Share News

Stock Market Updates: నష్టాలతో ప్రారంభమైన స్టాక్ మార్కెట్లు.. ఇవే ట్రెండింగ్ స్టాక్స్

ABN , Publish Date - May 08 , 2024 | 09:45 AM

నేడు( మే 8న) దేశీయ స్టాక్ మార్కెట్లు(stock markets) వరుసగా నాలుగో రోజు కూడా నష్టాల్లోనే ప్రారంభమయ్యాయి. ఈ క్రమంలో ఉదయం 9.30 గంటల నాటికి సెన్సెక్స్ 286 పాయింట్లు క్షీణించి 73,225 వద్ద ప్రారంభమైంది. మరోవైపు నిఫ్టీ కూడా 71 పాయింట్లు పతనమై 22,231 వద్ద ప్రారంభమైంది.

Stock Market Updates: నష్టాలతో ప్రారంభమైన స్టాక్ మార్కెట్లు.. ఇవే ట్రెండింగ్ స్టాక్స్
stock market updates may 8th 2024 bse sensex

నేడు( మే 8న) దేశీయ స్టాక్ మార్కెట్లు(stock markets) వరుసగా నాలుగో రోజు కూడా నష్టాల్లోనే ప్రారంభమయ్యాయి. ఈ క్రమంలో ఉదయం 9.30 గంటల నాటికి సెన్సెక్స్ 286 పాయింట్లు క్షీణించి 73,225 వద్ద ప్రారంభమైంది. మరోవైపు నిఫ్టీ కూడా 71 పాయింట్లు పతనమై 22,231 వద్ద ప్రారంభమైంది. దీంతోపాటు బ్యాంక్ నిఫ్టీ, నిఫ్టీ మిడ్ క్యాప్ సూచీలు కూడా నష్టాల్లోనే మొదలయ్యాయి. గ్లోబల్ మార్కెట్‌లో ప్రతికూల ధోరణులు సహా పలు ఆందోళనల నేపథ్యంలో దేశీయ స్టాక్ మార్కెట్లో అమ్మకాల ఒత్తిడి పెరిగినట్లు తెలుస్తోంది.


ఈ నేపథ్యంలో ప్రస్తుతం డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్, లార్సెన్, HUL, ఏషియన్ పెయింట్స్, HDFC బ్యాంక్ సంస్థల స్టాక్స్ టాప్ 5 నష్టాల్లో ఉండగా, BPCL, కోల్ ఇండియా, టాటా స్టీల్, మారుతి సుజుకి, ONGC కంపెనీల స్టాక్స్ టాప్ 5 లాభాల్లో ఉన్నాయి. మంగళవారం ట్రేడింగ్ ముగిసే సమయానికి బీఎస్‌ఈ 30 షేర్ల బెంచ్‌మార్క్ సెన్సెక్స్ 383.69 పాయింట్లు క్షీణించి 73,511.85 పాయింట్ల వద్ద ముగిసింది. మరోవైపు నిఫ్టీ కూడా 140.20 పాయింట్లు క్షీణించి 22,302.50 పాయింట్ల వద్ద ముగిసింది.


ఈరోజు ఉదయం ఆసియా పసిఫిక్ స్టాక్ మార్కెట్లలో మిశ్రమ ట్రేడింగ్‌ కొనసాగుతున్న వేళ జపాన్‌కు చెందిన నిక్కీ 1 శాతం నష్టపోగా, టాపిక్స్ ఇండెక్స్ 0.88 శాతం పడిపోయింది. ఇక దక్షిణ కొరియా కోస్పి స్వల్పంగా క్షీణించింది. అదే సమయంలో ఆస్ట్రేలియా ASX200 0.08 శాతం పెరిగింది. మరోవైపు US స్టాక్స్ వాల్ స్ట్రీట్‌లో కూడా మిశ్రమ ట్రేడింగ్‌ నమోదైంది. డౌ జోన్స్, S&P 500 వరుసగా 0.08 శాతం, 0.13 శాతం స్వల్ప లాభాలను నమోదు చేశాయి. అయితే నాస్‌డాక్ మాత్రం 0.10 శాతం పడిపోయింది.


ఇది కూడా చదవండి:

Gold and Silver Rates: పసిడి ప్రియులకు షాక్..మళ్లీ పెరిగిన బంగారం, వెండి

IRCTC: 8 రోజులు, 7 రాత్రుల స్పెషల్ టూర్ ప్యాకేజీ.. శ్రీకృష్ణుడి ద్వారకా నగరం సహా ఇవి కూడా


Read Latest Business News and Telugu News

Updated Date - May 08 , 2024 | 09:50 AM