Gandi Babji: కోడి కత్తి శ్రీనుకు న్యాయం చేయాలి
ABN , Publish Date - Jan 19 , 2024 | 10:14 PM
కోడి కత్తి శ్రీనుకు న్యాయం చేయాలని తెలుగుదేశం ఇన్‌చార్జి గండి బాబ్జి ( Gandi Babji ) డిమాండ్ చేశారు. శుక్రవారం ఏవీఎన్ కాలేజీ డౌన్‌లో ఉన్న అంబేద్కర్ విగ్రహం వద్ద దక్షిణ నియోజకవర్గం గండి బాబ్జి ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు.
విశాఖపట్నం: కోడి కత్తి శ్రీనుకు న్యాయం చేయాలని తెలుగుదేశం నేత గండి బాబ్జి ( Gandi Babji ) డిమాండ్ చేశారు. శుక్రవారం ఏవీఎన్ కాలేజీ దగ్గర ఉన్న అంబేద్కర్ విగ్రహం వద్ద గండి బాబ్జి ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. దళితులపై దమనకాండ ఆపాలని నినాదాలు చేశారు. ఈ సందర్భంగా గండి బాబ్జి మాట్లాడుతూ... వైసీపీ హయాంలో ఎంతోమంది దళితులు హత్యకు గురయ్యారని చెప్పారు. దళితుల ద్రోహి సీఎం జగన్ అని విమర్శించారు. జగన్.. దళితులకు అన్యాయం చేసి అంబేడ్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించి ఆ పాపాలను కడుగుదామని అనుకుంటున్నారా? అని ప్రశ్నించారు. కోడి కత్తి శ్రీనును ఐదేళ్లుగా జైల్లో పెట్టారని.. ఒక వేళ శిక్ష వేసినా ఐదేళ్లు కంటే తక్కువే పడేదన్నారు. వైసీపీ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ కాలేజ్‌లో మద్యం బాటిళ్లను పంపిణీ చేయడం దారుణమన్నారు. ఎమ్మెల్యేపై చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌కు ఫిర్యాదు చేశామని గండి బాబ్జి తెలిపారు.