Share News

AP NEWS: ఇంటికి కొరియర్.. ఓపెన్ చేయగానే డెడ్‌‌బాడీ... ఎవరిదంటే..

ABN , Publish Date - Dec 20 , 2024 | 09:08 AM

పశ్చిమగోదావరి జిల్లాలో ఓ పార్సిల్‌ను స్థానికులు తీవ్ర భయాందోళలనకు గురి అయ్యారు. సాధారణంగా పార్సిల్‌‌లో ఏమైనా వస్తువులు వస్తుంటాయి. కానీ యoడగండిలో వచ్చిన పార్సిల్‌లో మాత్రం వ్యక్తి మృతదేహం తీవ్ర కలకలం సృష్టించింది.

AP NEWS: ఇంటికి కొరియర్.. ఓపెన్ చేయగానే డెడ్‌‌బాడీ... ఎవరిదంటే..

పశ్చిమగోదావరి: పశ్చిమగోదావరి జిల్లాలో ఓ పార్సిల్ కలకలం సృష్టించింది. సాధారణంగా పార్సిల్‌లో ఏమైనా వస్తువులు వస్తాయి కానీ పశ్చిమగోదావరి జిల్లాలోని ఉండి మండలం యoడగండిలో మాత్రం ఓ పార్సిల్‌లో మృతదేహం వచ్చింది. ఇది చూసిన వారు తీవ్ర భయాందోళలనకు గురయ్యారు. వివరాల్లోకి వెళ్తే.. యoడగండిలో పార్సిల్‌గా ఓ వ్యక్తి డెడ్ బాడీ వచ్చింది. జగనన్న కాలనీలో ఇంటిని నిర్మిస్తున్న సాగి తులసి అనే మహిళకు ఈ పార్సిల్ వచ్చింది.


ఇంటి సామగ్రితో పాటు పార్సిల్‌గా ఓ వ్యక్తి డెడ్‌బాడీ రావడంతో తీవ్ర సంచలనంగా మారింది. ఈ పార్సిల్ రాజమండ్రి క్షత్రియ పరిషత్ నుంచి వచ్చినట్లు సమాచారం. సాగి తులసి నిర్మిస్తున్న ఇంటికి సామగ్రిని రాజమండ్రి క్షత్రియ పరిషత్ నిర్వాహకులు సరఫరా చేస్తుంటారు. ఆ మహిళకు ఇంటి సామాన్లను ఓ ఆటో డ్రైవర్ తీసుకుని వచ్చాడు. ఆ తర్వాత అతను తులసికు ఫోన్ చేసి ఇంటికి సంబంధించిన వస్తువులు వచ్చాయని తెలిపాడు.


సదరు మహిళ ఆ సామాన్లను తీసుకుంది. ఈరోజు ఉదయం ఆ వస్తువులను తెరవగానే ఒక్కసారిగా షాక్‌కు గురి అయింది. ఆ పార్సిల్‌లో వ్యక్తి మృతదేహం చూసి భయపడిపోయింది. అక్కడున్న స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. ఈ పార్సిల్‌ ఎలా వచ్చిందనే దానిపై పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు. అసలు ఈ పార్సిల్ ఎక్కడి నుంచి వచ్చింది. పార్సిల్ తెచ్చిన సదరు వ్యక్తి కదలికలపై సైతం పోలీసులు నిఘా పెట్టారు. ఆవ్యక్తిని అదుపులోకి తీసుకుని పోలీసులు విచారిస్తున్నారు. అయితే ఈ పార్సిల్‌పై పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.


ఈ వార్తలు కూడా చదవండి

Bhuvaneshwari: కుప్పంలో రెండో రోజు నారా భువనేశ్వరి పర్యటన..

Read Latest AP News and Telugu News

Updated Date - Dec 20 , 2024 | 02:41 PM