Lord Venkateswara: వేంకటేశ్వరునికి పూలంగి సేవ
ABN , Publish Date - Dec 28 , 2024 | 11:38 PM
Lord Venkateswara: పట్టణంలోని కంచర వీధిలో గల శ్రీ కల్యాణ వేంకటేశ్వర స్వామి ఆలయంలో ధనుర్మాస మహోత్సవాలలో భాగంగా శనివారం పూలంగి సేవను నిర్వహించారు.
బొబ్బిలి, డిసెంబరు 28 (ఆంధ్రజ్యోతి): పట్టణంలోని కంచర వీధిలో గల శ్రీ కల్యాణ వేంకటేశ్వర స్వామి ఆలయంలో ధనుర్మాస మహోత్సవాలలో భాగంగా శనివారం పూలంగి సేవను నిర్వహించారు. మూల విరాట్‌తో పాటు, ఇతర ఉత్సవ విగ్ర హాలను, ఆలయ ప్రాంగణాన్ని పూలతో అలంకరించారు. కడి యం ప్రాంతం నుంచి 700 కిలోల పూలను తెప్పించారు. వంద ల మంది భక్తులు స్వచ్ఛందంగా అలంకరించారు. చామంతులు, జరపరాలు, చిట్టిగులాబీలు, బ్లూడేస్, స్టార్ చామంతులు వంటి వివిధ రకాల పూలతో మొత్తం ఆలయ ప్రాంగణమంతటినీ చూడముచ్చటగా అలంకరించారు. అర్చకులు పొందూరు శ్రీని వాసాచార్యులు, రేజేటి పార్థసారఽథి ఆధ్వర్యంలో వేదపండితులు ప్రత్యేక పూజాది కార్యక్రమాలు నిర్వహించారు. పాశురాలు, విష్ణు సహస్ర నామ స్ర్తోత్ర పారాయణం, గోవింద నామార్చన వంటివి చేశారు. బేడా సేవ నిర్వహించారు. నాదనీరాజనం పేరుతో కూచిపూడి నృత్యప్రదర్శన ఏర్పాటు చేశారు. ఈ కార్య క్రమాలతో పాటు ఆలయాన్ని తిలకించేందుకు... స్వామి వారిని దర్శించుకునేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. చిన్నారులు వేసిన చిత్రాలు అందరినీ ఆకట్టుకున్నాయి.