Governor Haribabu: సినిమా షూటింగ్‌లపై కంభంపాటి ఆసక్తికర వ్యాఖ్యలు
ABN , Publish Date - Jul 09 , 2024 | 10:23 PM
మిజోరం గవర్నర్ కంభంపాటి హరిబాబు (Governor Kambhampati Haribabu) కీలక వ్యాఖ్యలు చేశారు. ఆంధ్ర ప్రదేశ్ ఆర్థిక అభివృద్ధిలో బ్యాంక్ దే కీలక పాత్ర అని తెలిపారు. అప్పులు ఇచ్చి...వాటిని వసూళ్లు చేయడంలో కనక మహా లక్ష్మి బ్యాంక్ మంచి పని తీరు కనబర్చిందని చెప్పారు.
విశాఖపట్నం: మిజోరం గవర్నర్ కంభంపాటి హరిబాబు (Governor Kambhampati Haribabu) కీలక వ్యాఖ్యలు చేశారు. ఆంధ్ర ప్రదేశ్ ఆర్థిక అభివృద్ధిలో బ్యాంక్ దే కీలక పాత్ర అని తెలిపారు. అప్పులు ఇచ్చి...వాటిని వసూళ్లు చేయడంలో కనక మహా లక్ష్మి బ్యాంక్ మంచి పని తీరు కనబర్చిందని చెప్పారు. ఈ సందర్భంగా సినిమా షూటింగ్‌లపై కూడా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. విశాఖలో షూటింగ్ జరుపుకున్న సినిమాలు అన్నీ విజయవంతం అయ్యాయని గుర్తుచేశారు. ఏ చిత్రం కూడా ఫెయిల్యూర్ కాలేదు బహుశా..ఈ గడ్డ యొక్క మహిమ ఏమోనని చెప్పారు. ఇక్కడ నుంచి పుట్టిన బ్యాంకు కూడా అభివృద్ధి పరంగా దూసుకుపోతుందని హరిబాబు పేర్కొన్నారు.