Share News

AP Politics: వైసీపీలో లోకల్.. నాన్ లోకల్ వార్.. గెలిచేదెవరు..?

ABN , Publish Date - Aug 03 , 2024 | 03:22 PM

విశాఖపట్టణం వైసీపీలో లోకల్, నాన్ లోకల్ వార్ మొదలైందా అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. ఉమ్మడి విశాఖపట్నం జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ అభ్యర్థిగా విజయనగరం జిల్లాకు చెందిన మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ పేరును ప్రకటించడంతో.. ఆ పార్టీలో లోక్‌ల్.. నార్ లోకల్ వార్ చర్చ మొదలైందట

AP Politics: వైసీపీలో లోకల్.. నాన్ లోకల్ వార్.. గెలిచేదెవరు..?
YSRCP Leaders

విశాఖపట్టణం వైసీపీలో లోకల్, నాన్ లోకల్ వార్ మొదలైందా అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. ఉమ్మడి విశాఖపట్నం జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ అభ్యర్థిగా విజయనగరం జిల్లాకు చెందిన మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ పేరును ప్రకటించడంతో.. ఆ పార్టీలో లోక్‌ల్.. నార్ లోకల్ వార్ చర్చ మొదలైందట. పైకి అధినేత నిర్ణయంపై సంతృప్తితో ఉన్నామని ప్రకటిస్తున్నా.. లోలోపల మాత్రం విశాఖ జిల్లా నేతలు తమకు అన్యాయం జరుగుతుందంటూ రగిలిపోతున్నారట. ఉమ్మడి విశాఖ జిల్లాలో గత ఎన్నికల్లో ఎమ్మెల్యేలుగా పోటీచేసిన చాలామంది సీనియర్ నాయకులు ఓడిపోవడంతో ఎమ్మెల్సీ స్థానంపై ఆశలు పెట్టుకున్నారు. గతంలో ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్‌తో ఓడిపోయిన కోలా గురువులు ఎమ్మెల్సీ టికెట్‌ను ఆశించారు. కానీ పక్క జిల్లాకు చెందిన నాయకుడిని అభ్యర్థిగా ప్రకటించడంతో కక్కలేక.. మింగలేక అన్నట్టుగా జిల్లాలోని స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు ఉన్నారట. పొరుగు జిల్లాకు చెందిన నాయకుడిని తీసుకువచ్చి ఇక్కడ పోటీకి దింపడంపై సొంత పార్టీ నేతలే అసంతృప్తితో ఉన్నట్లు తెలుస్తోంది. అధినేత నిర్ణయానికి ఎదురుచెప్పలేక కొందరు నేతలు లోలోపల మదనపడుతున్నట్లు తెలుస్తోంది.

Chandrababu: వినతులు ఎన్ని ఉన్నా.. పరిష్కారమే లక్ష్యం!


అనూహ్యంగా..

ఎమ్మెల్సీగా ఉన్న వంశీ కృష్ణ శ్రీనివాస్ జనసేనలో చేరడంతో ఆయనపై అనర్హత వేటుపడింది. వంశీ కృష్ణ శ్రీనివాస్ జనసేన నుంచి ఎమ్మెల్యేగా పోటీచేసి గెలిచారు. దీంతో ఆస్థానానికి ఖాళీ ఏర్పడటంతో ఎన్నికల సంఘం నోటిఫికేషన్ ఇచ్చింది. ఈనెల 30వ తేదీన ఎన్నిక జరగనుంది. ఈక్రమంలో బొత్స సత్యనారాయణకు టికెట్ ఇస్తారని విశాఖ జిల్లా నేతలు ఊహించలేదు. కనీసం ఆయన పోటీలో ఉన్నారన్న విషయం చర్చకు రాలేదు. కానీ వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి అనూహ్యంగా బొత్స సత్యనారాయణ అభ్యర్థిత్వాన్ని ప్రకటించారు. ఇదే కోటాలో ఇప్పటికే ఎమ్మెల్సీగా ఉన్న కళ్యాణి.. సొంత జిల్లా శ్రీకాకుళం.. ఇప్పుడు మరోసారి పక్క జిల్లాకు చెందిన బొత్స సత్యనారాయణకు విశాఖ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ టికెట్ ఇవ్వడంతో సొంతపార్టీ నేతలు తీవ్ర అసహనం వ్యక్తంచేస్తున్నారనే చర్చ జోరుగా సాగుతోంది. గత సార్వత్రిక ఎన్నికల్లో విశాఖ వైసీపీ ఎంపీ అభ్యర్థిగా బొత్స సత్యనారాయణ భార్య ఝాన్సీలక్ష్మిని పోటీ చేశారు. ఎంపీ టికెట్ విషయంలో పెద్దగా ఎవరూ అభ్యంతరం చెప్పలేదు. కానీ జిల్లాలో సీనియర్లంతా ఎమ్మెల్యేలుగా ఓడిపోవడంతో ఎమ్మెల్సీ స్థానంపై ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. కానీ వారి ఆశలను అధినేత అడియాశలు చేయడంతో ప్రస్తుతం విశాఖ వైసీపీలో లోకల్, నాన్ లోకల్ వార్ నడుస్తోందట.

Purandeswari: చంద్రబాబు ప్రభుత్వం రైతులను ఆదుకునే విధంగా పని చేస్తోంది


బొత్స గెలుస్తారా..

వైసీపీకి విశాఖపట్టణం జిల్లాలోని స్థానిక సంస్థల్లో ప్రస్తుతానికి బలం ఉంది. కానీ ఈ ప్రజాప్రతినిధుల్లో చాలామంది సార్వత్రిక ఎన్నికల ఫలితాల తర్వాత టీడీపీ కూటమి వైపు చూస్తున్నారనే చర్చ జరుగుతోంది. దీంతో బొత్స సత్యనారాయణ గెలుస్తారా.. లేదా అనేది ఆసక్తిగా మారింది. బొత్స సత్యనారాయణ సామాజికంగా, ఆర్థికంగా ఉత్తరాంధ్ర జిల్లాల్లో బలమైన నాయకుడిగా ఉన్నారు. దీంతో ఆయనను అభ్యర్థిగా స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులతో క్యాంపు ఏర్పాటుచేసి.. విజయానికి కృషి చేస్తారనే అంచనాతో బొత్సను అభ్యర్థిగా ప్రకటించి ఉండొచ్చనే ప్రచారం సాగుతోంది. కానీ నాన్ లోకల్‌ను అభ్యర్థిగా ప్రకటించడంతో సొంత పార్టీ నేతలు సహకరిస్తారా లేదా అనేది వేచి చూడాల్సి ఉంది.


Minister RamPrasad Reddy: ఏపీలో మహిళలకు త్వరలోనే ఉచిత బస్సు సౌకర్యం..

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Read More Andhra Pradesh News and Latest News Telugu

Updated Date - Aug 03 , 2024 | 03:22 PM