Share News

Sajjala: ఆ వృద్ధులు చనిపోయింది ప్రమాదవశాత్తూ మాత్రమే.. చంద్రబాబుపై సజ్జల విమర్శలు

ABN , Publish Date - Apr 06 , 2024 | 02:56 PM

Andhrapradesh: ఏపీలో పెన్షన్ల పంపిణీ అంశం ఎంతటి దుమారాన్ని రేపిందో అందరికీ తెలిసిందే. ఇస్తామన్న సమయకంటే ఆలస్యంగా పెన్షన్ల పంపిణీ జరిగింది. ఈ క్రమంలో పెన్షన్లు తీసుకోడానికి సచివాలయాలకు వచ్చిన వృద్ధులు మండుటెండలో తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. కొందరు తనువులు కూడా చాలించారు. ఈ వ్యవహారాన్ని టీడీపీ సీరియస్‌ తీసుకుని ఈసీకి లేఖలు కూడా రాసింది. అయితే వృద్ధులు చనిపోవడంపై తాజాగా వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి స్పందిస్తూ... టీడీపీ, చంద్రబాబుపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.

Sajjala: ఆ వృద్ధులు చనిపోయింది ప్రమాదవశాత్తూ మాత్రమే.. చంద్రబాబుపై సజ్జల విమర్శలు

అమరావతి, ఏప్రిల్ 6: ఏపీలో (Andhrapradesh) పెన్షన్ల పంపిణీ అంశం ఎంతటి దుమారాన్ని రేపిందో అందరికీ తెలిసిందే. ఇస్తామన్న సమయకంటే ఆలస్యంగా పెన్షన్ల పంపిణీ జరిగింది. ఈ క్రమంలో పెన్షన్లు తీసుకోడానికి సచివాలయాలకు వచ్చిన వృద్ధులు మండుటెండలో తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. కొందరు తనువులు కూడా చాలించారు. ఈ వ్యవహారాన్ని టీడీపీ సీరియస్‌గా తీసుకుని ఈసీకి లేఖలు కూడా రాసింది. అయితే వృద్ధులు చనిపోవడంపై తాజాగా వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి (YCP Leader Sajjala Ramakrishna Reddy) స్పందిస్తూ... టీడీపీ, చంద్రబాబుపై (TDP Chief Chandrababu Naidu) తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.

Viral video : కోతులు దాడి చేస్తే, అలెక్సా సాయంతో బాలిక ప్రాణాన్ని కాపాడింది..!


పెన్షన్ అందుకునే క్రమంలో కొంతమంది వృద్దులు దురదృష్ట వశాత్తూ చనిపోయారని.. దానిపై టీడీపీ అధినేత చంద్రబాబు ఈసీకి లేఖలు రాసి యాగీ చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పెన్షన్‌లు ఇళ్ళ దగ్గరకు చేరకుండా లెటర్ పెట్టించింది చంద్రబాబు అని అన్నారు. ఏపీ బీజేపీ చీఫ్ పురంధరేశ్వరి అజెండా అంతా చంద్రబాబు ది అంటూ వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో ఉన్న అధికారులు అందర్నీ మార్చాలని లేఖ రాశారన్నారు. ఎన్టీఆర్‌కు వెన్నుపోటులో కూడా చంద్రబాబు‌కు పురంధరేశ్వరి సహకారం ఉందని ఆరోపించారు.


షర్మిల పెయిడ్ ఆర్టిస్ట్‌గా ఎందుకు మారారు?

ఎన్నికలు దగ్గరకు రాగానే చంద్రబాబు పెన్షన్ నాలుగు వేలు ఇస్తా అని అంటున్నారని.. చంద్రబాబు హయాంలో ఏనాడైనా ఉచిత ఇసుక ఇచ్చారా? అని ప్రశ్నించారు. ఎన్నికల సంఘంపై తాము ఎలాంటి ఆరోపణలు చేయడం లేదన్నారు. వివేకా హత్య ఎన్నికల అజెండా కావాలని షర్మిల (APCC Chief YS Sharmila Reddy) కోరుకుంటే కొద్దీ రోజుల్లో తెలుస్తుందన్నారు. షర్మిల పెయిడ్ ఆర్టిస్ట్‌గా ఎందుకు మారారు అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు అజెండా షర్మిల మాట్లాడుతున్నారన్నారు. చంద్రబాబు ఫస్ట్రేషన్ పరాకాష్టకు చేరిందని.. ఆయన మాటలు చూస్తే ప్రజలకు అర్థం అవుతుందన్నారు.

Uttam Kumar Reddy: షాకింగ్ న్యూస్ చెప్పిన ఉత్తమ్.. అదే జరిగితే..


టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ప్రయోగం వికటించిందన్నారు. కూటమి ఉనికే ప్రశ్నార్థకం అయ్యిందని తెలిపారు. 2019 ఎన్నికల కంటే ఘోరంగా టీడీపీ పరాభవం చెందుతుందని అన్నారు. ఈ ఎన్నికల తరువాత టీడీపీ ఆంధ్ర ప్రదేశ్‌లో కనుమరుగు అవుతుందన్నారు. చంద్రబాబు పిల్ల చాష్టలు చేస్తున్నారంటూ వ్యాఖ్యలు చేశారు. 2019 చంద్రబాబు అధికారంలో ఉండి కూడా అధికారులను దబాయించారన్నారు. చంద్రబాబుకు వ్యవస్థలపై ఉండే గౌరవం ఇది అని అన్నారు. వృద్ధుల పెన్షన్‌ల విషయంలో చంద్రబాబు దుర్మార్గంగా వ్యవహరించారని సజ్జల రామకృష్ణా రెడ్డి దుయ్యబట్టారు.


ఇవి కూడా చదవండి...

YS Jagan: మళ్లీ తెర మీదకు అదో రాజకీయం..!

West Bengal: దీదీతో గొడవకు కారణం ఆ మంత్రే.. బెంగాల్ గవర్నర్ సంచలనం

మరిన్ని ఏపీ వార్తల కోసం...

Updated Date - Apr 06 , 2024 | 03:01 PM