Share News

AP News: సినర్జిన్ కంపెనీ ప్రమాద బాధితులకు పరిహారం అందజేత

ABN , Publish Date - Aug 26 , 2024 | 04:02 PM

Andhrapradesh: అనకాపల్లి జిల్లా జవహర్ లాల్ నెహ్రూ ఫార్మా సిటీలోని సినర్జిన్ ఫార్మా కంపెనీలో జరిగిన ప్రమాదంలో చనిపోయిన వారికి పరిహారం ప్రభుత్వం పరిహారాన్ని అందజేసింది. ఈ ఘటనలో చనిపోయిన ముగ్గురు కార్మికులకు ఒక్కో కార్మికుడికి రూ.1 కోటి చొప్పున ప్రభుత్వం ద్వారా పరిహారం అందజేశారు. ఈనె 23వ తేదీ పరిశ్రమలో జరిగిన ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన నలుగురిలో...

AP News:  సినర్జిన్ కంపెనీ ప్రమాద బాధితులకు పరిహారం అందజేత
AP Government

అమరావతి, ఆగస్టు 26: అనకాపల్లి జిల్లా జవహర్ లాల్ నెహ్రూ ఫార్మా సిటీలోని సినర్జిన్ ఫార్మా కంపెనీలో జరిగిన ప్రమాదంలో చనిపోయిన వారికి పరిహారం ప్రభుత్వం (AP Government) పరిహారాన్ని అందజేసింది. ఈ ఘటనలో చనిపోయిన ముగ్గురు కార్మికులకు ఒక్కో కార్మికుడికి రూ.1 కోటి చొప్పున ప్రభుత్వం ద్వారా పరిహారం అందజేశారు. ఈనె 23వ తేదీ పరిశ్రమలో జరిగిన ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన నలుగురిలో ముగ్గురు కార్మికులు ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే.

HYDRA News: హైడ్రా కూల్చివేతలపై మంత్రి పొన్నం ప్రభాకర్ కీలక వ్యాఖ్యలు


నాటి ప్రమాదంలో గాయపడి చికిత్స పొందుతూ నేడు విజయనగరం జిల్లాకు చెందిన ఉద్యోగి ప్రాణాలు కోల్పోయాడు. తీవ్ర గాయాలతో చికిత్స పొందుతున్న మరో కార్మికుడి ప్రాణాలు కాపాడేందుకు వైద్యులు శతవిధాలుగా ప్రయత్నాలు చేస్తున్నారు. పరిహారం అందజేత, ప్రస్తుతం బాధితుడికి అందుతున్న వైద్యంపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నిరంతరం పర్యవేక్షిస్తున్నారు.

Shri Krishna Janmashtami: శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా అర్ధరాత్రి 12 గంటలకు అరుదైన దృశ్యం



కాగా.. పరవాడ ఫార్మాసిటీలోని సినర్జిన్ యాక్టివ్ ఇన్‌గ్రేడియంట్స్ సంస్థ, యూనిట్ -3 లో జరిగిన ప్రమాదంలో గాయ‌ప‌డి ఇండ‌స్ ఆసుప‌త్రిలో చికిత్స పొందుతున్న‌ క్ష‌త‌గాత్రుల‌లో ముగ్గురు కార్మికులు జార్ఖండ్ వాసులు కాగా, ఒకరు విజయనగరం జిల్లాకు చెందినవారిగా గుర్తించినట్లు జిల్లా కలెక్టర్ విజయ్ కృష్ణన్ తెలిపారు. వీరిలో జార్ఖండ్‌కు చెందిన రోయ అంగీరియా(22), లాల్ సింగ్ (21) ఇప్పటికే మృతిచెందగా, మృతుల కుటుంబ సభ్యులకు ఒక్కొక్కరికి కోటి రూపాయల చొప్పున పరిహారం అందించినట్లు జిల్లా కలెక్టర్ వెల్లడించారు. ఈరోజు (సోమవారం) విజయనగరం జిల్లా వాసి కె. సూర్యనారాయణ (35) ఇండస్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందినట్లు కలెక్టర్ ప్రకటించారు. సూర్యనారాయణ కుటుంబ సభ్యులకు మంగళవారం కోటి రూపాయలు ఎక్స్గ్రేషియా చెక్కును అందించినట్టు జిల్లా కలెక్టర్ విజయకృష్ణన్ ప్రకటన విడుదల చేశారు.


ఇవి కూడా చదవండి...

CM Chandrababu: ప్రజలకు శ్రీకృష్ణ జన్మాష్టమి శుభాకాంక్షలు తెలిపిన సీఎం చంద్రబాబు

Anitha: సినర్జిన్ కంపెనీ బాధితుల నష్ట పరిహారంపై హోంమంత్రి కీలక ప్రకటన

Read Latest AP News And Telugu News

Updated Date - Aug 26 , 2024 | 04:09 PM