Gold: అతి తెలివితో నగలు కొట్టేసిన మహిళలు... కంగుతిన్న యాజమాన్యం
ABN , Publish Date - Jul 06 , 2024 | 12:19 PM
Andhrapradesh: రాష్ట్రంలో దొంగలు రెచ్చిపోతున్నారు. ఇళ్లు, దుకాణాలు ఇలా వేటినీ వదలకుండా దోపిడీకి పాల్పడుతున్నారు. అలాగే దొంగతం చేసే సమయంలోనూ వారు అతి తెలివిని ప్రదర్శిస్తూ ఎదుటి వారిని ఈజీగా బురిడీ కొట్టిస్తున్నారు. బంగారం షాపుల్లోకి కొనుగోలుదారులుగానే వస్తూ.. షాపు యాజమాన్యం కన్ను గప్పి మరీ దొంగతనం చేసి సేఫ్‌గా తప్పించుకుంటున్నారు.
పశ్చిమగోదావరి, జూలై 6: రాష్ట్రంలో దొంగలు రెచ్చిపోతున్నారు. ఇళ్లు, దుకాణాలు ఇలా వేటినీ వదలకుండా దోపిడీకి పాల్పడుతున్నారు. అలాగే దొంగతం చేసే సమయంలోనూ వారు అతి తెలివిని ప్రదర్శిస్తూ ఎదుటి వారిని ఈజీగా బురిడీ కొట్టిస్తున్నారు. బంగారం షాపుల్లోకి కొనుగోలుదారులుగానే వస్తూ.. షాపు యాజమాన్యం కన్ను గప్పి మరీ దొంగతనం చేసి సేఫ్‌గా తప్పించుకుంటున్నారు. ఇలాంటి ఘటనే పశ్చిమగోదావరి జిల్లాలో (West Godavari) చోటు చేసుకుంది.
Yarapathineni: టీడీపీ ఎమ్మెల్యే యరపతినేని వీడియో వైరల్.. ఆశ్చర్యపోతున్న వైసీపీ శ్రేణులు
ఇదీ జరిగింది....
పశ్చిమగోదావరి జిల్లా ఆకివీడులో ఘరానా మోసం వెలుగులోకి వచ్చింది. జ్యూవెలరీ షాపులోకి ప్రవేశించిన ఇద్దరు మహిళలు తెలివిగా నగలను కొట్టేసి... మెల్లిగా అక్కడి నుంచి జారుకున్నారు. ఇద్దరు మహిళలు స్థానికంగా ఉన్న శ్రావణి జ్యూవెలరీ షాపుకు నగలు కొనేవారిలా వచ్చారు. దీంతో జ్యువెలరీ షాపులోని వారు.. సదరు మహిళలకు నగలను చూపించారు. అయితే నగలను చూస్తున్నట్టు నటించిన మహిళలు.. ఎవరికీ అనుమానం రాకుండా బంగారు నగల స్థానంలో నకిలీ నగలను పెట్టి చోరీ చేశారు. అనంతరం ఏమీ తీసుకోకుండానే వచ్చిన దారినే వెళ్లిపోయారు.
Kodali Nani: కొడాలి నానికి మరో బిగ్ షాక్..
అయితే మహిళలు వెళ్ళిపోయిన తరువాత.. షాపులోని వర్కర్ గఫూర్‌కు అనుమానం వచ్చి నగలను పరిశీలించారు. దీంతో అసలు విషయం బయటపడింది. వారు నకిలీ నగలు పెట్టి అసలు నగలను దోచుకెళ్లిన విషయాన్ని వర్కర్ గుర్తించాడు. వెంటనే షాపు యాజమనానికి విషయాన్ని తెలియజేశాడు. దాదాపు రెండు లక్షల 40వేల రూపాయలు విలువైన వస్తువులను మహిళలు మాయం చేసి పట్టుకుపోయారు. షాపు యాజమాన్యం ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
ఇవి కూడా చదవండి...
Viral: వామ్మో.. తనను కరిచిన పామును తిరిగి కరిచాడు.. తర్వాతేం జరిగిందో తెలిస్తే షాకవ్వాల్సిందే..!
Satyakumar: ఏపీలో గత ఐదేళ్లలో ఆర్థిక విధ్వంసం...
Read Latest AP News And Telugu News