Gold and Silver Rates: పసిడి ప్రియులకు షాక్..మళ్లీ పెరిగిన బంగారం, వెండి
ABN , Publish Date - May 08 , 2024 | 06:34 AM
నేడు (మే 8న) బంగారం(gold), వెండి(silver) ధరలలో పెరుగుదల కనిపించింది. ఈ క్రమంలో భారతదేశంలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.200 పెరిగింది. దీంతో ఈరోజు ఉదయం 6.20 గంటల నాటికి ఢిల్లీ మార్కెట్‌లో 24 క్యారెట్ల బంగారం ధర రూ.72,540గా ఉంది.
నేడు (మే 8న) బంగారం(gold), వెండి(silver) ధరలలో పెరుగుదల కనిపించింది. ఈ క్రమంలో భారతదేశంలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.200 పెరిగింది. దీంతో ఈరోజు ఉదయం 6.20 గంటల నాటికి ఢిల్లీ మార్కెట్‌లో 24 క్యారెట్ల బంగారం ధర రూ.72,540గా ఉంది. ఇక 22 క్యారెట్ల బంగారం ధర రూ.66,510కు చేరుకుంది. ఇక హైదరాబాద్‌లో 24 క్యారెట్ల బంగారం ధర రూ.72,390గా ఉండగా, 22 క్యారెట్ల బంగారం ధర రూ.66,360కి చేరింది. గత కొన్ని రోజులుగా తగ్గిన పుత్తడి ధరలు క్రమంగా మళ్లీ పుంజుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో దేశంలోని వివిధ నగరాల్లో బంగారం, వెండి ధరలు ప్రస్తుతం ఎలా ఉన్నాయో ఇక్కడ చుద్దాం.
ప్రధాన నగరాల్లో 24 క్యారెట్, 22 క్యారెట్ 10 గ్రాముల బంగారం ధరలు
ఢిల్లీలో బంగారం ధర రూ. 72,540, ధర రూ. 66,510
హైదరాబాద్‌లో బంగారం ధర రూ. 72,390, ధర రూ. 66,360
చెన్నైలో బంగారం ధర రూ. 72,440, ధర రూ. 66,410
ముంబైలో బంగారం ధర రూ. 72,390, ధర రూ. 66,360
కోల్‌కతాలో బంగారం రూ. 72,390, ధర రూ. 66,360
వెండి ఎంత?
ఇక వెండి(silver) రేట్ల విషయానికి వస్తే ఇది కిలో రూ.700 పెరిగి రూ.85,000కి చేరింది. క్రితం ట్రేడింగ్ సెషన్ లో కిలో వెండి ధర రూ.84,300 వద్ద ముగిసింది. ఈ క్రమంలో ఢిల్లీలో కిలో వెండి ధర రూ.85,100గా ఉంది. హైదరాబాద్‌లో కేజీ వెండి రూ. 88,600, ముంబైలో రూ. 85,100, బెంగళూరులో రూ. 84,100, కోల్‌కతాలో రూ.85,100, చైన్నైలో రూ.88,600గా ఉంది.
గమనిక: ఈ బంగారం, వెండి ధరలు ఎప్పటికప్పుడూ మారుతూ ఉంటాయి. ఈ సమాచారం సూచికగా మాత్రమే ఉంటుంది.
ఇది కూడా చదవండి:
IRCTC: కాశ్మీర్ టూర్ ప్యాకేజీ.. అందాలు మిస్ అవ్వకండి
IRCTC: 8 రోజులు, 7 రాత్రుల స్పెషల్ టూర్ ప్యాకేజీ.. శ్రీకృష్ణుడి ద్వారకా నగరం సహా ఇవి కూడా
Read Latest Business News and Telugu News