Ganta Srinivasa Rao: ఓటర్లు కూటమికే పట్టం కట్టారు..: గంటా శ్రీనివాసరావు
ABN , Publish Date - May 22 , 2024 | 12:51 PM
విశాఖ: ఈనెల13 న జరిగిన పోలింగ్ సరళి చూస్తే... ఓటర్లు కూటమికే పట్టం కట్టారని.. సంక్రాంతి పండగను తలపించే విధంగా వివిధ రాష్ట్రాల నుంచి ప్రజలు వచ్చి ఓట్లు వేసారని మాజీ మంత్రి, కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి గంటా శ్రీనివాసరావు అన్నారు.
విశాఖ: ఈనెల13 న జరిగిన పోలింగ్ సరళి (Polling pattern) చూస్తే... ఓటర్లు (Voters) కూటమికే (Kutami) పట్టం కట్టారని.. సంక్రాంతి పండగను తలపించే విధంగా వివిధ రాష్ట్రాల నుంచి ప్రజలు (People) తరలి వచ్చి ఓట్లు వేసారని మాజీ మంత్రి, కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి గంటా శ్రీనివాసరావు (Ganta Srinivasa Rao) అన్నారు. ఈ సందర్భంగా బుధవారం ఆయన విశాఖలో మీడియాతో మాట్లాడుతూ.. ప్రజల్లో ఒక కసి కనిపించిందని.. అందుకే భారీగా పోలింగ్ జరిగిందని.. కూటమికే పాజిటివ్ వేవ్ ఉందని అన్నారు. ఐ ప్యాక్ టీమ్‌తో సీఎం జగన్ (CM Jagan) మాట్లాడుతూ ఫలితాలు చూసి షాక్ అవుతారని అన్నారని.. నిజంగా ఫలితాలు వచ్చిన తర్వాత జగన్ షాక్ కావాల్సిందేనని గంటా శ్రీనివాసరావు అన్నారు.
మంత్రి బొత్స సత్యనారాయణ (Minister Bosta) మాటలంతా ఒక మైండ్ గేమ్ అని, ఆయన చెబుతున్న ప్రమాణ స్వీకారం మాటలను ప్రజలు విని నవ్వుకుంటున్నారని గంటా శ్రీనివాసరావు వ్యాఖ్యానించారు. ఎన్నికల తర్వాత హింసకు వైసీపీయే కారణమని అన్నారు. తెనాలి వైసీపీ అభ్యర్థిపై ఓటరు చేయి చేసుకోవడంతో.. పబ్లిక్ పల్స్ ఏమిటో తెలుస్తోందన్నారు. జూన్ 9వ తేదీన జగన్ కాదు... చంద్ర బాబు (Chandrababu) సీఎంగా ప్రమాణ స్వీకారం చేస్తారని గంటా శ్రీనివాసరావు ఆశాభావం వ్యక్తం చేశారు.
ఈ వార్తలు కూడా చదవండి..
పదేళ్లు కనిపించని కరెంట్ కోతలను చూస్తున్నాం: కేటీఆర్
తిరుమల శ్రీవారిని దర్శించుకున్న సీఎం రేవంత్ రెడ్డి
ఫ్యాన్ పార్టీకి సీఈసీ చెక్..
అడ్డంగా దొరికిన ఎమ్మెల్యే పిన్నెల్లి..
అమిత్ సా వ్యాఖ్యాలపై కేజ్రీవాల్ ఆగ్రహం..
బెంగళూరు రేవ్ పార్టీలో కీలక సూత్రధారి ఎవరంటే..
Read Latest AP News and Telugu News
Read Latest Telangana News and National News
Read Latest Chitrajyothy News and Sports News