Share News

Murthy Yadav: ఎర్రమట్టి దిబ్బలపై పరిరక్షణ కోసం పోరాడుతాం

ABN , Publish Date - Nov 11 , 2024 | 01:38 PM

జగన్ ప్రభుత్వంలో ఎర్ర మట్టి దిబ్బలు ఎలా ధ్వంసం చేశారనే విషయాన్ని చాలా సార్లు చెప్పామని జనసేన నేత మూర్తి యాదవ్ అన్నారు. ఎర్రమట్టి దిబ్బల బౌండరీలపై తేడాలు ఉన్నాయని నిపుణులు కూడా చెబుతున్నారన్నారు. జియాలాజిస్ట్‌లు దీనిపై రిపోర్ట్స్ ఇచ్చారని అన్నారు.

Murthy Yadav: ఎర్రమట్టి దిబ్బలపై పరిరక్షణ కోసం పోరాడుతాం

విశాఖపట్నం: విశాఖపట్నం జిల్లాలో భౌగోళిక వారసత్వ సంపదగా గుర్తించిన ఎర్రమట్టి దిబ్బలను ఇష్టానుసారం తవ్వేస్తున్నారు. ఎర్రమట్టి దిబ్బలను తవ్వేసి వందల ఎకరాలను చదును చేస్తున్నారు. ఎన్నికల సమయంలో మొదలైన పనులు ఇప్పటికీ నిరాటంకంగా సాగడం గమనార్హం. గత ఏడాది వీఎంఆర్‌డీఏ అధికారులు ఎర్రమట్టి దిబ్బల సమీపంలో లే అవుట్లకు అనుమతి ఇచ్చినప్పుడు కూడా ఇలాగే తవ్వేశారు. అప్పుడు జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ వచ్చి పర్యావరణ విధ్వంసానికి పాల్పడుతున్నారని, వైసీపీ నేతలు కొమ్ము కాస్తున్నారని ఆరోపించారు. ఇప్పుడు ఏపీలో ప్రభుత్వం మారింది. అయినా, ఇప్పటికీ తవ్వకాలను వైసీపీ నేతలు కొనసాగిస్తుండటంపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. అయితే ఎర్రమట్టి దిబ్బల అక్రమణలు చేశారని ఫిర్యాదులు వస్తుండటంతో మైనింగ్ శాఖ చర్యలకు ఉపక్రమించింది.


ఎర్రమట్టి దిబ్బల బౌండరీలపై తేడాలు: జనసేన నేత మూర్తి యాదవ్

జగన్ ప్రభుత్వంలో ఎర్ర మట్టి దిబ్బలు ఎలా ధ్వంసం చేశారనే విషయాన్ని చాలా సార్లు చెప్పామని జనసేన నేత మూర్తి యాదవ్ అన్నారు. ఎర్రమట్టి దిబ్బల బౌండరీలపై తేడాలు ఉన్నాయని నిపుణులు కూడా చెబుతున్నారన్నారు. జియాలాజిస్ట్‌లు దీనిపై రిపోర్ట్స్ ఇచ్చారని అన్నారు. ఎర్ర మట్టి దిబ్బలను అధికారులు ఎలా బౌండరీస్ తప్పించారు.. గతంలో విశాఖ కలెక్టర్‌ర్లు కూడా ప్రభుత్వానికి లెటర్స్ రాశారని గుర్తుచేశారు. ఎర్ర మట్టి దిబ్బలు పరిరక్షణ కోసం పోరాడుతున్నామన్నారు. హోసింగ్ సొసైటీ వారు ఇక్కడ ఎర్ర మట్టి దిబ్బలు లేవని అనడం కరెక్ట్ కాదని అన్నారు. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆ ప్రాంతంలో పర్యటించారు..ఇది రాజకీయ పోరాటం కాదని. వారసత్వ సంపాదన కాపాడటం కోసమే తమ ప్రయత్నమని మూర్తి యాదవ్ చెప్పారు.


ఎర్రమట్టి దిబ్బలను కాపాడాలి: రాజశేఖర్

ఎర్రమట్టి దిబ్బలు గుర్తించడంపై తాను పని చేశానని మాజీ జియాలజీ ప్రొఫెసర్ రాజశేఖర్ తెలిపారు. లాంగిట్యూడ్ లాటిట్యూడ్, ప్రకారం చాలా ఎక్కువ స్థలాన్ని గుర్తించినట్లు వివరించారు. ఆ ప్రదేశం అంతా సాహజసిద్ధంగా ఏర్పడిందని.. అందులో కొంత భాగాన్ని తీసివేసి, ఎర్ర మట్టి దిబ్బలు కాదనడం సరికాదని అన్నారు. యునెస్కో, గ్లోబల్ జియో పార్క్‌గా గుర్తించే, దిశగా పనిచేస్తున్నామని తెలిపారు. ఎర్రమట్టి దిబ్బలను కాపాడితే, టూరిజం పరంగా కాకుండా ఈ ప్రాంతం కూడా ఎంతో అభివృద్ధి చెందుతుందని అన్నారు. ఆ దిశగా ప్రభుత్వాలు పని చేయాలని కోరారు. జియో పార్క్‌గా అభివృద్ధి చెందితే ఈ ప్రాంతానికి మంచి గుర్తింపు వస్తుందని తెలిపారు. ఎర్రమట్టి దిబ్బలను కాపాడాలని మాజీ జియాలజీ ప్రొఫెసర్ రాజశేఖర్ కోరారు.


ఎర్రమట్టి దిబ్బల పరిరక్షణపై సర్వే

భీమిలి మండలం నేరేళ్లవలస రెవెన్యూ పరిధిలో గల ఎర్రమట్టి దిబ్బల పరిరక్షణ బాధ్యతను రాష్ట్ర పర్యాటక శాఖకు జియోలాజికల్‌ సర్వే ఆఫ్‌ ఇండియా (జీఎస్‌ఐ) అప్పగించింది. గత నెలలో జీఎస్‌ఐ, రెవెన్యూ, గనులు, పర్యాటక శాఖలు సంయుక్తంగా ఎర్రమట్టి దిబ్బలు ఉన్న ప్రాంతాన్ని సర్వే చేసి సరిహద్దులను నిర్ధారించారు. ఎర్రమట్టి దిబ్బల విస్తీర్ణం ఎంత?, ప్రస్తుతం ఆక్రమణకు గురైంది ఎంత అన్న వివరాలను త్వరలో జీఎస్‌ఐ విడుదల చేయనుంది.

Updated Date - Nov 11 , 2024 | 02:07 PM