Share News

CM Chandrababu: విశాఖ ఎయిర్‌పోర్టుకు చేరుకున్న సీఎం చంద్రబాబు

ABN , Publish Date - Aug 22 , 2024 | 12:37 PM

Andhrapradesh: అచ్యుతాపురం ఎసెన్సియా ఫార్మా పరిశ్రమంలో జరిగిన ప్రమాదంపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు. వెంటనే అచ్యుతాపురంకు వెళ్లాలని నిర్ణయించారు. ఈ ప్రమాదంలో మృతి చెందిన వారి కుటుంబాలతో పాటు తీవ్రంగా గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వారిని ఆయన పరామర్శించనున్నారు.

CM Chandrababu: విశాఖ ఎయిర్‌పోర్టుకు చేరుకున్న సీఎం చంద్రబాబు
CM Chandrababu Naidu

విశాఖపట్నం, ఆగస్టు 22: అచ్యుతాపురం ఎసెన్సియా ఫార్మా పరిశ్రమంలో జరిగిన ప్రమాదంపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు (CM Chandrababu Naidu) తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు. వెంటనే అచ్యుతాపురంకు వెళ్లాలని నిర్ణయించారు. ఈ ప్రమాదంలో మృతి చెందిన వారి కుటుంబాలతో పాటు తీవ్రంగా గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వారిని ఆయన పరామర్శించనున్నారు. కాసేపటి క్రితమే విజయవాడ ఎయిర్పోర్ట్ నుంచి ప్రత్యేక విమానంలో విశాఖ ఎయిర్పోర్టుకు చేరుకున్నారు.

Pawan Kalyan: పరిశ్రమల్లో రక్షణ చర్యలు తీసుకుంటాం.. పవన్ కళ్యాణ్ కీలక వ్యాఖ్యలు


విశాఖ ఎయిర్పోర్ట్ నుంచి హెలికాప్టర్లో నావెల్ కస్టల్ బ్యాటరీ చేరుకుని అక్కడ నుంచి రోడ్డు మార్గాన మెడికవర్ హాస్పటల్‌కు చంద్రబాబు చేరుకోనున్నారు. అచ్యుతాపురం ఎసెన్సియా ఫార్మా పరిశ్రమలో జరిగిన ప్రమాదంలో గాయపడినవారిని సీఎం చంద్రబాబు హాస్పటల్లో కలిసి మాట్లాడనున్నారు. అనంతరం ప్రమాదం జరిగిన ఎస్ఎన్షియ అడ్వాన్స్డ్ మెడికల్ సైన్సెస్ ప్రైవేట్ లిమిటెడ్ ఫ్యాక్టరీని పరిశీలించనున్నారు.


కాగా.. అచ్యుతాపురం సెజ్‌లో ఫార్మా కంపెనీలో బుధవారం భారీ పేలుడు సంభవించింది. ఈ దుర్ఘటనలో 17 మంది ప్రాణాలు కోల్పోగా.. దాదాపు 60 మందికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ప్రమాదంలో గాయపడిన క్షతగాత్రులను ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. అలాగే... రాష్ట్ర ప్రభుత్వం కూడా మృతుల కుటుంబాలకు పరిహారం ప్రకటించింది. ఫార్మా ప్రమాద మృతుల కుటుంబాలకు పరిహారాన్ని ప్రభుత్వం తరుఫున విశాఖ జిల్లా కలెక్టర్ ఎం.ఎన్.హరేంధిర ప్రసాద్ ప్రకటించారు. కేజీహెచ్‌లో మార్చురీ వద్ద మృతుల కుటుంబ సభ్యులను కలెక్టర్ ఓదార్చారు. మృతుల కుటుంబాలకు రూ. కోటి ఎక్స్‌గ్రేషియాను ప్రకటించారు. అచ్యుతాపురం సెజ్ బాధితులను ప్రభుత్వం అన్నివిధాలుగా ఆదుకుంటుందని..భాదితులకు అండగా ఉంటుందని కలెక్టర్ తెలిపారు.

Alluri Sitarama Raju: అల్లూరి తొలి సాయుధ పోరుకు 102 ఏళ్లు


అచ్యుతాపురం ప్రమాదంపై ప్రధాని మోదీ దిగ్భ్రాంతి సైతం దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు రూ.2 లక్షల పరిహారాన్ని మోదీ ప్రకటించారు. గాయపడిన వారికి రూ.50 వేల పరిహారాన్ని కేంద్రం ప్రకటించింది. మృతుల కుటుంబాలకు ప్రధాని మోదీ ప్రగాఢ సానుభూతి తెలిపారు. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ప్రధాని ఆకాంక్షించారు. ప్రమాదంపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా స్పందించారు. ఇంత ఘోర ప్రమాదం జరగడం చాలా బాధాకరమని అన్నారు. ఇలాంటి పరిశ్రమలు పొల్యూషన్ కంట్రోల్ బోర్డు కిందకు రాదని చెప్పారు. ఇద్దరు యజమానులు హైదరాబాద్‌లో ఉంటారని అధికారులు చెబుతున్నారని అన్నారు. వారిద్దరి మధ్య గొడవ, బాధ్యతలేని నాయకత్వం ఫ్యాక్టరీ విషయంలో ఉందని అర్ధమైందని పవన్ కళ్యాణ్ వెల్లడించారు.


ఇవి కూడా చదవండి...

BC Janardhan: ఎసెన్షియా కంపెనీ దుర్ఘటన అత్యంత బాధాకరం

Tirupati: స్కూల్‌లో మంటలు... ప్రమాద సమయంలో అక్కడే 350 మంది విద్యార్థులు.. చివరకు!

Read Latest AP News And Telugu News

Updated Date - Aug 22 , 2024 | 12:47 PM