AP News: ఎంతటి దుర్మార్గం... పొలం కౌలుకు తీసుకుని రైతునే గెంటేసిన వైసీపీ నేత
ABN , Publish Date - Jul 26 , 2024 | 01:23 PM
Andhrapradesh: ‘‘చింత చచ్చినా పులపు చావదు’’ అన్న సామెతగా ఉంది వైసీపీ నేతల ఆకృత్యాలు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో వైసీపీ ఘోర ఓటమిని చవిచూసి.. అధికారాన్ని కోల్పోయినప్పటికీ వారి ఆగడాలకు మాత్రం అడ్డుకట్ట వేయడం లేదు. పలు చోట్ల బరితెగింపులకు దిగుతున్నారు వైసీపీ నేతలు. పైకి మాత్రం అబ్బే.. మావాళ్ల మీదే దాడులు చేస్తున్నారంటూ స్టేట్‌మెంట్లు ఇస్తున్నారు. అంతే కాదు ఏపీలో శాంతిభద్రతలు లేవంటూ ఏకంగా దేశరాజధాని ఢిల్లీకి వెళ్లిమరీ ధర్నాలు చేస్తున్నారు.
ఏలూరు, జూలై 26: ‘‘చింత చచ్చినా పులపు చావదు’’ అన్న సామెతగా ఉంది వైసీపీ నేతల ఆకృత్యాలు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో వైసీపీ (YSRCP) ఘోర ఓటమిని చవిచూసి.. అధికారాన్ని కోల్పోయినప్పటికీ వారి ఆగడాలకు మాత్రం అడ్డుకట్ట వేయడం లేదు. పలు చోట్ల బరితెగింపులకు దిగుతున్నారు వైసీపీ నేతలు. పైకి మాత్రం అబ్బే.. మావాళ్ల మీదే దాడులు చేస్తున్నారంటూ స్టేట్‌మెంట్లు ఇస్తున్నారు. అంతే కాదు ఏపీలో శాంతిభద్రతలు లేవంటూ ఏకంగా దేశరాజధాని ఢిల్లీకి వెళ్లిమరీ ధర్నాలు చేస్తున్నారు. కానీ రాష్ట్రంలో వైసీపీ నేతలు ఇంకా అరాచకాలకు తెగబడుతున్నారనే దానికి ఏలూరు జిల్లాలో జరిగిన ఘటనే ఉదాహరణ.
Yanamala: జగన్‌పై యనమల సంచలన వ్యాఖ్యలు... ఏ విషయంపై అంటే?
ఇదీ జరిగింది...
జిల్లాలోని ద్వారకాతిరుమల మండలం తిమ్మాపురంలో వైసీపీ నాయకుడు బరితెగించాడు. ఓ రైతు పొలాన్ని కౌలుకి తీసుకుని దర్జాగా దాన్ని కబ్జా చేసి, అసలు రైతునే తన సొంత పొలంలోకి రాకుండా దౌర్జన్యం చేస్తూ దురుసుగా ప్రవర్తించాడు. ద్వారకాతిరుమల మండలం గొల్లగూడెం గ్రామానికి చెందిన కనీగోళ్ళ కిషోర్ అనే వ్యక్తికి తిమ్మాపురం గ్రామంలో సర్వే నెంబర్ 48/2,48/3లో తన తల్లికి చెందిన 3.87 ఎకరాల భూమి ఉంది. అయితే కొన్నేళ్ల క్రితం తిమ్మాపురం గ్రామానికి చెందిన రాయుడు అనే వ్యక్తికి కౌలుకి ఇచ్చాడు. కొంతకాలం తర్వాత వారిద్దరికీ గొడవలు జరిగాయి.
AP Assembly Session 2024: అసెంబ్లీ తెరపై జగన్ పాపాలు .. ఆర్థిక శాఖపై శ్వేతపత్రం విడుదల
అంతేకాకుండా పొలాన్ని కౌలుకు తీసుకున్న రాయుడు వైసీపీ నేత కావడంతో బరితెగింపుకు పాల్పడ్డాడు. ఏకంగా పొలం కౌలుకు ఇచ్చిన కిషోర్‌నే పొలం నుంచి నిర్దాక్షణ్యంగా గెంటేసి కబ్జా చేశారు. అంతటితో ఆగకుండా ఏకంగా కిషోర్‌పై రాయుడు దాడికి తెగబడ్డారు. తాజాగా పొలంలో నిమ్మ చెట్లను నరికి వేస్తూ... కిషోర్ పొలంలోకి వస్తే చంపేస్తానని బెదిరింపులకు పాల్పడ్డాడు. దాంతో కిషోర్ ఏం చేయాలో తెలియని స్థితిలో ఉండిపోయాడు. గత వైసీపీ ప్రభుత్వంలో తనకు న్యాయం జరగలేదని, ప్రస్తుత కూటమి ప్రభుత్వం అయినా న్యాయం చేయాలని కిషోర్ కోరుతున్నాడు.
ఇవి కూడా చదవండి..
Japan: జపాన్‌లో భారీగా తగ్గుతున్న జనాభా.. ఎందుకో తెలుసా
YS Jagan: అప్పులపై బాబు తప్పుదోవ పట్టిస్తున్నారు.. శ్వేతపత్రాలపై జగన్ స్పందన
Read latest AP News And Telugu News