Share News

Bomb Threats: ఆగని బాంబు బెదిరింపులు.. మరో విమానానికి..

ABN , Publish Date - Oct 28 , 2024 | 06:30 PM

దేశవ్యాప్తంగా బాంబు బెదిరింపులు కొనసాగుతున్నాయి. తిరుపతి, లక్నోలోని పలు హోటళ్లకు బెదిరింపులు వచ్చాయి. ఈరోజు హైదరాబాద్ నుంచి విశాఖపట్నం వచ్చిన ఇండిగో ఫ్లైట్‌కి బాంబు బెదిరింపు కాల్ చేశారు. ఎయిర్ పోర్టు అధికారులు విమానాన్ని పరిశీలించారు

Bomb Threats: ఆగని బాంబు బెదిరింపులు.. మరో విమానానికి..

విశాఖపట్నం: భారతీయ విమానయాన సంస్థలు నిర్వహిస్తున్న విమానాలకు బాంబు బెదిరింపులు ఆగడం లేదు. అంతకంతకూ ఎక్కువైపోతున్నాయి. నిన్న (ఆదివారం) ఒక్క రోజే కనీసం 50 విమానాలకు బాంబు బెదిరింపులు వచ్చాయి. వీటితో కలుపుకొని గత 14 రోజుల వ్యవధిలో మొత్తం 350 విమానాలకు ఫేక్ బాంబు బెదిరింపులు వచ్చాయి. వీటిలో అత్యధికం సోషల్ మీడియా ద్వారా వచ్చాయని కేంద్ర ప్రభుత్వవర్గాలు తెలిపాయి.


ఇండిగోవిమానానికి ..

తాజాగా.. హైదరాబాద్ నుంచి విశాఖపట్నం వచ్చిన ఇండిగోవిమానానికి ఇవాళ (సోమవారం) బాంబు బెదిరింపు కాల్ వచ్చింది. అప్పటికే విశాఖపట్నంలో ఇండిగో విమానం ల్యాండ్ అయింది. విమానాన్ని ఎయిర్ పోర్టు అధికారులు పరిశీలించారు. అనంతరం ఇండిగో ఫ్లైట్ విశాఖపట్నం నుంచి తిరిగి ముంబై బయలుదేరి వెళ్లింది.


అయితే.. గతంలో తమ సంస్థకు చెందిన 15 విమానాలకు భద్రతా పరమైన అలర్ట్‌లు వచ్చాయని, క్షుణ్ణంగా తనిఖీలు చేసిన తర్వాత విమానాల కార్యకలాపాలను తిరిగి కొనసాగించామని అకాశ ఎయిర్ తెలిపింది. ఇండిగోకు చెందిన 18 విమానాలకు, విస్తారాకు చెందిన 17 విమానాలకు బెదిరింపులు వచ్చినట్లు కేంద్ర ప్రభుత్వ వర్గాలు పేర్కొన్నాయి.


దేశవ్యాప్తంగా బాంబు బెదిరింపులు..

కాగా.. దేశవ్యాప్తంగా బాంబు బెదిరింపులు కొనసాగుతున్నాయి. ఆదివారం 50కిపైగా విమానాలతోపాటు తిరుపతి, లక్నోలోని పలు హోటళ్లకు బెదిరింపులు వచ్చాయి. భద్రతా నిబంధనల మేరకు రెండు విమానాలను దారి మళ్లించారు. మిగిలిన వాటిలో తనిఖీలు చేపట్టి ఎటువంటి ప్రమాదం లేదని తేల్చారు. దీంతో గత రెండు వారాల్లో బెదిరింపులు వచ్చిన విమానాల సంఖ్య 350 దాటింది. తిరుపతిలో మూడు రోజులుగా హోటళ్లకు వస్తున్న బాంబు బెదిరింపులు కొనసాగుతున్నాయి. ఇప్పటి వరకూ ఆరు హోటళ్లకు హెచ్చరికలు రాగా ఆయా హోటళ్లకు వెళ్లి, వాటిని ఖాళీ చేయించి, బాంబు స్క్వాడ్ తనిఖీలు చేసి ఏమీ లేవని తేల్చారు. అలాగే తిరుపతి గోవిందరాజస్వామి ఆలయం సహా ఇస్కాన్‌ టెంపుల్‌కు కూడా బాంబులు పెట్టినట్టు సమాచారం రావడంతో అధికారులు భద్రత చర్యలు చేపట్టి అణువణువు పరిశీలించారు.


ఈమెయిళ్ల ద్వారా బెదిరింపులు

ఎటువంటి ప్రమాదకరమైన వస్తువులు కనిపించకపోవడంతో ఊపిరిపీల్చుకున్నారు. మరోవైపు యూపీ రాజధాని లక్నోలోని 10 ప్రముఖ హోటళ్లకు ఈమెయిళ్ల ద్వారా బాంబు బెదిరింపులు వచ్చాయి. తనిఖీల్లో ఎటువంటి పేలుడు పదార్థాలు లేవని వెల్లడైంది. బెదిరింపు మెయిల్స్‌ కోల్‌కతాకు చెందిన మిత్ర అనే వ్యక్తి నుంచి వచ్చాయని ప్రాథమికంగా గుర్తించి అతడిని బెంగళూరుకు తరలించారు. తిరుపతి విమానాశ్రయానికి కూడా అదే వ్యక్తి నుంచి బెదిరింపులు అందినట్టు విచారణలో తేలితే ఏర్పేడు పోలీసులకు మిత్రను అప్పగించే అవకాశముందని తెలిసింది. కాగా, నకిలీ బెదిరింపులను అడ్డుకోవటానికి దర్యాప్తు, నిఘా సంస్థలతోపాటు అంతర్జాతీయ సంస్థల సహకారాన్నీ తీసుకుంటున్నామని కేంద్ర పౌరవిమానయానశాఖ మంత్రి కే రామ్మోహన్‌ నాయుడు తెలిపారు. రెండు పౌర విమానయాన చట్టాలను కూడా సవరించే కసరత్తు జరుగుతోందన్నారు.


ఈ వార్తలు కూడా చదవండి..

AP Govt: ఉచిత గ్యాస్ సిలిండర్లపై మరో కీలక నిర్ణయం .. నిధుల విడుదలకు పరిపాలన అనుమతులు

Gold And Silver Price: మహిళలకు గుడ్ న్యూస్.. తగ్గిన బంగారం ధర

Yanamala: ఇక జగన్ జీవితం పాతాళమే

Read Latest AP News And Telugu News

Updated Date - Oct 28 , 2024 | 08:22 PM