IIIT: ట్రిపుల్ ఐటీ ప్రవేశాలలో బాలికలదే పైచేయి..
ABN , Publish Date - Jul 11 , 2024 | 04:05 PM
Andhrapradesh: రాష్ట్రంలోని నాలుగు ట్రిపుల్ ఐటీల్లో (IIIT) ఎంపికైన విద్యార్థుల (Students) జాబితాను రాజీవ్ గాంధీ యూనివర్సిటీ అధికారులు గురువారం విడుదల చేశారు. ఈ ఏడాది ట్రిపుల్ ఐటీ ప్రవేశాలలో బాలికలదే పైచేయిగా నిలిచింది. మొత్తం 67.15 శాతం మంది విద్యార్థులు ఎంపికైనట్లు అధికారులు తెలిపారు.
ఏలూరు, జూలై 11: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని (Andhrapradesh) నాలుగు ట్రిపుల్ ఐటీల్లో (IIIT) ఎంపికైన విద్యార్థుల (Students) జాబితాను రాజీవ్ గాంధీ యూనివర్సిటీ (RajivGandhi University) అధికారులు గురువారం విడుదల చేశారు. ఈ ఏడాది ట్రిపుల్ ఐటీ ప్రవేశాలలో బాలికలదే పైచేయిగా నిలిచింది. మొత్తం 67.15 శాతం మంది విద్యార్థులు ఎంపికైనట్లు అధికారులు తెలిపారు. నూజివీడు, ఒంగోలు, శ్రీకాకుళం, ఆర్కే వ్యాలీ ట్రిపుల్ ఐటీల్లో 2024-25 అడ్మిషన్స్‌కు 4,400 సీట్ల భర్తీకి 53,863 మంది విద్యార్థులు ఆన్‌లైన్‌లో నమోదు చేసుకున్నారు. ఈ ఏడాది ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి అధిక స్థాయిలో విద్యార్థులు ఉత్సాహం కనబరచారు.
Nara Lokesh: సమస్యలపై పోటెత్తిన మెసేజ్‌లు.. వాట్సాప్ బ్లాక్
ట్రిపుల్ ఐటీ విద్యాభ్యాసంకు 93 శాతం ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు ఎంపికవ్వగా, 7 శాతం ప్రైవేటు విద్యా సంస్థల విద్యార్థులకు దక్కింది.రాష్ట్ర వ్యాప్తంగా అత్యధికంగా 498 సీట్లు సాధించిన జిల్లా శ్రీకాకుళం కాగా.. అలాగే విజయనగరం జిల్లా 286 సీట్లు సాధించింది. జులై 22 నుంచి 27 వరకు ఎంపికైన విద్యార్థులకు కౌన్సిలింగ్ ఉండనుంది. అలాగే ఆగస్టు నెలలో తరగతులు ప్రారంభంకానున్నాయి. ఎంపికైన విద్యార్థుల జాబితాను ఆర్జియుకేటి వెబ్‌సైట్‌లో పెట్టి, కౌన్సిలింగ్‌కు హాజరయ్యే విద్యార్థులకు కాల్ లెటర్స్, మెసేజ్‌లను యూనివర్సిటీ అధికారులు పంపించనున్నారు.
ఇవి కూడా చదవండి...
KTR: ‘ఈమహా నగరానికి ఏమైంది?’.. కేటీఆర్ షాకింగ్ ట్వీట్
Ponnam Prabhakar: కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి హైదరాబాద్‌కి ఏం తెచ్చాడు
Read Latest AP News And Telugu News