AP Police: గంజాయిపై ఉక్కుపాదం మోపుతాం: ఏసీపీ పెంటారావు
ABN , Publish Date - Sep 15 , 2024 | 09:57 PM
విశాఖ సీపీ ఆదేశాలతో గంజాయిపై ఉక్కుపాదం మోపుతామని నార్త్ దిశా ఏసీపీ సీ.హెచ్ పెంటారావు అన్నారు. పీఎం పాలెంలో ఏసీపీ సీ.హెచ్ పెంటారావు మీడియా సమావేశం నిర్వహించారు. ఓ చీటింగ్ కేసుకు సంబంధించిన వివరాలను మీడియాకు వెల్లడించారు.
విశాఖపట్నం: విశాఖ సీపీ ఆదేశాలతో గంజాయిపై ఉక్కుపాదం మోపుతామని నార్త్ దిశా ఏసీపీ సీ.హెచ్ పెంటారావు అన్నారు. పీఎం పాలెంలో ఏసీపీ సీ.హెచ్ పెంటారావు మీడియా సమావేశం నిర్వహించారు. ఓ చీటింగ్ కేసుకు సంబంధించిన వివరాలను మీడియాకు వెల్లడించారు. కృష్ణ బాబు అనే వ్యక్తికి చిన్నప్పటి నుంచీ దొంగతనాలు చేయడం అలవాటుగా మారిందని అన్నారు.
ఆయనపై కేవలం పీఎం పాలెం పోలీసు స్టేషన్‌లో 10 కేసులకు పైగా ఉన్నాయని చెప్పారు. కొద్ది రోజులు క్రితం ఒక కేసులో అరెస్ట్ కూడా అయ్యారని అన్నారు. అతనికి జైల్లో రాంబాబు అనే వ్యక్తి పరిచయం అయ్యాడని తెలిపారు. బయటకు వచ్చాక రాంబాబుతో 2 కేజీల గంజాయి అమ్మమని కృష్ణ బాబుకు సుపారీ ఇచ్చాడని అన్నారు. కృష్ణ బాబు అదుపులోకి తీసుకున్నపుడు 5 మొబైల్ ఫోన్లు, 3 బైక్‌లను స్వాధీనం చేసుకున్నామని తెలిపారు.
ప్రస్తుతం విశాఖలో పోలీస్ సిబ్బంది కొరత ఉందని చెప్పారు. స్థానిక హాస్టల్ సేఫ్టీలపై కూడా నిఘా పెడుతున్నామని తెలిపారు. స్కూల్స్, కళాశాలల్లో గంజాయిపై అవగాహన కార్యక్రమాలు చేపడతామని అన్నారు. మత్తు పదార్థాలపై యువతకు అవగాహన తప్పనిసరిగా కల్పించాల్సిన అవసరం ఉందని ఏసీపీ సీ.హెచ్ పెంటారావు పేర్కొన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి:
Steel Plant: ఆ విషయంలో కూటమి ప్రభుత్వ విధానం స్పష్టం చేయాలి: ఎమ్మెల్సీ బొత్స..
AP News: వైసీపీ నేతల మీద అక్రమ కేసులు.. మంత్రి బాల వీరాంజనేయ స్వామి కీలక వ్యాఖ్యలు
YS Sharmila: కూటమి ప్రభుత్వంపై వైఎస్ షర్మిల ఫైర్.. ఏమన్నారంటే?