Botsa Satyanarayana: కూటమి ప్రభుత్వం హామీలను వెంటనే అమలు చేయాలి
ABN , Publish Date - Oct 19 , 2024 | 06:11 PM
కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని వైసీపీ ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ అన్నారు. హామీల విషయంలో కూటమి ప్రభుత్వానికి కొంత సమయం ఇవ్వాలని తాము పెద్దగా ఈ ప్రభుత్వంపై విమర్శలు చేయలేదని అన్నారు. కూటమి పెద్దలు ఢిల్లీ వెళ్లొచ్చిన తర్వాత .2026లో ఎన్నికలు వస్తున్నాయని చెప్పారని గుర్తుచేశారు.
విశాఖపట్నం: కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని వైసీపీ ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ అన్నారు. హామీల విషయంలో కూటమి ప్రభుత్వానికి కొంత సమయం ఇవ్వాలని తాము పెద్దగా ఈ ప్రభుత్వంపై విమర్శలు చేయలేదని అన్నారు. కూటమి పెద్దలు ఢిల్లీ వెళ్లివచ్చిన తర్వాత 2026లో ఎన్నికలు వస్తున్నాయని చెప్పారని గుర్తుచేశారు. ఇప్పుడు అంత సమయం అవసరం లేదని అర్థమైంది.. కూటమి నేతలే ఆ సమయాన్ని కుదించుకున్నారని చెప్పారు. వైసీపీ ప్రభుత్వంలో టన్ను ఇసుకను 475 రూపాయలకు ఇచ్చామని... అప్పట్లో లారీ ఇసుక ఎంత ధర ఉందో కూటమి ప్రభుత్వంలో ఎంత ధర ఉందో ప్రజలే చూడాలని బొత్స సత్యనారాయణ అన్నారు.
ఉచిత ఇసుక ఎక్కడ దొరుకుతుందో చెప్పాలని ప్రశ్నించారు. ఎప్పటి నుంచి ఉచిత ఇసుకను అందుబాటులోకి తీసుకువస్తారో చెప్పాలని నిలదీశారు. గతంలో ఇసుక దోచేశారన్నారు కదా.. ఇప్పుడు ఉచిత ఇసుక ఎందుకు అమలు చేయలేకపోతున్నారని అడిగారు. ఉత్తరాంధ్ర మూడు జిల్లాల్లో ఎక్కడైనా గతం కంటే తక్కువ ధరకు ఇసుక దొరుకుతుందో చెప్పాలని అన్నారు. గతంలో నాసిరకం మద్యం అన్నారని.. ఇప్పుడు అదే మద్యం ఎలా అమ్ముతున్నారు... ఎక్కడైనా బ్యాన్ చేశారా అని బొత్స సత్యనారాయణ ప్రశ్నించారు.
హామీలు అమలు చేయాలి...
‘‘మద్యం ధరలు గత ప్రభుత్వాల కంటే, ఇతర రాష్ట్రాల కంటే తగ్గిస్తానన్నారు.. ఇప్పుడేం చేశారు. నిత్యవసర ధరలు పెరిగాయి. ఇచ్చిన హామీలు నిండా ఒక సంవత్సరం అయినా అమలు చేయాలి కదా. రైతు భరోసా, రైతుకు ఎప్పుడు సహాయం చేస్తారు.. వ్యవసాయం మీద కూటమి ప్రభుత్వం మానిటరింగ్ చేస్తుందా. వ్యవసాయ మంత్రికి కూడా రైతుల సమస్యల గురించి తెలుసు కదా.. ఎందుకు రైతులకు సహకారం అందించడం లేదు. అగ్గి పెట్టి కోసం కోట్లు ఖర్చుపెట్టిన ప్రభుత్వాన్ని ఇప్పుడే చూస్తున్నాం.. ప్రభుత్వం ఇప్పటికైనా సమాధానం చెప్పాలి. గొర్లలో చిన్నారులు చనిపోవడానికి. మెయింటినెన్స్ కాంట్రాక్ట్‌లో గొడవల వల్లే ఇలాంటి పరిస్థితి వచ్చింది.. విశాఖలో బయటపడిన డ్రగ్స్ వ్యవహారం ఏమైంది ... అది బయట పెట్టాలి’’ అని బొత్స సత్యనారాయణ వెల్లడించారు.