AP Elections: టీడీపీలో చేరుతున్నా.. సడన్ షాకిచ్చిన వైసీపీ ఎంపీ!
ABN , Publish Date - Feb 26 , 2024 | 12:24 PM
YSRCP Vs TDP: ఆంధ్రప్రదేశ్ సార్వత్రిక ఎన్నికల ముందు వైసీపీకి మరో బిగ్ షాక్ తగిలింది. ఈ మధ్యే వైసీపీకి రాజీనామాకు చేసిన యంగ్ ఎంపీ.. తిరిగి పార్టీలోకి వస్తారని ప్రచారం జరిగింది. అయితే అవన్నీ పుకార్లేనని కొట్టిపారేసిన ఆయన.. మనసులోని మాటను బయటపెట్టారు. అవును.. మళ్లీ వైసీపీలో చేరే ఉద్దేశమే లేదని.. త్వరలోనే టీడీపీ తీర్థం పుచ్చుకుంటున్నట్లు ఫుల్ క్లారిటీ ఇచ్చుకున్నారు...
పల్నాడు: ఆంధ్రప్రదేశ్ సార్వత్రిక ఎన్నికల ముందు వైసీపీకి మరో బిగ్ షాక్ తగిలింది. ఈ మధ్యే వైసీపీకి రాజీనామాకు చేసిన యంగ్ ఎంపీ.. తిరిగి పార్టీలోకి వస్తారని ప్రచారం జరిగింది. అయితే అవన్నీ పుకార్లేనని కొట్టిపారేసిన ఆయన.. మనసులోని మాటను బయటపెట్టారు. అవును.. మళ్లీ వైసీపీలో చేరే ఉద్దేశమే లేదని.. త్వరలోనే టీడీపీ తీర్థం పుచ్చుకుంటున్నట్లు ఫుల్ క్లారిటీ ఇచ్చుకున్నారు. ఇంతకీ ఎవరా ఎంపీ.. ఇప్పుడెందుకీ చర్చ..? అనే విషయాలు చూసేద్దాం రండి..
ఇదిగో ఈయనే..
త్వరలో టీడీపీ (TDP)లో చేరుతున్నానని చెప్పి వైసీపీ ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు (Lavu Srikrishnadevarayalu) తెలిపారు. ఈ మేరకు నరసరావుపేట పార్లమెంట్ (Parliament) ప్రజలకు ఆయన ఒక లేఖ రాశారు. ఐదేళ్లుగా ప్రజలు తనపై చూపించిన ప్రేమ, అభిమానం మరువలేనన్నారు. తన తదుపరి రాజకీయ కార్యాచరణ గురించి అందరూ అడుగుతున్నారన్నారు. పల్నాడు జిల్లా అభివృద్ధి కోసం మళ్లీ తాను ఎన్నికల్లో పోటీ చేయబోతున్నానన్నారు.
వస్తున్నా..!
త్వరలో అధినేత చంద్రబాబు (Chandrababu) సమక్షంలో టీడీపీలో చేరనున్నానని లావు శ్రీకృష్ణదేవరాయలు క్లారిటీ ఇచ్చారు. ‘నరసరావుపేట ఎంపీ అభ్యర్థిగా మళ్లీ మీ ముందుకు వస్తున్నా’నని తెలిపారు. గత ఐదేళ్లలో ఎన్నో సవాళ్లను ఎదుర్కొని పల్నాడు అభివృద్ధికి కృషి చేశానని శ్రీకృష్ణదేవరాయలు తెలిపారు. మరోసారి అవకాశం ఇస్తే అభివృద్ధిని మరింత ముందుకు తీసుకెళతానన్నారు. వరికపూడిశెల ఎత్తిపోతల పథకాన్ని పూర్తి చేసి పల్నాడు ప్రజల చిరకాల కోరిక నెరవేరుస్తానని శ్రీకృష్ణదేవరాయలు తెలిపారు.
మరిన్ని ఏపీ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..