AP News: చంద్రబాబు విజన్ ఉన్న నాయకుడు: జితేందర్ శర్మ
ABN , Publish Date - Jul 11 , 2024 | 09:37 PM
దేశంలోనే విజనరీ ఉన్న నాయకుడు ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడని మెడ్ టెక్ సీఈఓ జితేందర్ శర్మ (DR. JITENDRA SHARMA) తెలిపారు. సీఎం చంద్రబాబు ఈరోజు(గురువారం) మెడ్ టెక్ జోన్ ప్రతినిధులతో సమావేశం అయ్యారు.
విశాఖపట్నం: దేశంలోనే విజనరీ ఉన్న నాయకుడు ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడని (CM Nara Chandrababu Naidu) మెడ్ టెక్ సీఈఓ జితేందర్ శర్మ (DR. JITENDRA SHARMA) తెలిపారు. సీఎం చంద్రబాబు ఈరోజు(గురువారం) మెడ్ టెక్ జోన్ ప్రతినిధులతో సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా సీఈఓ ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. ‘‘25 సంవత్సరాలు నేను మెడ్ టెక్ అభివృద్ధి కోసం ఎంతో కష్టపడ్డా. 2016 లో చంద్రబాబు మొక్కగా నాటారు. అప్పుడు సెల్ సిగ్నల్ లేదు... పిన్ కోడ్ కూడా లేదు.. కానీ ప్రస్తుతం 145 కంపెనీలతో కోవిడ్ ఆర్టీపీసీఆర్ టెస్ట్, 500 వెంటిలేటర్లు 1000 ఆక్సిజెన్ సిలిండర్‌లు సరఫరా చేశా. 275 ఎకరాల భూమిలో 15 లక్షల sft లో రీసెర్చ్ లాబ్స్, ఎకో సిస్టం వచ్చే సంవత్సరానికి దేశంలోనే అత్యంత గొప్పగా తీర్చిదిద్దాతా. మెడికల్ డివైజ్ మ్యానిఫ్యాక్టరింగ్ యూనిట్స్ ఇక్కడ ఉన్నాయి. ఈ రోజూ మరో రెండు యూనిట్లు ప్రారంభించారు. కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ కూడా చద్రబాబును అభినందించారు.. మీ విజన్‌ని కొనియాడారు. చాలా దేశాల అధ్యక్షులు చంద్రబాబును కలవాలని అనుకుంటున్నారు’’ అని జితేందర్ శర్మ తెలిపారు.