Share News

Polavaram Project: పోలవరం ప్రాజెక్టును పరిశీలించిన సీఎం చంద్రబాబు

ABN , Publish Date - Jun 17 , 2024 | 12:38 PM

CM Chandrababu Naidu Vistis Polavaram: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పోలవరం చేరుకున్నారు. ప్రత్యేక హెలికాప్టర్‌లో పోలవరం వద్దకు వచ్చిన సీఎం చంద్రబాబు.. ప్రాజెక్టుపై ఏరియల్ సర్వే నిర్వహించారు. అనంతరం ప్రాజెక్టును నేరుగా సందర్శించారు. ఈ సందర్భంగా టీడీపీ శ్రేణులు ఘన స్వాగతం పలికాయి.

Polavaram Project: పోలవరం ప్రాజెక్టును పరిశీలించిన సీఎం చంద్రబాబు
Polvaram Project

CM Chandrababu Naidu Vistis Polavaram: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పోలవరం చేరుకున్నారు. ప్రత్యేక హెలికాప్టర్‌లో పోలవరం వద్దకు వచ్చిన సీఎం చంద్రబాబు.. ప్రాజెక్టుపై ఏరియల్ సర్వే నిర్వహించారు. అనంతరం ప్రాజెక్టును నేరుగా సందర్శించారు. ఈ సందర్భంగా టీడీపీ శ్రేణులు ఘన స్వాగతం పలికాయి. పోలవరం ప్రాజెక్టు హిల్ వ్యూ వద్ద ప్రజాప్రతినిధులందరినీ చంద్రబాబు పలకరించారు. అనంతరం పోలవరం ప్రాజెక్టు హిల్ వ్యూ నుంచి స్పిల్ వే ను పరిశీలించారు సీఎం.


ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తరువాత సీఎం చంద్రబాబు అమరావతి నుంచి నేరుగా పోలవరం చేరుకున్నారు. తొలుత ఏరియల్ సర్వే నిర్వహించి పోలవరం ప్రాజెక్టును పరిశీలించారు. అధికారంలోకి వచ్చిన 5వ రోజే ప్రాజెక్టును సీఎం చంద్రబాబు సందర్శించారు. అధికారులతో కలిసి ప్రాజెక్టు ప్రాంతంలో కలియతిరిగారు. స్పిల్‌ వే, కాఫర్ డ్యామ్, డయాఫ్రమ్ వాల్ పరిశీలించారు. ప్రాజెక్టు ప్రాంతాన్ని వ్యూపాయింట్ నుంచి సీఎం సందర్శించారు. 22, 23 గేట్ల దగ్గర ప్రాజెక్టును చంద్రబాబు పరిశీలించారు. పోలవరం పనులు జరుగుతున్న తీరును అధికారులు సీఎం చంద్రబాబుకు వివరించారు. అనంతరం ఎడమగట్టు దగ్గర కుంగిన గైడ్‌బండ్ ప్రాంతాన్ని సీఎం పరిశీలించారు.


ఇదిలాఉంటే.. పోలవరం కుడి కాల్వను ఎక్కడి వరకు పొడిగించవచ్చు? అని అధికారులను ఆరా తీశారు సీఎం చంద్రబాబు. నీటిని గరిష్టంగా ఉపయోగించుకునే అవకాశాలను పరిశీలించాలన్నారు. వైకుంఠపురం వరకు కుడి కాలువను పొడిగించడానికి.. సాధ్యాసాధ్యాలను పరిశీలించాలని అధికారులను ఆదేశించారు సీఎం. మరికాసేపట్లో ప్రాజెక్టుకు సంబంధించి అధికారులు, కాంట్రాక్ట్ ఏజేన్సీలతో సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించనున్నారు.

For More Andhra Pradesh News and Telugu News..

Updated Date - Jun 17 , 2024 | 01:05 PM