Share News

Chalasani: తెలుగు రాష్ట్రాల సీఎంల భేటీ ఎంతో చారిత్రాత్మకం...

ABN , Publish Date - Jul 05 , 2024 | 02:55 PM

Andhrapradesh: రేపు (శనివారం) జరగబోయే ఉభయ తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమావేశం ఎంతో చారిత్రాత్మకమైనదని ఏపీ ప్రత్యేక హోదా విభజన హామీల సాధన సమితి కన్వీనర్ చలసాని శ్రీనివాస్ అన్నారు. శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ.. ఇరు రాష్ట్రాల మధ్య ఆస్తులు, నీటి, విద్యుత్ వాటాల సమస్య తగువులు లేకుండా సాగాలని కోరుకుంటున్నామన్నారు.

Chalasani: తెలుగు రాష్ట్రాల సీఎంల భేటీ ఎంతో చారిత్రాత్మకం...
Chalasani srinivas

పశ్చిమగోదావరి, జూలై 5: రేపు (శనివారం) జరగబోయే ఉభయ తెలుగు రాష్ట్రాల (Telugu states) ముఖ్యమంత్రుల సమావేశం ఎంతో చారిత్రాత్మకమైనదని ఏపీ ప్రత్యేక హోదా విభజన హామీల సాధన సమితి కన్వీనర్ చలసాని శ్రీనివాస్ (Chalasani Srinivas) అన్నారు. శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ.. ఇరు రాష్ట్రాల మధ్య ఆస్తులు, నీటి, విద్యుత్ వాటాల సమస్య తగువులు లేకుండా సాగాలని కోరుకుంటున్నామన్నారు. రేపు 233 ఉమ్మడి సంస్థలకు చెందిన లక్షా 43 వేల కోట్ల ఉమ్మడి ఆస్తుల పంపకంపై చర్చ సాగాలని అన్నారు. అందులో ఏపీకి 58 శాతం, తెలంగాణకు 42 శాతం ఆస్తులు పంచాలని కేంద్రం విభజన హామీ చట్టంలో స్పష్టంగా ఉందని ఆయన తెలిపారు.

YSRCP: బైరెడ్డి సిద్దార్థ్ రెడ్డికి బిగ్ షాక్.. హ్యాండిచ్చేశారుగా..!


ఆస్తుల పంపకం పేరిట ఇరు రాష్ట్రాలకు చెందిన 13 కోట్ల మంది ప్రజల మధ్య రాజకీయ పార్టీలు చిచ్చు పెట్టొద్దని సూచించారు. అవసరమైతే ఇరు రాష్ట్రాల హక్కుల కోసం ముఖ్యమంత్రులు ఇద్దరూ కేంద్రంపై పోరాడాలని అన్నారు. పోలవరం నిర్మాణంలో వేగవతం చేయాలి పునరావాసం చర్యలు న్యాయబద్ధంగా సాగాలని కోరారు. తెలుగు ప్రజల శ్రమతో నిర్మించిన శ్రీశైలం, నాగార్జున డ్యామ్‌ల నిర్వహణను ఆదానికి అప్పగిస్తే వ్యతిరేకిస్తామని అన్నారు. విశాఖ ఉక్కు పరిశ్రమను కాపాడుకోపోతే ఇరువురు ముఖ్యమంత్రులు చరిత్రలో ప్రజా ద్రోహులుగా నిలిచిపోతారని చలసాని శ్రీనివాస్ వ్యాఖ్యలు చేశారు.


ఇవి కూడా చదవండి...

TTD: తిరుమల అన్న ప్రసాదంపై టీటీడీ కీలక నిర్ణయం

TDP MP: ప్రత్యేకత చాటుకున్న ఎంపీ కలిశెట్టి

Read Latest AP News And Telugu News

Updated Date - Jul 05 , 2024 | 04:15 PM