేళను చేస్తున్న వారి టైం లైన్లో తిట్టిపోస్తూ మండిపడుతున్నారు. ఇంత వ్యతిరేకత ఎదుర్కొంటూ కూడా ప్రాచీ టాపర్‌గా నిలిచిందంటే ఆమె స్థితప్రజ్ఞత, ధీరత్వం అర్థమవుతోందని కొందరు అన్నారు. దీంతో, ప్రస్తుతం ప్రాచీ పేరు ట్రెండింగ్‌లో ఉంది.
మరిన్ని వైరల్ వార్తల కోసం ఈ లింక్‌పై క్లిక్ చేయండి