Share News

Cyber Alert: ఇమెయిల్‌కు వచ్చే ఈ లెటర్ల విషయంలో జాగ్రత్త.. కేంద్రం అలర్ట్

ABN , Publish Date - Aug 22 , 2024 | 12:33 PM

ఇటివల పలువురికి బెదిరింపు ఇమెయిల్స్(emails) వచ్చాయి. ఆ లేఖల ద్వారా హ్యాకర్లు పిల్లల అశ్లీలత, లైంగిక దోపిడీ గురించి ఆరోపణలు చేస్తూ మోసాలకు పాల్పడుతున్నట్లు సైబర్ దోస్త్.. సోషల్ మీడియా(social media)లో వైరల్ అయిన లెటర్ గురించి ప్రజలను హెచ్చరించింది. ఆ విశేషాలేంటో ఇప్పుడు చుద్దాం.

Cyber Alert: ఇమెయిల్‌కు వచ్చే ఈ లెటర్ల విషయంలో జాగ్రత్త.. కేంద్రం అలర్ట్
Cyber Dost alert

సైబర్ మోసగాళ్లు(cyber cheaters) ఎప్పటికప్పుడు కొత్త ప్లాన్స్ వేస్తూ అమాయక ప్రజల నుంచి డబ్బులు గుంజాలని చూస్తున్నారు. ఈ క్రమంలోనే ఇటివల పలువురికి బెదిరింపు ఇమెయిల్స్(emails) వచ్చాయి. ఆ లేఖల ద్వారా హ్యాకర్లు పిల్లల అశ్లీలత, లైంగిక దోపిడీ గురించి ఆరోపణలు చేస్తూ మోసాలకు పాల్పడుతున్నట్లు సైబర్ దోస్త్.. సోషల్ మీడియా(social media)లో వైరల్ అయిన లెటర్ గురించి ప్రజలను హెచ్చరించింది. సైబర్ దోస్త్ తన పోస్ట్‌లో ఈ లేఖలు నకిలీవని అలాంటి వాటిని కేంద్ర ప్రభుత్వం జారీ చేయలేదని స్పష్టం చేసింది.


హ్యాకర్లు

లేఖతో పాటు పంపిన ఇమెయిల్‌లో ADG సందీప్ ఖీర్వార్, ADG ప్రధాన కార్యాలయం, సైబర్ క్రైమ్, ఆర్థిక నేరాల విభాగం ద్వారా యూజర్ ఇంటర్నెట్ ప్రోటోకాల్ విచారణను హ్యాకర్లు ఉదహరించారు. ఆఫీసులోనో, ఇంట్లోనో కూర్చొని జువెనైల్ పోర్నోగ్రాఫిక్ వెబ్‌సైట్‌లను రహస్యంగా చూస్తున్నారని విశ్లేషణలో తేలిందని మెయిల్‌లో పేర్కొన్నారు. దీంతో పాటు సైబర్ క్రైమ్‌కు సంబంధించిన అన్ని క్లిష్టమైన, సున్నితమైన కేసులను హోం మంత్రిత్వ శాఖ, ఢిల్లీ పోలీసుల స్పెషల్ సెల్‌తో కలిసి దర్యాప్తు చేస్తుందని కూడా మెయిల్‌లో స్పష్టం చేశారు. వాటిలో మహిళలు, పిల్లలకు సంబంధించిన కేసులు కూడా ఉన్నాయని బెదిరింపులకు పాల్పడ్డారు.


బెదిరింపులు

అంతేకాదు నోటీసు అందిన 24 గంటల్లోగా స్పందించకుంటే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని కూడా బెదిరించారు. అయితే ‘నకిలీ’ లేఖలోని కంటెంట్ సైబర్ దోస్త్ షేర్ చేసిన ఫోటో మాదిరిగానే ఉడంటంతో అనేక మంది నమ్మరాని అధికారులు అన్నారు. కానీ సంతకం చేసిన విధానం మాత్రం భిన్నంగా ఉంటుంది. అంతేకాకుండా లేఖలో రెండు ప్రధాన కార్యాలయాలు ఉన్నట్లు ప్రస్తావించారు. ఒకటి హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ, మరొకటి ది ఇండియన్ పోలీస్ సర్వీస్, ఆఫీస్ ఆఫ్ ది అడిషనల్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (ADG).


అలర్ట్

ఈ నేపథ్యంలో ఇలాంటి లెటర్లు మీకు వస్తే జాగ్రత్తగా ఉండాలని సైబర్ దోస్త్ హెచ్చరించింది. వీటిని నమ్మి మోసపోవద్దని హితవు పలికింది. స్కామర్‌లు ప్రజలను మోసగించడానికే ఇలాంటివి చేస్తున్నారని వెల్లడించింది. కాబట్టి వినియోగదారులు వీటి విషయంలో భయపడకుండా, ప్రశాంతంగా ఉండాలని సూచించింది. ఏదైనా ఇలాంటి కేసుల విషయంలో అనుమానాలు ఉంటే సైబర్ క్రైమ్ ఫిర్యాదు కోసం https://cybercrime.gov.inను సందర్శించాలని వెల్లడించింది. లేదా మీకు దగ్గరలోని పోలీస్ స్టేషన్‌లో కూడా ఫిర్యాదు చేయవచ్చని చెప్పింది.


ఇవి కూడా చదవండి:

Accident: బస్సును ఢీకొట్టిన ట్యాంకర్.. ఐదుగురు మృతి, మరో 20 మందికి గాయాలు


Bomb Threat: ఎయిర్ ఇండియా విమానానికి బాంబు బెదిరింపు.. విమానంలో 135 మంది ప్రయాణికులు


PM Modi: శాంతి సందేశంతో యుద్ధభూమికి!

Read More Crime News and Latest Telugu News

Updated Date - Aug 22 , 2024 | 12:36 PM