Share News

AP Elections 2024: టీడీపీ అభ్యర్థిపై వైసీపీ గుండా దాడి.. వీడియో వైరల్

ABN , Publish Date - May 13 , 2024 | 05:48 PM

పోలింగ్ రోజు కూడా వైసీపీ అరాచకాలు పెచ్చుమీరుతున్నాయి. పల్నాడు జిల్లా టీడీపీ అభ్యర్థి చదలవాడ అరవింద్‌బాబును(Chadalavada Arvind Babu) వైసీపీ మూకలు టార్గెట్ చేశారు.

AP Elections 2024: టీడీపీ అభ్యర్థిపై వైసీపీ గుండా దాడి.. వీడియో వైరల్

నరసరావుపేట: పోలింగ్ రోజు కూడా వైసీపీ అరాచకాలు పెచ్చుమీరుతున్నాయి. పల్నాడు జిల్లా టీడీపీ అభ్యర్థి చదలవాడ అరవింద్‌బాబును(Chadalavada Arvind Babu) వైసీపీ మూకలు టార్గెట్ చేశారు.

ఆయన వెళ్తున్న జీపును ఇవాళ వైసీపీకి(YSRCP) చెందిన ఓ సైకో వెంబడించాడు. అనంతరం కర్రతో జీపుపై ఇష్టానుసారం దాడి చేశాడు. దాడిలో జీపు అద్దాలన్నీ పగిలిపోయాయి. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. వైసీపీ నేతల అరాచకలపై ప్రజలు మండిపడుతున్నారు.


ఓటమి భయంతోనే టీడీపీని టార్గెట్ చేసుకుని దాడులకు పాల్పడుతున్నారని స్పష్టం అవుతోంది. నిందితులపై ఎన్నికల సంఘం అధికారులు చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.

దాడికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇవాళ ఉదయాన్నే తెనాలి వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి అన్నబత్తుని శివకుమార్‌ ఓ ఓటర్‌పై దాడి చేసిన విషయం తెలిసిందే.

Read Latest AP News and Telugu News

Read Latest Telangana News and National News

Updated Date - May 13 , 2024 | 05:49 PM